hastam
-
TS: ముగిసిన ‘అభయ హస్తం’ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 8లక్షల 94 వేలు దాటిన దరఖస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. హైదరాబాద్‌లో దరఖాస్తుల సంఖ్య 21 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా గృహస్తుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించారని సీఎస్ శాంతకుమారి అధికారులను ఆదేశించారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: నిందితులకు వారెంట్ జారీ -
'ఆపరేషన్ హస్త'.. పొలిటికల్ వార్..
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికే 'ఆపరేషన్ హస్త' పేరుతో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లను కలుస్తున్నారు. యశ్వంతాపూర్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం పార్టీ మార్పేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను తమ రాజకీయ గురువుగా పేర్కొంటూ సోమశేఖర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల జేడీఎస్ నాయకుడు ఆయనూర్ మంజునాథ్ కూడా డిప్యూటీ సీఎం శివకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టనున్న ఆపరేషన్ హస్త వెలుగులోకి వచ్చింది. బీజేపీ నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకురావడమే దీని ప్రధాన ధ్యేయం. ఆపరేషన్ హస్త అనేది ఆపరేషన్ లోటస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యగా పరిగణించవచ్చు. 2019లో ఆపరేషన్ లోటస్‌లో భాగంగా 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. దీంతో అప్పట్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో కమల దళం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ మఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ఎమ్మెల్యేలతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. తమ సభ్యులు ఎవరూ ఫిరాయింపుకు సిద్ధంగా లేరని అన్నారు. తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. ఈ పరిణామాల అనంతరం బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి స్పందించాడు. కాంగ్రెస్ ఆపరేషన్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసని అన్నారు. దీనిపై శివకుమార్ కూడా స్పందించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో చేరమని ఎవరినీ పిలవట్లేదని అన్నారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
అజయ్ మాకన్ (కాంగ్రెస్) రాయని డైరీ
ఖర్గే పిలిపిస్తే వెళ్లాను. అక్బర్ రోడ్డులోని ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యాలయానికి ఆయన నన్ను పిలిపించలేదు. సఫ్దర్‌జంగ్ రోడ్డులోని తన నివాస గృహానికి పిలిపించారు! నేను వెళ్లేసరికి నా రాజీనామా లేఖ ఆయన కూర్చొని ఉన్న సోఫా ముందరి టీపాయ్ మీద చిన్నపాటి బరువుతో.. తండ్రి గుప్పెటలో బిగిసి ఉన్న తన చూపుడు వేలును విడిపించుకుని ముందుకు నడిచేందుకు ప్రయత్నిస్తున్న పిల్లవాడిలా ఉంది. ‘‘ఏమిటిది అజయ్?’’ అన్నారు ఖర్గే... ఒక తండ్రిలాగే! ఎందుకు రాజీనామా చేశావు అని అడగలేదు ఆయన! ‘‘ఎలాంటి సమయంలో నువ్వు రాజీనామా చేశావో తెలుసా?’’ అన్నారు! ‘‘జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తున్న సమయంలో.. రాజస్థాన్‌లో ఒక ఉప ఎన్నిక కూడా జరగబోతున్న సమయంలో.. పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు ఇన్చార్జి అయిన ఒక ప్రధాన కార్యదర్శి రాజీనామా చేశారంటే కాంగ్రెస్ ప్రతిష్ఠ ఏమౌతుందో ఆలోచించావా అజయ్!’’ అన్నారు. ‘‘పార్టీ ప్రతిష్ఠకు ఏమీ కాకుండా ఉండేందుకే రాజీనామా చేశాను ఖర్గేజీ..’’ అన్నాను. అప్పుడు కూడా ఆయన.. ‘‘రాజీనామా చేసి ఎక్కడికెళతావ్?’’ అన్నారే గానీ.. పార్టీ ప్రతిష్ఠకు వచ్చిన ముప్పు ఏమిటని గానీ, ఎందుకు రాజీనామా చేశావు అని గానీ అడగలేదు! ‘‘రాజీనామా చేసి ఎక్కడికీ వెళ్లబోవడం లేదు ఖర్గేజీ! ఢిల్లీలోనే ఉంటాను. కార్మిక సంఘాలను సంఘటితం చేస్తాను. ఎన్జీవోలతో మమేకం అవుతాను. ఢిల్లీ వాయు కాలుష్యంపై గళమెత్తుతాను. వీధి వర్తకుల సంక్షేమం కోసం కృషి చేస్తాను. మురికివాడల పురోభివృద్ధికి పాటు పడతాను..’’ అన్నాను. ఒక్కసారిగా భళ్లున నవ్వారు ఖర్గే! కోపంతో ఇల్లొదిలి వెళ్తున్న కొడుకుని ఆపి, ‘బయటికెళ్లి ఎలా బతుకుతావ్రా..’ అని అతి సంపన్నుడైన తండ్రి ప్రశ్నిస్తే.. ‘ఎలాగైనా బతుకుతాను. మూటలు మోస్తాను, ముష్టెత్తుకుంటాను. ఆటో నడుపుతాను. హోటళ్లలో ప్లేట్లు కడుగుతాను. ఇంటికైతే రాను..’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి నవ్విన నవ్వులా ఉంది ఖర్గే నవ్వడం. నవ్వీ నవ్వీ.. హఠాత్తుగా గంభీరంగా మారి, ‘‘పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం అన్నది పార్టీ అప్పగించిన బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపోయినంత సులభం కాదు అజయ్..’’ అన్నారు ఖర్గే! ‘‘గెహ్లోత్ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడం కూడా సులభం కాదా ఖర్గేజీ?!’’ అన్నాను. అందుకు ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘రాజస్థాన్ సీఎంగా ఉండిపోవడానికి గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతను కూడా తప్పించుకున్నారు. కానీ అతడిపై చర్యలేదు! సోనియాజీ మిమ్మల్నీ, నన్ను రాజస్థాన్‌కు పంపి పెట్టించిన సీఎల్పీ మీటింగ్‌కి తన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రాకుండా వారితో గెహ్లోత్ తిరుగుబాటు చేయించారు. కానీ అతడిపై చర్యలేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలలో ముగ్గురితో కలసి నన్ను భారత్ జోడో యాత్రకు వెళ్లమంటున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను. నా ప్రతిష్ఠ కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ కోసం..’’ అన్నాను. ఖర్గే నా వైపు ప్రయాసగా చూశారు. ‘‘గెహ్లోత్ తన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించారు. నువ్వు నీ రాజీనామాతో తిరుగుబాటు చేస్తున్నావు. అంతే కదా? పార్టీ అధ్యక్షుడికి అతి కష్టమైన పనేంటో తెలుసా అజయ్? క్రమశిక్షణ చర్య తీసుకోవడం! పార్టీలోని నాయకులకు అతి సులువైన పనేంటో తెలుసా అజయ్? క్రమశిక్షణ చర్యకు అధ్యక్షుడిపై ఒత్తిడి తేకుండా ఉండటం! సులభమైన పనినే పార్టీ నాయకులు చేయలేక పోతున్నప్పుడు.. కష్టమైన పనిని పార్టీ అధ్యక్షుడు ఎలా చెయ్యగలడో చెప్పు’’ అన్నారు!! -
లక్ష ఉద్యోగాలు.. మహిళలకు నెలకి రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచార జోరు పెంచాయి రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌కు భారీగా ఆఫర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.680 కోట్లతో స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ పునరుద్ధరణ 18-60 ఏళ్ల మహిళలకు నెలకి రూ.1,500 వంటివి వాటితో మేనిఫెస్టో విడుదల చేసింది హస్తం పార్టీ. నవంబర్ 12న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధాని రామ్ శైండిల్. ప్రజల అంచనాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ‘ఇది కేవలం మెనిఫెస్టో కాదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం.’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేసేంది కంగ్రెస్. కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించి ప్రజల సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామని, అందుకు వారు తిరస్కరించారని గుర్తు చేశారు. మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్..! -
వండి వార్చింది.. ఒక్క రోజే..
-అసలుకే ఎసరు - ఆరంభ శూరత్వంగా ‘అన్న అమృతహస్తం’ - రెండు వారాలుగా అందని పౌష్టికాహారం - గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇక్కట్లు - రూ.23.6 కోట్ల బిల్లులు చెల్లించని సర్కారు - ఇలాగైతే వండి పెట్టేదెలాగని ప్రశ్నిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు - ఏదోలా వండాలంటున్న అధికారులు ‘అన్న అమృతహస్తం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టినట్టుంది. ఇప్పటివరకూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నేరుగా ఇళ్లకే పోషకాహార దినుసులను అందించేవారు. వాటిని వారు ఇళ్లవద్దనే వండుకొని తినేవారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ఆరంభించాక ఇళ్లకు కాకుండా.. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి వారికి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా అటు ఇళ్లకు పోషకాహార దినుసులు రాక.. ఇటు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందక.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కట్లు పడుతున్నారు. మండపేట : ‘అన్న అమృతహస్తం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇచే్చందుకు ఉద్దేశించిన ఈ పథకం ఒక్క రోజుతోనే ముగిసిపోయి ఆరంభశూరత్వంగా మిగిలింది. ‘వండి పెట్టేందుకు గిన్నెలు లేవు. కూరగాయలు కొనేందుకు డబ్బులు లేవు. పాత బిల్లుల విడుదల లేదు. ఇలాగైతే ఎలా వండిపెట్టేది?’ అని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.23.6 కోట్ల మేర బిల్లు బకాయిలున్నట్టు వారు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ పథకాన్ని అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించిన పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పథకం అమలు మాట ఎలా ఉన్నా నెలవారీ ఇచ్చే పౌష్టికాహారం పంపిణీకే ప్రభుత్వం ఎసరు పెట్టిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. హడావుడి.. ఒక్క రోజుతో సరి! జిల్లాలో 5,546 అంగన్వాడీ కేంద్రాలుండగా.. వీటిలో 3,46,876 మంది చిన్నారులు, గర్భిణులు 38,281 మంది, బాలింతలు 35,563 మంది ఉన్నారు. చిన్నారులకు కేంద్రాల్లోనే పౌష్టికాహారం అందిస్తుండగా, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు, నెలకు మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటరు నూనె చొప్పున ఇప్పటివరకూ పంపిణీ చేసేవారు. ఆ దినుసులను రెండు మూడు రోజుల్లోనే కుటుంబమంతా వినియోగించేస్తున్నారని, ఫలితంగా బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందడం లేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో వారికి అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి పెట్టాలని, అదనంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, ఇప్పటికే ఏజెన్సీ పరిధిలోని ఎనిమిది ప్రాజెక్టులతో పాటు కోరుకొండ, శంఖవరం, తుని ప్రాజెక్టుల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది. దీనినే ఈ నెల 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ పేరిట కాకినాడ, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కపిలేశ్వరపురం, కోనసీమ తదితర ప్రాంతాల్లోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 3,934 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 30,304 మంది గర్భిణులు, 25,331 మంది బాలింతలకు ఈ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నట్టు పాలకులు ప్రకటించారు. ప్రతి రోజూ అన్నం, గుడ్డు, పాలతోపాటు వారంలో రెండు రోజులు పప్పు, కాయగూరలతో కూర, రెండు రోజులు కాయగూరలతో సాంబారు, రెండు రోజులు ఆకుకూర పప్పు వండి పెడతామని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం అమలుకు అవసరమైన వంట సామగ్రి, కిరాణా, కూరగాయలు, గ్యాస్, గర్భిణులు, బాలింతలు కూర్చుకునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లు తదితర వాటిని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేయలేదు. పైగా నిధులు కూడా కేటాయించ లేదు. పథకం ప్రారంభం సందర్భంగా అధికారుల ఒత్తిళ్లతో తొలి రోజు సొంత ఖర్చులతో వండి పెట్టిన అంగన్వాడీ కార్యకర్తలు మరుసటి రోజే చేతులెత్తేశారు. దీంతో అధిక శాతం కేంద్రాల్లో ఈ పథకం అమలు ఒక్క రోజుకే పరిమితమైంది. అంగన్వాడీలకు అన్నీ బకాయిలే.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. జిల్లాలో ఈ బకాయి సుమారు రూ.12 కోట్లు ఉంది. దీనికితోడు అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు దాదాపు రూ.1.8 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. మరోపక్క చిన్నారులకు వండుతున్న పౌష్టికాహారానికిగాను కార్యకర్తలకు దాదాపు రూ.9.8 కోట్ల మేర ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. మొత్తం అన్నీ కలిపితే బకాయిలు రూ.23.6 కోట్లకు చేరాయి. అయినప్పటికీ ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అంగన్వాడీ కార్యకర్తలపై ప్రాజెక్టు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైపోయమని, ఆ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించకపోతే కొత్తగా వండిపెట్టేదెలాగని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిలిచిపోయిన రేషన్ పంపిణీ ప్రస్తుత పరిస్థితితో ప్రతి నెలా గర్భిణులు, బాలింతలకు ఇంటికి పంపిణీ చేసే రేషన్ సరఫరా నిలిచిపోయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సరుకులను ఆయా కేంద్రాల్లోనే ఉంచాలని ప్రాజెక్టు అధికారులు చెబుతుండటంతో.. సరుకులు పంపిణీ చేయడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ‘అన్న అమృతహస్తం’ అమలుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న కేంద్రానికి ఆహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎంతవరకూ వస్తారన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. సాధారణంగా బాలింతలకు పాత బియ్యంతో అన్నం, గానుగ నూనెతో కూరలు వండుతుంటారు. కాగా కేంద్రాల్లో వంటకు మామూలు బియ్యం, పామాయిల్ నూనె వినియోగిస్తుంటారు. దీనిని బాలింతలు ఎంతవరకు తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత బిల్లులు విడుదల చేయాలి అద్దెలు, జీతాలు, కూరగాయలు, ఇతర ఖర్చులకు సంబంధించి సుమారు రూ.23.6 కోట్ల మేర బకాయిలు విడుదల కావాల్సి ఉంది. వాటిని విడుదల చేయకుండా ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు. - కె.కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సదుపాయాలు కల్పించాలి ఇప్పటికే పాత బిల్లులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం వండి పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వంట సామగ్రి, కూరగాయలను కేంద్రాలకు అందజేయాలి. - రాణి, అంగన్వాడీ కార్యకర్త