'సౌదీ అరేబియాను శిక్షించండి'
సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని శిక్షించాలంటూ బుధవారం ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇరానీయులను హజ్ యాత్రకు నిషేధించడంపై ఆయన స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ కలిసి సౌదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కేబినేట్ మీటింగ్ లో సౌదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేబినేట్ మీటింగ్ లో చర్చించిన ఆయన ఇస్లాం, ఇరుగుపొరుగు దేశాలను సౌదీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేవలం హజ్ యాత్రకు చెందిన సమస్యలైతే పరిష్కరించుకోవచ్చని కానీ, సౌదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని పోత్రహిస్తోందని రౌహాని ఆరోపించారు. సౌదీ కారణంగానే ఇరాక్, సిరియా, యెమెన్ లకు నెత్తుటి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది హజ్ యాత్రలో వందలాది ఇరానీయుల మరణానికి సౌదీ ప్రభుత్వమే కారణమని ఇరాన్ చేసిన వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా పరిగణించింది.