headingley
-
తమ దగ్గర ఉన్నదే...
మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు. ‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’ నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే. ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని! ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం. ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా లీడ్స్‌లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్‌కల్లమ్‌ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్‌కల్లమ్‌ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్‌లు ఆడి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
యాషెస్ మూడో టెస్ట్ చాలా ప్రత్యేకం.. ఆ ఇద్దరూ లేకుండా 6037 రోజుల తర్వాత..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆండర్సన్, లయోన్ లేకుండా 2006 డిసెంబర్ 26న చివరిసారిగా ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా, రెండో టెస్ట్ సందర్భంగా గాయపడినందున నాథన్ లయోన్ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్‌ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్‌ను ఇంగ్లీష్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది (మూడో టెస్ట్‌కు). ఇదిలా ఉంటే, లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్.. భారీ మార్పులతో బరిలోకి దిగనున్న ఇంగ్లండ్..!
హెడింగ్లే వేదికగా రేపటి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. భుజం గాయం కారణంగా వైస్ కెప్టెన్ ఓలీ పోప్ జట్టుకు దూరం కాగా.. తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ (2 టెస్ట్‌ల్లో 3 వికెట్లు) తుది జట్టులో ఉండడని సమాచారం. అలాగే రెండో టెస్ట్‌లో 5 వికెట్లతో రాణించినప్పటికీ, జోష్ టంగ్‌కు విశ్రాంతినివ్వాలని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ భావిస్తుందట. పై పేర్కొన్న ముగ్గురి స్థానాల్లో మార్క్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీలను తుది జట్టులోకి తీసుకోవాలన్నది కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ ఆలోచనగా తెలుస్తుంది. మూడో టెస్ట్‌కు వేదిక అయిన హెడింగ్లే (లీడ్స్) పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో భారీ పేస్ బౌలింగ్ అటాక్‌తో బరిలోకి దిగాలన్నది ఇంగ్లండ్ ప్రణాళికగా తెలుస్తుంది. ఈ మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేయాలని కోచ్ మెక్కల్లమ్ అనుకుంటున్నాడట. హ్యారీ బ్రూక్‌కు ప్రమోషన్ ఇచ్చి మూడో స్థానంలో బరిలోకి దించాలని ఇంగ్లండ్ యోచిస్తుందట. ఈ విషయాలను ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ద టెలిగ్రాఫ్ యాషెస్ సిరీస్‌పై తమ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. కాగా, తాజాగా లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
యార్క్‌షైర్ కౌంటీపై వేటు
లండన్: జాతి వివక్షపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కన్నెర్ర చేసింది. కుప్పలుతెప్పలుగా ఆరోపణలు వస్తున్నా... చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించిన యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆ జట్టు కౌంటీలకు దూరమవడంతో పాటు క్లబ్‌కు చెందిన హెడింగ్లీ స్టేడియంలో ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. వచ్చే ఏడాది లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో పలు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు, దక్షిణాఫ్రికాతో వన్డే, యాషెస్ సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను అక్కడి నుంచి తప్పిస్తారు. వైసీసీసీకి చెందిన మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ (2008–2018) ఏళ్ల తరబడి వర్ణ వివక్షకు గురయ్యాడు. ఇస్లాం మతానికి చెందిన తను పదేపదే వివక్షకు గురయ్యానని, సహచరులు తనను బయటివాడిగానే చూసేవారని, దీనిపై క్లబ్‌కు 43 సార్లు ఫిర్యాదు చేశానని రఫిక్ గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈసీబీ రంగంలోకి దిగింది. కమిటీ విచారణలో యార్క్‌షైర్ ఉదాసీనత వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
ఎందాక ఈ ఎదురీత!
