Hazardous Chemicals
-
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
మౌంట్ సినబంగ్.. భారీ పేలుడు చూడండి
జకార్త : అగ్ని పర్వతాల రాజ్యం ఇండోనేషియాలో మరోసారి ప్రజలు వణికిపోతున్నారు. మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం బద్ధలు కావటమే ఇందుకు కారణం. సోమవారం ఇది సంభవించంగా.. ఆ ప్రభావంతో వాతావరణంలో విషవాయువుల స్థాయి తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 19న ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పర్వత రూపు రేఖల్లో సమూల మార్పులు సంభవించగా.. లావా సుమారు 5 కిలోమీటర్లపాటు ప్రయాణించింది. పర్వతం వెదజల్లిన బూడిద సుమారు 162 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఇండోనేషియాలో ఉన్న 120 అగ్ని పర్వతాలలో సినబంగ్ ఒకటి. 2010లో ఇది రగులుకోవటం ప్రారంభించింది. ఇక నాసా ఈ విధ్వంసంపై ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్ని పర్వతం నుంచి వెలువడే వాయువుల్లో సల్ఫర్ డై యాక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉందని పేర్కొంది. దీంతో అధికారులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక పేలుడు సమయంలో ఓ స్కూల్ వద్ద పిల్లలు ఆసక్తిగా గమనించటం.. మరికొందరు హహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. -
కాలుష్య కోరల్లో భూగర్భ జలాలు
పరిశ్రమల వ్యర్థాలు భూమిలోకి ఇంకడమే ప్రధాన కారణం పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి బెంగళూరు: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారిపోతున్నాయి. దీంతో మనిషికి సంజీవని లాంటి నీరే వ్యాధులను వ్యాపింపజేసే కారకంగా మారిపోతోంది. హానికారక రసాయనాలు భూగర్భజలాల్లో కలిసి పోతుండడంతో నగర జీవి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లుతోంది. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నగరంలోని సరస్సులలోకి వదులుతుండడం భూగర్భజలాలు విషతుల్యం కావడానికి ప్రధాన కారణమవుతోందని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. ఇదిలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో నగరంలోని భూగర్భ జలాలన్నీ పూర్తిగా గరళంగా మారి తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ప్రస్తుతం కాలుష్య భూతం తాండవమాడుతోంది. వాయు కాలుష్యం, శబ్దకాలుష్యం పెరిగిపోతున్నట్లుగానే పరిశ్రమల వ్యర్థాలు, సరస్సుల కబ్జాలతో భూగర్భ జలాలు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్, బెంగళూరు శాఖ జరిపిన పరిశోధనలో తేలింది. ప్రతి ఏడాది భూగర్భ జలాల పరిస్థితిపై సర్వే నిర్వహించే ఈ సంస్థ ఈ ఏడాది సైతం నగరంలోని భూగర్భజలాల పరిస్థితిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలాల్లో ఏడాదికేడాదికి కాలుష్యం పెరిగిపోవడానికి భూ ఉపరితల కాలుష్యం పెరగడమే ప్రధాన కారణమని ఈ సర్వే వెల్లడించింది. తాగడానికి భూ ఉపరితల నీటిని కాకుండా భూ గర్భజలాల (భూమిలోపల పొరల్లో ఉన్న) పై ఎక్కువగా ఆధార పడటం వల్ల కూడా నగర జీవి మంచినీరు అనుకొని కాలుష్యంతో నిండిన నీటిని తీసుకుంటున్నట్లు సర్వే తెలిపింది. పెరిగిన కాలుష్యం, తగ్గిన సరస్సులు... పట్టణీకరణ పెరగడంతో ఐదేళ్ల కాలంలో నగర శివారు ప్రాంతంలో ఉన్న పలు పరిశ్రమలు జనావాసాల మధ్యకు వచ్చాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలి. ఈ వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పారవేయాలి. ఇందుకు కర్నాటక కాలుష్య నియంత్రణ మండలి (కేపీసీబీ) నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించింది. అయితే నగరంలో ఈ నిబంధనలు అమలైన