పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే ఆ బాధ ఉండదు!
క్యాన్సర్ పూర్తిగా తగ్గిన వారిలో ఒక రకమైన మానసిక వేదన ఉంటుంది. అది పూర్తిగా తగ్గినా... అంతకు ముందు వారు క్యాన్సర్ వల్ల వచ్చిన షాక్ కారణంగా ‘ఎగ్జిస్టెన్షియల్ డిస్ట్రెస్’ అనే మానసిక సమస్యకు గురవుతారు. అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్న వాహనంలో ఉన్నవారు, ఆ వాహనం వేగం తగ్గాక కూడా ముందున్న ఉద్విగ్నతను అనుభవించినట్లుగా... క్యాన్సర్ తగ్గాక కూడా ఆ ముందు అనుభవించిన వేదనలో కొద్దికాలం కొనసాగుతారు. అయితే సిలోసైబన్ మష్రూమ్స్ అనే ఒక రకం పుట్టగొడుగులను ఆహారంగా తీసుకునే వారిలో ఈ సమస్య ఉండదని పేర్కొంటోంది ఒక హెల్త్ జర్నల్.
దీన్ని ఆహారంగా తీసుకునేవారు లేదా దీని నుంచి దీని నుంచి తయారు చేసిన సైలోసైబిన్ అనే డ్రగ్‌తో కూడా ఇదే ప్రభావం ఉంటుందని పేర్కొంటోంది ‘హెల్త్ డే’ అనే హెల్త్ జర్నల్. సైలోసైబిన్‌ను తీసుకున్న వారు ఒక రకమైన హాయి గొలుపుతున్న ఫీలింగ్‌ను పొందుతుంటారు. అందుకే దీన్నే సెకెడైలిక్ మష్రూమ్ అని కూడా అంటారని చెబుతున్నారు ఆ జర్నల్‌కు చెందిన ప్రతినిధి స్టీవెన్ రెయిన్‌బర్గ్. మామూలుగానైతే సైలోసైబిన్‌ను నరాలకు సంబంధించిన జబ్బుల్లోనూ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతలోనూ సాధారణంగా ఉపయోగిస్తుంటారు.
అయితే అనేక మంది క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన వివరాలను బట్టి కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ నయమైన రోగుల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా క్యాన్సర్ రోగులలోనూ ఇది ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని తెలిసింది. దాంతో ఆ రసాయనం పుష్కలంగా ఉండే మ్యాజిక్ మష్రూమ్స్‌ను ఆహారం తీసుకోవడం వల్ల కూడా అదే ఫలితం దొరుకుతుందని పేర్కొంటోంది ఆ హెల్త్ జర్నల్.