heavy rains in mumbai
-
ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.
ముంబై : ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో ఒకపక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే.. మరోపక్క భారీ వర్షాలు అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులతో పాటు భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముంబై భారీ వర్షాలపై ట్విటర్లో స్పందించారు. (కొడుకు మరణం: అందుకే సబ్వే సర్ఫర్స్..) Of all the videos that did the rounds yesterday about the rains in Mumbai, this one was the most dramatic. We have to figure out if this palm tree’s Tandava was a dance of joy—enjoying the drama of the storm—or nature’s dance of anger... pic.twitter.com/MmXh6qPhn5 — anand mahindra (@anandmahindra) August 6, 2020 'బలంగా వీస్తున్నగాలులకు ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే నాకు అవి డ్యాన్స్ చేసినట్లుగా కనిపించాయి. గాలి బీభత్సం చూస్తే.. ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే జరగుతాయనిపించింది. మొత్తానికి ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నెటిజన్లు షేర్ చేసిన అన్ని వీడియోల్లో ఇది మోస్ట్ డ్రామాటిక్ వీడియోగా నిలిచింది.' అంటూ కామెంట్ చేశారు. మరోవైపు నెటిజన్లు ముంబైని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం మహీంద్రా కామెంట్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. This was send on my family group chat featuring some classic gujju uncle commentary #MumbaiRains #MumbaiRainsLive #MumbaiRain pic.twitter.com/elQ2w4j0iR — Zara Patel (@zarap48) August 5, 2020 కాగా ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలో ప్రజారవాణా సేవలు అన్ని స్తంభించాయి. ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. వర్షాలు అధికంగా కురుస్తుండటంలో ముంబై, పుణెలో రెడ్అలర్ట్ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ శాఖ 12 గంటల్లో 293.8 మిల్లీమీటర్ల వర్షాన్ని రికార్డు చేసింది. 1974 తర్వాత ముంబైలో 24 గంటల వ్యవధిలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. #WATCH A local in Wadala area of #Mumbai carries a kitten on his motorcycle after rescuing it, amid heavy rainfall in the city. He says, "I am taking the kitten home." pic.twitter.com/4qawgwJQzP — ANI (@ANI) August 6, 2020 -
అత్యంత భారీ వర్షాలు.. ముంబైకు రెడ్ అలర్ట్
ముంబై : భారీ వర్షాలు కురుస్తుండటంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రైలు, రోడ్డు మార్గాలన్నీ స్తంభించాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. (బీరూట్ భారీ పేలుళ్లు, 70మంది మృతి ) ఈ రోజు ముంబైలో అత్యవసర, నిత్యవసరాలు మినహా మిగతా షాపులు తీయవద్దని బీఎంసీ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండగా ఇలాంటి సమయంలో భారీ వర్షాలు పెను సమస్యగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. దీనికి తోడు ఉత్తరప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
దంచికొడుతున్న వానలు.. ముంబైలో రెడ్ అలర్ట్
ముంబై :మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై నగరంలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో ట్రైన్లు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో ముంబైలోని సియోన్ ఏరియాలో ప్రధాన మార్గాలు నీటితో నిండిపోయాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సియోన్ రైల్వే స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరింది. ఐఎండీ ఇప్పటికే ముంబై, థానే, పల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయే అవకాశాలున్నాయిని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ హోసలికర తెలిపారు. భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారీ వర్షాలతో మునిగిన ముంబై