లీడ్స్: తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్ కోలుకునే అవకాశం ఉంది. 9 పరుగులే చేసి... మూడో రోజు ఇంగ్లండ్ ఎక్కువ సేపు ఏమీ ఆడలేదు. ఓవర్‌నైట్ స్కోరు 423/8తో శుక్రవారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు చేసి 432 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్టన్ (32; 6 ఫోర్లు)ను షమీ ఎల్బీగా పంపించగా... రాబిన్సన్ (0)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. షమీ 4 వికెట్లను పడగొట్టగా, బుమ్రా, సిరాజ్, స్పిన్నర్ జడేజా తలా 2 వికెట్లు తీశారు. అయితే ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ ఇద్దరు నిలబడ్డారు... ప్రత్యర్థి కొండంత ఆధిక్యంలో ఉంది. దీన్ని కరిగించాలంటే క్రీజులో పాతుకుపోవాలి. ఇంకో దారేం లేదు. ఇలాంటి స్థితితో రోహిత్, రాహుల్ అదే పని చేశారు. 16వ ఓవర్లో రాబిన్సన్ వేసిన బౌన్సర్‌ను రోహిత్ థర్డ్‌మ్యాన్ దిశగా సిక్సర్ బాదాడు. గంటన్నరపాటు క్రీజులో నిలిచిన రాహుల్ (54 బంతుల్లో 8) చివరకు ఓవర్టన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అప్పుడే 34/1 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది. తర్వాత పుజారా క్రీజులోకి రాగా ఇంగ్లండ్ బౌలర్లకు ఇంకో వికెట్ కోసం సుదీర్ఘ శ్రమ తప్పలేదు. రోహిత్ 125 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ పేస్ వాడిపోగా... భారత బ్యాట్స్‌మెన్‌లో ధీమా పెరిగింది. కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన పుజారా ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఈ సెషన్లో అలసటే తప్ప వికెట్లు రాలేదు. ఆఖరి సెషన్లో రోహిత్ ఔటైనప్పటికీ పుజారా... కెప్టెన్ కోహ్లి అండతో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 మార్క్‌ను దాటించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 78; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్ 59; కేఎల్ రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్ 8; పుజారా (బ్యాటింగ్) 91; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 45; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (80 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–34, 2–116. బౌలింగ్: అండర్సన్ 19–8–51–0, రాబిన్సన్, 18–4–40–1, ఓవర్టన్ 17–6–35–1, స్యామ్ కరన్ 9–1–40–0, మొయిన్ అలీ 11–1–28–0, రూట్ 6–1–15–0. -
India vs England: అద్భుతంనుంచి అగాధానికి...
లార్డ్స్ టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో అరుదైన విజయాన్ని అందుకున్న భారత జట్టు అంతలోనే అయ్యో అనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరుగుతుండగా, ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే మన జట్టు ఆట ముగిసిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్ టీమిండియా ను దెబ్బకొట్టాడు. అనంతరం వికెట్ కోల్పోకుండా మన స్కోరును దాటేసిన ఇంగ్లండ్ తొలి రోజును ఘనంగా ముగించింది. లీడ్స్: తొలి రోజు భారత్ బ్యాటింగ్‌ను చూస్తే... లార్డ్స్‌లో గెలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలగక మానదు. అంత నిర్లక్ష్యం టీమిండియా ఆటతీరులో కనిపించింది. బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్ స్కోరర్ కాగా, అండర్సన్ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), హమీద్ (60 బ్యాటింగ్; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదో బంతి నుంచి ఆలౌట్ దాకా... సిరీస్‌లో ఆధిక్యం... జట్టులో ఆత్మవిశ్వాసం... ఇంకేం మూడో టెస్టులోనూ పైచేయి సాధించేయొచ్చులే అన్న ధీమా ఐదో బంతికే డీలా పడింది. తొలి ఓవర్ వేసిన అండర్సన్ ఐదో బంతికే రాహుల్ (0)ను డకౌట్ చేశాడు. మళ్లీ తనే ఐదో ఓవర్లో చతేశ్వర్ పుజారా (1), కొంత విరామం తర్వాత 11వ ఓవర్లో కెప్టెన్ కోహ్లి (7)ని పెవిలియన్ చేర్చాడు. లంచ్ విరామానికి ముందు రాబిన్సన్ బౌలింగ్‌లో రహానే కూడా బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 56/4 స్కోరు వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లింది. 