Health Details
-
Vladimir Putin: చూపు మందగించిందా?
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వినవస్తున్నాయి. వాటిని ధృవీకరిస్తూ కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. క్రెమ్లిన్ వర్గాలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ వందతుల్ని కొట్టిపారేస్తూ వస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘మెట్రో’ ఓ సంచలన కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడని, ఆయన చూపు కూడా మందగించిందని, నాలుక తిమ్మిరి సమస్యతోనూ ఇబ్బంది పడుతున్నారని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు.. పుతిన్‌కు కుడివైపు భాగం సైతం స్వల్పంగా స్పర్శ కోల్పోయిందని పేర్కొంది. రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం దిగజారుతోందన్న తాజా వరుస కథనాల నడుమ.. ఈ కథనం వెలువడడం గమనార్హం. పైగా రష్యన్ అవుట్లెట్ ద్వారానే తాము ఆ సమాచారం సేకరించినట్లు మెట్రో ప్రచురించింది. ఈ పరిణామాలతో ఆయన వ్యక్తిగత వైద్యుల బృందం.. కొన్నిరోజులు అబ్జర్వేషన్లో ఉండమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నివారాల పాటు ఆయన మీడియా కంట పడరంటూ తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరిలోనూ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఓ వైరల్ విపరీతంగా చక్కర్లు కొట్టింది. Putin - Lukashenko: "Thank you for agreeing to come - As if I couldn't agree!"😊 Vladimir Putin met Alexander Lukashenko. The main statements of the President of 🇧🇾: - "Peace-loving" countries failed to suppress 🇷🇺 and 🇧🇾 sanctions, import substitution progresses⤵️ pic.twitter.com/gDgSefUBqs — ☭ Сама deZan..⚡️ (@Worchestra_) February 17, 2023 -
అరచేతిలో ఆరోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్‌లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కీలక పరీక్షలతో ప్రొఫైల్.. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది. పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్‌లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఇలా.. ‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది. -
డాక్టర్ని చేతికి కట్టేసుకోండి!
వాచీలు బాగానే ఉన్నారుు గానీ... వాటిపై ఆ అక్షరాలేమిటి? గ్రాఫులేమిటి? ఇదేనా మీ సందేహం. ఈ క్రొనోవో వాచీ మీ ఆరోగ్య వివరాలు మొత్తం మీ చేతుల్లో ఉంచుతుంది. స్మార్ట్ఫోన్ల స్థాయిలో ఏర్పాటు చేసిన 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్.. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీల మెమరీలతో ఈ వాచీ ఎన్ని పనులు చేయగలదో చూడండి. అడుగున ఉండే చిన్నసైజు ఎలక్టోడ్ర్లతో ఇది మీ గుండె పనితీరును సూచించే ఈకేజీ గ్రాఫ్‌ను చూపుతుంది. మీ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా ఎలాంటి వ్యాయామాలు చేయాలో సూచిస్తుంది. నడిచే అడుగులు లెక్కపెడుతుంది.. సుఖ నిద్రపైనా ఒక కన్నేసి ఉంచుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల తీరుతోపాటు మీ గుండెచప్పుళ్లల్లో వచ్చే తేడాలనూ పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు అవసరమైన గైరోస్కోపు, యాక్సెలోమీటర్, ఇతర సెన్సర్లు దీంట్లో ఉన్నాయి. ఆండ్రారుుడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటితోనూ పనిచేసే క్రోనోవో వాచీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి దీన్ని వాణిజ్య స్థాయిలో తయారు చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దాదాపు రూ.14 వేలు ఖరీదు చేయగల ఈ హైటెక్ వాచీ టైమ్‌ను ఎటూ చూపిస్తుంది. సంగీతమూ వినిపిస్తుందండోయ్! -
చెమట వాసనతో ఆరోగ్యం గుట్టు చెబుతుంది...
లండన్: మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు అనేక పరీక్షలున్నాయి. స్మార్ట్ఫోన్లు మొదలుకొని ఫిట్నెస్ బ్యాండ్ల వరకూ అనేక గాడ్జెట్ల ద్వారా ఈ వివరాలు తెలుసుకుంటున్న కాలమిది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యూసీ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పట్టీని అభివృద్ధి చేశారు. ఇది శరీరం నుంచి వెలువడే చెమటను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ కీలకమైన ఆరోగ్య వివరాలు అందిస్తూంటుంది. ఇందుకోసం తాము ఫ్లెక్సిబుల్ సెన్సరును తయారు చేశామని ఇది చెమటలోని రసాయనాల మోతాదును పసిగడుతుందని అలీ జావే అనే శాస్త్రవేత్త తెలిపారు. శరీరంలోని గ్లూకోజ్, లాక్టేట్, సోడియం, పొటాషియం వంటి రసాయనాలతోపాటు చర్మపు ఉష్ణోగ్రతను ఈ సెన్సర్లు గుర్తించగలవు. ఈ సెన్సర్‌కు అనుసంధానించిన మైక్రోప్రాసెసర్, వైర్లెస్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు మన స్మార్ట్ఫోన్లకు సమాచారం పంపుతాయన్నమాట. సోడియం, పొటాషియం మోతాదులనుబట్టి మన శరీరాల్లో తగినంత నీరు ఉందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు. అలాగే లాక్టేట్ ద్వారా మన కండరాలు అలసిపోయాయా? అన్నది గుర్తించవచ్చు.