
హర్షద్ మెహతా మరణించి ఏ లోకాన ఉన్నాడో బాలీవుడ్‌కు నాలుగు డబ్బులు సంపాదించి పెడుతున్నాడు. ఆయన జీవించి ఉండగా చాలామందిని ముంచాడు. కానీ మరణించాక బాలీవుడ్‌కు తానొక కథా వస్తువై డబ్బు ఇస్తున్నాడు. అతని బయోపిక్ ‘ది బిగ్‌బుల్’ టీజర్ విడుదలైంది. షేర్ల కుంభకోణంతో దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహతాను ఇన్నాళ్ల తర్వాత బాలీవుడ్ వెంటవెంటనే తెర మీద చూపింది. ఇప్పటికే అతని మీద ‘సోని లివ్’లో ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ వచ్చి భారీ హిట్ అయ్యింది.
ఇప్పుడు సినిమా వంతు. ఇందులో హర్షద్‌గా అభిషేక్ బచ్చన్ నటిస్తే నిర్మాత అజయ్ దేవ్‌గణ్. కుకీ గులాటీ దీని దర్శకుడు. తాజా దీని టీజర్ విడుదలైంది. దాంతో పాటు విడుదల తేదీగా ఏప్రిల్ 8ని ప్రకటించారు. డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. డైరెక్ట్‌గా సినిమాలు ప్రస్తుతం రిలీజ్ అవుతూ ఉన్నా అజయ్ దీనిని ఓటీటి ద్వారానే రిలీజ్ చేస్తున్నాడు. ‘చిన్నవాళ్లను పెద్ద కలలు కనడానికి ప్రపంచం అడ్డుపడుతుంటుంది. అందువల్ల చిన్నవాళ్లు తమదైన ప్రపంచాన్ని నిర్మించుకుంటారు’ అని అజయ్ దేవగణ్ వ్యాఖ్యానంతో ఈ టీజర్ రిలీజైంది. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా క్యాప్షెన్ పెట్టారు. అభిషేక్ బచ్చన్‌కు సరైన హిట్ లేక చాలా కాలం అవుతోంది. ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. పెద్దగా కమర్షియల్ హంగామాకు వీలులేని ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Introducing The Big Bull... The mother of all scams!!! Trailer out on 19th March. #TheBigBull releasing on 8th April only on @DisneyplusHSVIP, stay tuned! 📈#DisneyPlusHostarMultiplex
— Abhishek Bachchan (@juniorbachchan) March 16, 2021
@Ileana_Official @nikifyinglife @s0humshah @kookievgulati @ajaydevgn pic.twitter.com/U4v3S6odZj