దాఖలాలు కనిపించడం లేదు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే బయటికి వదులుతున్నారు పరిశ్రమల యజమానులు. దీంతో అవి భూగర్భంలోకి ఇంకిపోయి, జలాలు అత్యంత విషతుల్యమౌతున్నాయి. కాగా, ఐదేళ్ల క్రితం వరకూ బీబీఎంపీ పరిధిలో 294 సరస్సులు ఉండేవి. క్లోరిఫికేషన్, స్ప్రింకలైజేషన్ తదితర పద్ధతులను ఉపయోగించి ఈ సరస్సుల నీటిని తాగునీరుగా మార్చి ప్రభుత్వం సరఫరా చేసేది. పట్టణీకరణ పెరగడం, రియల్ ఎస్టేట్ బూమ్ ఉండడంతో సరస్సులు కూడా ఆక్రమణకు గురయ్యాయి. దీంతో సరస్సులన్నీ మైదాన ప్రాంతాలుగా మారిపోయి అపార్ట్మెంట్లు వెలిశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీబీఎంపీ కూడా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడానికి ఎక్కువగా భూ గర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులన్నింటి కారణంగా నగరంలోని భూగర్భజలాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎక్కువ పరిమాణంలో కాలుష్య కారకాలు చేరుకున్నాయి. గత ఏడాది ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ జరిపిన సర్వేలో ఎస్.జీ నగర్ ప్రాంతంలో ఒక లీటర్ నీటిలో 375మిల్లీగ్రాముల నైట్రేట్ నమోదు కాగా ఈఏడాది నైట్రేట్ పరిమాణం 402మిల్లీగ్రాములకు చేరుకుంది. అదే విధంగా బిదరహళ్లిలో ఒక లీటర్ నీటిలో 4.49మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉన్నట్లు నమోదు కాగా ఈ ఏడాది ఫ్లోరైడ్ పరిమాణం 5.97మిల్లీగ్రాములకు పెరిగింది. కాలుష్య నియంత్రణ మండలి విఫలమైంది...... భూగర్భ జలాల పరిరక్షణలో కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాలుష్య నియంత్రణ మండలి తరచుగా నగరంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని పర్యావరణ నిపుణులు ఎస్.విశ్వనాథ్ తెలిపారు. ‘తరచుగా తనిఖీలు జరిగినపుడే పరిశ్రమల యజమానులు పరిశ్రమ వ్యర్థాలను జనావాసాల మధ్యకాక శుద్ధిచేసి దూరంగా పడేసేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రస్తుతం నగరంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. యజమాన్యాలు వ్యర్థాలను శుద్ధిచేయకుండానే దగ్గరలోని సరస్సుల్లోకి వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశ్రమలపై, సరస్సుల కబ్జాపై దృష్టి సారించాలి. లేదంటే మరో 20 ఏళ్లలో భూగర్భ జలాలన్నీ విషంగా మారి తాగడానికి నీరే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది’ అని అన్నారు. -
మ్యాగీపై నిషేధం ఎత్తివేత
నెస్లే కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో హానికర లెడ్(సీసం) అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం విధిస్తూ జూన్ 5న ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన ఆదేశాలతోపాటు రాష్ట్రంలో నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. నిషేధం విషయంలో సహజన్యాయ సూత్రాలను పాటించలేదని, తన వాదన చెప్పుకునేందుకు నెస్లేకు అవకాశం దక్కలేదని కోర్టు పేర్కొంది. మ్యాగీని పరీక్షించిన ల్యాబ్‌లు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు అనుబంధ సంస్థలు కావంది. అన్ని రకాల నూడుల్స్ నుంచి ఐదు శాంపిళ్లను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లలో ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబ్‌లకు పరీక్షల కోసం పంపాలంది. 6 వారాల్లో ల్యాబ్‌లు నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఆహార భద్రత సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని కానీ, లేదని కానీ చెప్పలేమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. -
కాయగూరల్లో కాలకూటం!
మూసీ నీళ్లతో పండించిన పంటల్లో ప్రమాదకర రసాయనాలు ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం వంటి మూలకాల అవశేషాలు ఆరోగ్యాన్నే కాదు.. జీవనోపాధికి గండికొడుతున్న విష జలాలు ఈ నీటితో పోచంపల్లి చీరలకు రంగేస్తే ఎగుమతికి నిరాకరణ చెరువుల్లో చేపలు మృత్యువాత పడుతుండడంతో నష్టాలు నల్లగొండలో పలు గ్రామాలకు ఇప్పటికీ ఈ నీరే గతి ఫిల్టర్ నీళ్లు కొనలేక గరళాన్ని మింగుతున్న నిరుపేదలు సాక్షి, హైదరాబాద్: అణువణువునా విషం నింపుకున్న మూసీ... తీరప్రాంతంలో పండుతున్న కూరగాయల్లోకి సైతం కాలకూటాన్ని చొప్పిస్తోంది! ఈ నది ఒడ్డున పండుతున్న పంటలు, కూరగాయల్లో అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆరోగ్యానికి చేటుతెచ్చే ఆర్సెనిక్, లెడ్, బెరీలియం, సెలీనియం, కాడ్మియం వంటి మూలకాల జాడ లు వెలుగుచూశాయి. ఇంతగా విషతుల్యమైపోయిన మూసీ జలం నల్లగొండ జిల్లాలో అనేక గ్రామాల ప్రజలకు ఇప్పటికీ మంచి నీటిగా సరఫరా అవుతుండడం గమనార్హం. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నా మరో గత్యంతరం లేక నిరుపేదలు ఆ నీటినే గొంతు లో పోసుకుంటున్నారు. మూసీ దుష్ర్పభావం జనాల ఆరోగ్యం, పంటలకే పరిమితం కాలే దు.. ప్రజల జీవనోపాధికీ గండికొడుతోంది. ప్ర పంచ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చీరల నాణ్యతను దెబ్బతీస్తోంది. మూసీనీటితో రంగులు అద్దే చీరలను ఎగుమతికి అనుమతించడం లేదు. దీంతో చివరికి నేత కార్మికులు ఫిల్టర్ నీళ్లు కొని వాటిని చీరల తయారీకి వాడాల్సిన దుస్థితి ఏర్పడింది! పరిశోధనల్లో తేలింది ఇదీ.. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణల్లో వృక్షశాస్త్ర రీసెర్చ్ స్కాలర్ సుచిత్ర బృందం... వంకాయ, టమోటా, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లిపాయ పంటలను పండించి ఫలితాలను విశ్లేషించింది. ఈ పంటలను పండించేందుకు 3 రకాల నీటిని (1. మూసీ నీరు, 2.బోరు నీరు, 3. శుద్ధి చేసిన మూసీ నీరు) వాడారు. కొద్ది నెలల తర్వాత మూసీ నీటితో పండిన పంటల్లో అత్యం త ప్రమాదకర మూలకాలను గుర్తించారు. వీటిలో కాపర్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం మూలకాలు అత్యధిక మోతాదులో కనిపించాయి. ఇక అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్(సీసం), బెరీలియం, కాడ్మియం వంటి భారలోహాల ఆనవాళ్లు ఉన్న ట్టు తేలాయి. సాధారణ నీటితో పండిన టామోటాలో కాపర్ 0.76 మిల్లీగ్రాములు(ఎంజీ) నమోదు కాగా.. మూసీ నీటితో పండిన టమోటాలో అది 3.75 ఎంజీగా నమోదైంది. అలాగే క్యారెట్లో సాధారణ నీటితో 0.31 ఎంజీ కాపర్ ఉండగా.. మూసీనీటితో 2.71 ఎంజీ ఉంది. అలాగే సాధారణ నీటితో పండించిన మిరపలో 1.01 ఎంజీ కాపర్ నమోదు కాగా.. మూసీనీటితో పండించిన మిరపలో 2.26 ఎంజీ ఉంది. కార్పోహైడ్రేట్ల విషయానికి వస్తే సాధారణ వంకాయ పంటలో 2.83 ఎంజీ ఉండగా, మూసీనీటి పంటలో మాత్రం 2.35 గానే నమోదైంది. సూర్యాపేటకు ఇవే మంచినీళ్లు కాగా.. మూసీ నీటినే ఇప్పటికీ సూర్యాపేట పట్టణానికి మంచినీటిగా అందిస్తున్నారు. అక్కడి మున్సిపాలిటీ.. నకిరేకల్ దిగువన నిర్మితమైన మూసీ డ్యాం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించి శుద్ధి చేసి పట్టణానికి అందిస్తోంది. రోగాలకు భయపడి చాలామంది ఫిల్టర్ నీటిని కొని తాగుతున్నారు. కొనే స్తోమత లేని నిరుపేదలు మున్సిపాలిటీ నీటినే వినియోగిస్తున్నారు. మూసీ శుద్ధికి నిపుణులు సూచించే మార్గాలివీ.. పారిశ్రామిక వ్యర్థాలను పరిశ్రమ ఆవరణలోనే శుద్ధి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలను నాలాల్లోకి రాకుండా