67/5.... 67/9 జరిగిందేదో జరిగింది! రెండో సెషన్లో భారత్ చక్కబడదా! పైగా హిట్‌మ్యాన్ రోహిత్ ఉండనే ఉన్నాడు. అని సరిపెట్టుకున్న స్థైర్యం చెల్లాచెదురయ్యేందుకు... భారత్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. లంచ్ అయిన వెంటనే రిషభ్ పంత్ (2) అవుటయ్యాడు. 36 ఓవర్లలో భారత్ స్కోరు 67/5. ఇంగ్లీష్ పేస్ తుఫాను ఇంకా ముగిసిపోలేదు. ఓవర్టన్ (37వ ఓవర్), స్యామ్ కరన్ (38వ ఓవర్) ఇద్దరు ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లను పడేశారు. దెబ్బకు 67/9...‘సున్నా’ పరుగుల వ్యవధిలో 12 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిపోయిన ఆఖరి వికెట్ లాంఛనాన్ని ఓవర్టనే సిరాజ్‌ను అవుట్ చేయడం ద్వారా పూర్తి చేశాడు. లంచ్ తర్వాత 14.5 ఓవర్లు ఆడిన భారత్ 22 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లను సమర్పించుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) రాబిన్సన్ (బి) ఓవర్టన్ 19; రాహుల్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; పుజార (సి) బట్లర్ (బి) అండర్సన్ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) అండర్సన్ 7; రహానే (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 18; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 2; జడేజా (ఎల్బీ) (బి) కరన్ 4; షమీ (సి) బర్న్స్ (బి) ఓవర్టన్ 0; ఇషాంత్ నాటౌట్ 8; బుమ్రా (ఎల్బీ) (బి) కరన్ 0; సిరాజ్ (సి) రూట్ (బి) ఓవర్టన్ 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (40.4 ఓవర్లలో ఆలౌట్) 78. వికెట్ల పతనం: 1–1, 2–4, 3–21, 4–56, 5–58, 6–67, 7–67, 8–67, 9–67, 10–78. బౌలింగ్: అండర్సన్ 8–5–6–3, రాబిన్సన్ 10–3–16–2, స్యామ్ కరన్ 10–2–27–2, మొయిన్ అలీ 2–0–4–0, ఓవర్టన్ 10.4–5–14–3. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ బ్యాటింగ్ 52; హమీద్ బ్యాటింగ్ 60; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 120. బౌలింగ్: ఇషాంత్ 7–0–26–0, బుమ్రా 12–5–19–0, షమీ 11–2–39–0, సిరాజ్ 7–1–26–0, జడేజా 5–3–6–0. -
శ్రీలంక అద్భుత విజయం
ఇంగ్లండ్‌పై 1-0తో సిరీస్ కైవసం హెడింగ్లీ: ఇంగ్లండ్-శ్రీలంకల రెండో టెస్టుకు ఉత్కంఠభరిత ముగింపు లభించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి దిశగా వెళ్లిన ఇంగ్లండ్ ఒక దశలో 228/9 స్కోరు వద్ద నిలిచింది... చివరి రోజు మరో 20.2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ దశలో కెరీర్లో తొలి సెంచరీ చేసిన మొయిన్ అలీ (281 బంతుల్లో 108 నాటౌట్; 17 ఫోర్లు), అండర్సన్ (55 బంతుల్లో 0) ప్రతీ బంతికి పోరాడుతూ మ్యాచ్‌ను ‘డ్రా’ కు అతి చేరువగా తెచ్చారు. మరో రెండు బంతులు ఆడగలిగితే గత టెస్టులో శ్రీలంక తరహాలో ఈ సారి ఇంగ్లండ్ మ్యాచ్‌ను కాపాడుకునేది. అయితే ఎరాంగ వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఇచ్చి అండర్సన్ అవుటయ్యాడు. దాంతో ఒక్కసారిగా లంక శిబిరంలో ఆనందం... ఇంగ్లండ్ ఆటగాళ్ళలో నిర్వేదం. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 249 పరుగులకు ఆలౌట్ కావడంతో, లంక 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది.