Headley
-
ఇష్రత్ గురించి వ్యక్తిగతంగా తెలియదు: హెడ్లీ
ముంబై: ఇష్రత్ జహాన్ గురించి తనకు వ్యక్తిగతంగా తెలియదని, ఆమె కేసు వివరాలను మీడియా ద్వారానే తెలుసుకున్నానని పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ముంబై దాడుల కేసులో ఆయన శనివారం ముంబై కోర్టు అమెరికా నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈమేరకు తెలిపాడు.ఇష్రత్ లష్కరే తోయిబా తరఫున పనిచేసిందని హెడ్లీ గత నెల ఇదే కోర్టుకు చెప్పడం గమనార్హం. ‘లఖ్వీ(లష్కరే కమాం డర్) నాకు ముజామిల్ భట్‌ను పరిచయం చేశాడు. లష్కరే టాప్ కమాండర్లలో భట్ ఒకరని నాతో చెప్పాడు. అక్షరధామ్, ఇష్రత్ జహాన్ వంటి ఆపరేషన్లను చేపట్టాడన్నాడు. మిగతాదంతా నా ఆలోచనే’ అని హెడ్లీ తెలి పాడు. భారత్‌లో హతమైన లష్కరే సభ్యురాలు ఇష్రత్ అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి చెప్పానని, ఆ సంస్థ ప్రకటనలో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో తనకు తెలియదన్నాడు. ఇషత్ ్రసహా నలుగురు 2004లో గుజరాత్లో జరిగిన ఎన్కౌంటర్ చనిపోవడం, నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ హత్యకు వీరు కుట్రపన్నారని ఆరోపణలు ఉండడం తెలిసిందే. -
నా భార్య గురించి మీకెందుకు?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై జరిగిన 26/11 దాడి కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈ విచారణలో తన వ్యక్తిగత అంశాల విచారణపై అభ్యంతరం వ్యక్తంచేసిన హెడ్లీ కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. 2002 తరువాత దుబాయ్, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టానని, అక్కడ తనకు కొన్ని షాపులు కూడా ఉన్నట్లు విచారణలోఅంగీకరించాడు. డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారాన్ని నిర్వహించానని కూడా డేవిడ్ హెడ్లీ ఒప్పుకున్నాడు. అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో లింక్ ద్వారా విచారిస్తున్నారు. తన భార్య షాజియా గిలానీ గురించిన సమాచారాన్ని వెల్లడించేందుకు మాత్రం హెడ్లీ నిరాకరించాడు. తన గురించి అడగాలని, అంతేతప్ప తన భార్య గురించి మీకెందుకని విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించాడు. తనకు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్ వ్యాపారానికి సహకరించాడని విచారణలో హెడ్లీ తెలిపాడు. భారత్ లోకి ఆయుధ అక్రమ రవాణాలో ఆసక్తి చూపిన అతనితో కలిసి 2006లో అక్రమ వ్యాపారానికి తెరతీసినట్టు తెలిపారు. 1992 నుంచి మత్తు మందుల వ్యాపారంలో ఉన్నాననీ, 1988 జైలునుంచి విడుదలైనప్పటినుంచీ, తిరిగి 1998 మళ్లీ జైలుకెళ్లేదాకా ఈ వ్యాపారాన్ని కొనసాగించినట్టు హెడ్లీ తెలిపాడు. లష్కర్ తాయిబా నుంచి తనకు నిధులు అందలేదని, తానే వారికి నిధులు సమకూర్చానని విచారణలో వెల్లడించాడు. పాకిస్తాన్ లాహోర్ లో ఉన్నప్పుడు పంజాబీ నేర్చుకున్నానన్నాడు. మరో లష్కరే ఉగ్రవాది తహావుర్ రాణాతో తనకు పరిచయం ఉన్నట్లు హెడ్లీ అంగీకరించాడు. అయితే లష్కర్ తో మాత్రం రాణాకు సంబంధాలు లేవన్నాడు. 26/11 కుట్ర సందర్భంగా ఆయన కార్యాలయాన్ని వాడుకున్నామని తెలిసిన తరువాత రాణా తనను కార్యాలయం నుంచి తొలగించినట్టు చెప్పాడు. ముంబై దాడుల కోసం ప్రణాళిక వేయడంలో హెడ్లీకి రాణా సహకరించాడన్న ఆరోపణలున్నాయి. పాక్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గత విచారణలో హెడ్లీ అంగీకరించిన విషయం తెలిసిందే. అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీ విచారణ సాగింది. ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా పాల్గొన్న ఈ విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
హఫీజ్ సయీద్ అంకుల్ ఏం చెప్పారంటే..