చూడాలి. రసాయన శుద్ధి కేంద్రాలు (ఈటీపీ) ఉన్న పరిశ్రమలకే అనుమతులు ఇవ్వాలి. వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రసాయన పరిశ్రమల్ని ఔటర్ రింగ్ రోడ్డు ఆవతలకు తరలించాలి. మూసీ ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కదలాలి. గంగా శుద్ధి తరహాలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. కూకట్పల్లి, పికెట్ నాలాలను హుస్సేన్‌సాగర్‌లోకి రాకుండా మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ నాలాలను తాత్కాలికంగా దారి మళ్లించినా.. చివరకు ఆ నీరంతా వచ్చి చేరేది మూసీలోకే ! హైదరాబాద్‌లోని నవాబ్‌సాహెబ్‌కుంట మొదలు హుస్సేన్‌సాగర్, ఫాక్స్‌సాగర్, సఫిల్‌గూడ, నాచారం, సరూర్‌నగర్ చెరువుల శుద్ధికి శాశ్వత ప్రణాళిక అమలు చేయాలి. భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కాలనీలు, పెద్దస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్మెంట్లకు సైతం నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటు(ఎస్టీపీ)ను తప్పనిసరి చేయాలి. మూసీ తీరం వెంట కబ్జాలను తొలగించి గ్రీన్‌బెల్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఈగల కంటే పెద్ద దోమలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలకు దోమల బెడద ఎక్కువుంది. సాయంత్రం 5.30 గంటలు దాటితే రోడ్డుపైకి రాలేని పరిస్థితి. ఈగల కంటే పెద్దగా ఉన్న ఈ దోమలు కుడితే దద్దుర్లు వస్తున్నాయి. - బి.సుశీలారెడ్డి, కాచవాని సింగారం, రంగారెడ్డి చీరలు ఎక్స్పోర్ట్కు వద్దంటున్నారు గత ఐదారేళ్లుగా మూసీ నీరు చాలా కలుషితమైంది. ఈ నీరు రంగుల అద్దకానికి పనికి రాకుండా పోయింది. మూసీ నీటితో మైల పూర్తిగా పోదు.అట్లే రంగులద్దితే నూలుకు రంగు ముద్దలుముద్దలుగా అంటుకుంటుంది. మూసీ నీటితో రంగులు అద్దే చీరలను ఎక్స్పోర్ట్కు అనుమతించటం లేదు. మండలానికి కృష్ణా జలాలు అందిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - అంకం యాదగిరి, పోచంపల్లి చేనేత కార్మికుడు జబ్బుల బారిన పడుతున్నాం మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు తాగి అనారోగ్యం పాలవుతున్నాం. నీళ్లు తాగితే ఒళ్లు, తలనొప్పులు వస్తున్నాయి. స్నానం చేస్తే దద్దులు వస్తున్నాయి. 40 సంవత్సరాలు పైబడిన వారికి అనేక జబ్బులు వస్తున్నాయి. ఈ నీళ్లతో పొద్దున అన్నం వండితే మధ్యాహ్నానికే పాడై పోతుంది. - దేరంగుల యాదమ్మ, ప్రతాప్‌సింగారం, రంగారెడ్డి నీళ్లు అడిగి అలసిపోయాం మాకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని ఏన్నో ఏండ్లుగా అడుగుతనే ఉన్నం. మూసీనీళ్లను ఒక్కోసారి సరిగ్గా శుద్ధి చేయకుండానే నల్లాలోకి వదులుతున్నారు. ఈ నీళ్లతో అన్నం వండితే రెండు గంట ల్లోనే పాడై పోతోంది. - భీంశెట్టి శైలజ, అన్నాదురై నగర్, సూర్యాపేట గ్రీజు పూసుకొని చెరువులోకి దిగుతున్నాం చెరువులోకి దిగి చేపలు పట్టాలంటే మత్స్య కార్మికులు భయపడుతున్నారు. చెరువులోకి దిగితే దురద, మంట పుడుతోంది. దాంతో గ్రీజు పూసుకొని చేపలు పట్టుతున్నాం. చేపలు కూడా ఎదగడం లేదు. రెండేళ్లు పెంచితే 2-3కిలోల బరువు మాత్రమే పెరు గుతున్నాయి. గతంలో ఐదారు కిలోలు పెరిగేవి. - చెక్క గణేష్, మత్స్య కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు, పోచంపల్లి ఏం చేస్తాం.. మరే నీళ్లు లేవు మాకు మరో గత్యంతరం లేదు. మూసీ నీళ్లు తాగక తప్పటం లేదు. అవయినా మూడు రోజులకోసారి ఇస్తున్నారు. ఒక్కోసారి గలీజు వాసన వస్తే రూ.15లతో ఫిల్టర్ నీటిని కొనుక్కొని తాగుతున్నం. - నర్సింగ్ సైదమ్మ, తాళ్లగడ్డ, సూర్యాపేట