ముంబై: భారీ వర్షాలతో అస్తవ్యస్తమైన ముంబైలో భారత వాతవరణ శాఖ హెచ్చరికలతో స్కూళ్లు, కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. ముంబై నగరంలో రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో ట్రైన్లు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా పలు ప్రభుత్వ విభాగాలు ట్విటర్లో చురుకుగా ఉంటున్నాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు. Heavy rainfall warning in the city by IMD. We request Mumbaikars to avoid venturing near the sea or walking in water logged areas. For any assistance do call 1916. Take care Mumbai. #weatherupdate #MCGMUpdate #MumbaiRain #MumbaiRainsLiveUpdates — माझी Mumbai, आपली BMC (@mybmc) September 4, 2019 -
ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబై : కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. నగర శివారు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సముద్రతీర ప్రాంతాల్లో 4.90 మీ. ఎత్తులో అధిక ఆటుపోట్లతో అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతాలవైపు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. 48 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కులో వరద నీరు చేరడంతో సందర్శన నిలిపివేశారు. ముంబై-గోవా హైవే పై రాకపోకలు ఆగిపోయాయి. భారీ వర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంత రహదారులపై చెత్త కొట్టుకు రావడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది.. దానిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. -
స్తంభించిన ముంబై
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరం వరసగా పదిరోజులపాటు కురిసిన వర్షాలతో నీట ముని గింది. ముఖ్యంగా చివరి నాలుగురోజులూ కుంభవృష్టి కురిసింది. బుధవారం కాస్త తెరిపి ఇవ్వడంతో పరిస్థితి కొద్దిగా కుదుటపడింది. గత నాలుగురోజులుగా రైలు, రోడ్డు మార్గాల్లో మూడు నుంచి అయి దడుగుల నీరు నిలిచి రవాణా స్తంభించిపోగా రన్‌వేపై నీళ్లు చేరడంతో విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. ఏటా వర్షాకాలం వచ్చేసరికి ఒక్క ముంబై మాత్రమే కాదు... దేశంలో ఏ నగరం పరిస్థితి అయినా ఇలాగే ఉంటోంది. నైరుతి రుతుపవనాల తీరు చాన్నాళ్లుగా మారిపోయింది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి తప్ప సాధారణ వర్షపాతం అనే మాటే ఉండటం లేదు. వర్షాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వంద మిల్లీ మీటర్ల వర్షం కురుస్తుంటే మరికొన్నిచోట్ల చినుకు జాడే కనబడదు. ముంబైలో గత పది రోజుల్లో 864.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదంతా నెలరోజుల్లో పడే వర్షంతో సమానమని వాతావరణ విభాగం చెబుతోంది. ఏడాది మొత్తం కురిసే వర్షంలో 60 శాతం ఇప్పటికే పడిందని ఆ విభాగం అంటున్నది. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి వీలుగా చాలా ముందుగానే అవ సరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ప్రభుత్వాలకుండాలి. అది లేకపోబట్టే జనజీవనం అస్త వ్యస్థమవుతోంది. నగరాల్లో కళ్లు చెదిరేలా ఆకాశహర్మ్యాలు నిర్మించాలని, అక్కడికి పెద్ద పెద్ద సంస్థలను ఆహ్వా నించి వాటికి సదుపాయాలు కల్పించి ముమ్మరంగా వ్యాపారం, వాణిజ్యం సాగేలా చూడాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. కానీ ఆ సంస్థలతోపాటే వేలాదిమంది ఉపాధి కోసం అక్కడికొస్తారు. ఫలితంగా నగరాలు నానాటికీ విస్తరిస్తుంటాయి. దానికి తగినట్టుగా పౌర సదుపాయాలు మెరుగు పడవు. ముఖ్యంగా మురుగునీటి వ్యవస్థ, చెత్త తొలగింపు వగైరా సమస్యలు అపరిష్కృతంగా ఉండి పోతాయి. వాటిని ఎలా సరిదిద్దాలో, అందుకేం చేయాలో మున్సిపల్ అధికారులకుగానీ, ప్రభు త్వంలో ఉన్నవారికిగానీ అర్ధం కాదు. చివరకు పారిశుద్ధ్యం సరిగాలేక అంటువ్యాధులు ప్రబలడం రివాజుగా మారుతోంది. నగరాలను కాంక్రీటు కీకారణ్యాలుగా మార్చడమే అభివృద్ధి అని విశ్వసించే పాలకుల వల్లే ఈ సమస్య వస్తోంది. కురిసిన వర్షపు నీరు ఎటూపోయే దారిలేక రహదారులు, వాటికి అటూ ఇటూ ఉండే భవనాలు మునుగుతున్నాయి. మురుగునీటి వ్యవస్థ ఆసరాతోనే కురిసిన వర్షపు నీటినంతటినీ వెళ్లగొట్టవచ్చునన్న తప్పుడు అవగాహన దీనికి దారితీస్తోంది. ముంబైలో ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా గోరెగావ్, చెంబూర్, దాదర్ వగైరాలన్నీ నీటమునుగుతుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో కొత్తగా ఏర్పాటైన వాసై, విరార్ వంటి శివారు పట్టణాలు కూడా భారీవర్షాలు కురిసి నప్పుడు మహానదుల్ని తలపిస్తున్నాయి. కాస్త దృష్టి పెడితే నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో వరద నీరు తరచుగా నిలిచిపోతున్నదో గుర్తించడం పెద్ద కష్టం కాదు. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ నీరు పోవడానికి అనువైన కాల్వల నిర్మాణం ప్రారంభిస్తే సమస్యే తలెత్తదు. అలా చేయాలని సంకల్పించిన చోట సైతం డిజైన్ల రూపకల్పనలో, టెండర్ల ఖరారులో, నిధుల మంజూరులో ఎడతెగని జాప్యం చోటు చేసుకోవటం వల్ల పురోగతి ఉండటం లేదు. ముంబైలో 8 పంపింగ్ కేంద్రాలను నిర్మించాలని, వందేళ్ల నాటి పైప్లైన్లను మార్చడానికి 58 ప్రాజెక్టుల్ని చేపట్టాలని 2005లో నిర్ణయించారు. పదమూడేళ్ల తర్వాత చూస్తే ఇప్పటికి అందులో సగం కన్నా తక్కువే పూర్తయ్యాయి. ముంబై మహానగరాన్ని అధ్య యనం చేసిన ముంబై ఐఐటీ, గాంధీనగర్ ఐఐటీ బృందాలు ఆ నగరానికి ఇప్పుడున్న డ్రెయినేజీ వ్యవస్థ ఏమాత్రం సరిపోదని తేల్చిచెప్పాయి. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్న పర్య వసానంగా తరచు భారీ వర్షాలు కురుస్తున్నందున, నగర జనాభా దాదాపు రెండున్నర కోట్లకు చేరు కోవడంవల్లా తాజాగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని నిరుడు సూచించాయి. అయినా చర్యలు అంతంతమాత్రమే. వానాకాలం సమీపిస్తున్నా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదని, ఆ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు విచారించినప్పుడు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనడానికి సంసిద్ధులమై ఉన్నా మని బీఎంసీ గత నెల 21న హామీ ఇచ్చింది. నగరంలో వరద వెల్లువెత్తే 186 ప్రాంతాలను గుర్తిం చామని, అక్కడ చేరే వరదనీటిని తొలగించడానికి అవసరమైన పంపులు ఏర్పాటు చేశామని తెలి పింది. తీరా భారీవర్షాలొచ్చేసరికి నిస్సహాయంగా మిగిలిపోయింది. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపై చాలాచోట్ల గుంతలు ఏర్పడి ద్విచక్రవాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. వాహనాలు, లోకల్ రైళ్లు నిలిచిపోవడంతో ఇళ్లకు వెళ్లే దారి లేక వేలమంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సెల్ఫోన్లు పనిచేయక, విద్యుత్‌లేక, నిత్యావసరాలు దొరక్క సమస్యలు ఎదుర్కొ న్నారు. శతాబ్ది, వడోదర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చిక్కుకుని ఎటూ కదల్లేక ఉండిపోయిన 2,000మంది ప్రయాణికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుని పనిచేయడానికి బదులు ఎవరి పరిధులేమిటన్న అంశంలోనే పరస్పరం కలహించుకుంటున్నాయి. ఫలానాచోట పని తమ పరిధిలోకి రాదని తప్పించుకుంటున్నాయి. చివరకు అన్ని శాఖలూ నిర్లక్ష్యంగా వ్యవహరించి నగరాలను ముంచు తున్నాయి. అంతా జరిగాక ఎవరికి వారు బాధ్యతను అవతలివారిపై నెట్టేస్తున్నారు. ఈ సమన్వయ లేమి వల్ల తలెత్తుతున్న సమస్యలు చూశాకైనా వాటినుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. వచ్చే వర్షాకాలం నాటికైనా ఇటువంటి సమస్యలు పునరావృతం కానీయరాదన్న దృక్పథాన్ని ప్రదర్శించటం లేదు. జనం తిరగబడి నిలదీస్తే తప్ప ఈ దుస్థితి మారదు. -
నేహా ధూపియా ట్వీట్లపై కలకలం
ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. మోదీని విమర్శించే అర్హత ఆమెకు లేదంటూ ఎదురుదాడికి దిగారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంబై మహానగరం స్తంభించింది. దీనిపై నేహా ధూపియా ట్విటర్ లో స్పందించారు. 'ఒక్క వర్షానికే ముంబైలో జనజీవనం స్తంభించింది. మంచి పరిపాలన అంటే సెల్ఫీలు తీసుకోవడం, యోగా చేయడం కాదు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం పాలకుల కర్తవ్యం' అంటూ ట్వీట్ చేశారు. మోదీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు రీట్వీట్లతో తీవ్రస్థాయిలో స్పందించారు. వార్తల్లో నిలిచేందుకు శృతి సేథ్, నేహా ధూపియా లాంటి సి-గ్రేడ్ నటీమణులు మోదీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నేహా ధూపియా ఎలాంటి సినిమాలు చేసిందో చూడాలని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే మోదీ వ్యతిరేకులు ఆమెకు బాసటగా నిలిచారు. బీజేపీ నాయకుల మాదిరిగానే మోదీ మద్దతుదారులు వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. One rain n the city comes to a standstill. Good governance is not about selfies n makin us do yoga,it's making sure ur citizens r safe. — Neha Dhupia (@NehaDhupia) July 21, 2015