ముంబై: హఫీజ్ సయీద్ అంకుల్ అట, జాకీర్ రహ్మాన్ లఖ్వీ ఆయన స్నేహితులట. డేవిడ్ హెడ్లీ తన సహచర తీవ్రవాదితో సంభాషణ కోసం వాడిన కోడ్ లాంగ్వేజి ఇది. 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించి ఇటీవలే అప్రూవర్‌గా మారిన ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఇస్తున్న వాంగ్మూలాల్లో శనివారం మరిన్ని సంచలన అంశాలు వెల్లడయ్యాయి. తన ఈ మెయిల్ gulati22@hotmail.com, తన సహచర తీవ్రవాది సాజిద్ మిర్ ఈ మెయిల్ rare.lemon@gmail.com గా హెడ్లీ అంగీకరించాడు. జూలై 8న సాజిద్ మిర్‌కు హెడ్లీ ఈమెయిల్ చేశాడు. హఫీజ్ సయిద్ తన 'అంకుల్'గా, జాకీర్ రహ్మాన్ లఖ్వీ 'అతడి స్నేహితులు'గా కోడ్ లాంగ్వేజిలో పేర్కొన్నాడు. ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం విచారణ చేపట్టడంతో మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపానని చెప్పాడు. 2009 జూలై8న 'అంకుల్ ఎలా ఉన్నారు' అని సాజిద్‌కు మెయిల్ చేశాడు. దానికి అతను' అంకుల్ బాగున్నారు. చాలా ఎత్తుకు చేరనున్నారు' అని బదులిచ్చాడు. అగస్టు28న' ఓల్డ్ అంకుల్(హఫీజ్)కు హెచ్1 వైరస్ కూడా వచ్చిందా? ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ చెకప్ చేయాలనుకుంటున్నాడు' అనే సారంశంతో హెడ్లీ మెయిల్.. అయితే హెడ్లీ కోర్టుకు తెలిపిన అసలు అర్థం... వారిపై విచారణ జరిగితే హఫీజ్ సయీద్‌కు అనుకూలంగా ఉంటాము. అగస్టు30: సాజిద్ మిర్ బదులిస్తూ..మా అంకుల్ టోర్నడోలా కదులుతున్నాడు. హెడ్లీ తెలిపిన అర్థం: హఫీజ్ సయీద్ కు ఏమీ అవ్వదు.. సెప్టెంబర్3: 'ప్రతి అంకుల్ బాగానే ఉన్నాడు' అని సాజిద్ నుంచి మెయిల్ దానికి హెడ్లీ తెలిపిన అసలు అర్థం: ప్రతి అంకుల్ అంటే హఫీజ్ సయీద్, జాకీర్ రెహ్మాన్ లఖ్వీ అని అర్థం హెడ్లీ తెలిపిన మరిన్ని వివరాలు... - పుణేలోని ఆర్మీ కేంద్రంలో ఉన్న జవాన్లను రిక్రూట్ చేసుకొని వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని మజ్ ఇక్బాల్ నాతో చెప్పారు. - పూణేలోని ఆర్మీ కేంద్రానికి కూడా వెళ్లాను - 2009లో చాలా ప్రాంతాలు తిరుగుతూ వీడియో తీశాను. - మార్చి3న తహవూర్ రాణాకి 'హెడ్లీ పర్సనల్ విల్' సబ్జెక్ట్‌తో .. ఈ మెయిల్ చేశాను. - దక్షిణ కమాండ్ హెడ్ క్వార్టర్ భవనాన్ని మార్చి16-19 వరకు రెక్కీ నిర్వహించి వీడియో తీశాను. మార్చి 15న గోవాలోని చాబాద్ హౌస్, అంతకుముందు11-13 వరకు రాజస్థాన్‌లోని పుష్కరాలకు వెళ్లి రెక్కి నిర్వహించా. అనంతరం ఈ వీడియోలను మజ్ ఇక్బాల్ అప్పగించాను.