heavy vehicle drivers
-
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్‌ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్‌తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్‌ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్‌తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్‌కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్‌గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
అరె... రషీద్ భాయ్‌కు ప్రమోషనొచ్చిందా..!
అరె రషీద్ భాయ్‌కు ప్రమోషనొచ్చిందా.. మన జంగయ్యన్నకు కూడా వచ్చిందా.. అదేందిరా వాళ్లకెలా ఇస్తారు అని ఆశ్చర్యపోవడం మిగతావారి వంతైంది. అదేంటంటే.. జీహెచ్ఎంసీలో వాహనాల డ్రైవర్లుగా (లైట్ వెహికల్) పనిచేస్తున్న 78 మందికి పదోన్నతి కల్పించారు. వారిని హెవీ వెహికల్ డ్రైవర్లుగా నియమించారు. ఇందుకు సంబంధించిన జాబితా కూడా విడుదలైంది. సంతోషంగా తమ పేరును చూసుకున్న డ్రైవర్లు మరో ఇద్దరి పేర్లు చూసి షాక్ అయ్యారు. ఇదేంటి రషీద్‌కు ప్రమోషన్ ఇచ్చారా..! అరె జంగయ్యకు కూడా ఇచ్చారే అని డ్రైవర్లు చర్చించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే రషీద్ గతంలో మృతి చెందాడు.. జంగయ్య పదవీ విరమణ చేశాడు. మృతిచెంది, పదవీ విరమణ చేసిన వారికి కూడా మన జీహెచ్ఎంసీలో పదోన్నతులిస్తారా అని ఆశ్చర్యపోవడం డ్రైవర్ల వంతైంది. ఈ జాబితాకు స్టాండింగ్కమిటీ కూడా ఆమోదముద్ర వేయడం కొసమెరుపు. అయితే ఈ పదోన్నతులు ఇంకా అమల్లోకి రాలేదని అడిషనల్ కమిషర్ (అడ్మినిస్ట్రేషన్) రామకృష్ణారావు తెలిపారు. ఇప్పటికే విధుల్లో లేని పారిశుధ్య కార్మికులను ఉన్నట్లు చూపుతూ, ఎప్పుడో మరణించిన వారి పేరిట సైతం నెలనెలా జీతాలు విడుదల చేస్తున్న బల్దియా అదే ధోరణిలో పాలన సాగిస్తోంది. - హైదరాబాద్, సిటీబ్యూరో, సాక్షి -
జీహెచ్ఎంసీలో మరణించిన వ్యక్తికి పదోన్నతి
సాక్షి,సిటీబ్యూరో: అరె రషీద్ భాయ్‌కు ప్రమోషనొచ్చిందా.. మన జంగయ్యన్నకు కూడా వచ్చిందా.. అదేందిరా వాళ్లకెలా ఇస్తారు అని ఆశ్చర్యపోవడం మిగతావారి వంతైంది. అదేంటంటే.. జీహెచ్ఎంసీలో వాహనాల డ్రైవర్లుగా(లైట్ వెహికల్) పనిచేస్తున్న 78 మందికి పదోన్నతి కల్పించారు. వారిని హెవీ వెహికల్ డ్రైవర్లుగా నియమించారు. ఇందుకు సంబంధించిన జాబితా కూడా విడుదలైంది. సంతోషంగా తమ పేరును చూసుకున్న డ్రైవర్లు మరో ఇద్దరి పేర్లు చూసి షాక్ అయ్యారు. ఇదేంటి రషీద్‌కు ప్రమోషన్ ఇచ్చారా..! అరె జంగయ్యకు కూడా ఇచ్చారే అని డ్రైవర్లు చర్చించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే రషీద్ గతంలో మృతి చెందాడు.. జంగయ్య పదవీ విరమణ చేశాడు. మృతిచెంది, పదవీ విరమణ చేసిన వారికి కూడా మన జీహెచ్ఎంసీలో పదోన్నతులిస్తారా అని ఆశ్చర్యపోవడం డ్రైవర్ల వంతైంది. ఈ జాబితాకు స్టాండింగ్కమిటీ కూడా ఆమోదముద్ర వేయడం కొసమెరుపు. అయితే ఈ పదోన్నతులు ఇంకా అమల్లోకి రాలేదని అడిషనల్ కమిషర్(అడ్మినిస్ట్రేషన్) రామకృష్ణారావు తెలిపారు. ఇప్పటికే విధుల్లో లేని పారిశుధ్య కార్మికులను ఉన్నట్లు చూపుతూ, ఎప్పుడో మరణించిన వారి పేరిట సైతం నెలనెలా జీతాలు విడుదల చేస్తున్న బల్దియా అదే ధోరణిలో పాలన సాగిస్తోంది. -
‘రోడ్ సేఫ్టీ క్లబ్’
దేశంలో సంభవించే మరణాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలే. వాహనదారులే కాదు... రోడ్డు మీద నడిచే వాళ్ల తప్పుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై రకరకాల గీతలుంటాయి. సిగ్నల్స్ కనిపిస్తాయి. కానీ... వాటి గురించిన క్షుణ్ణంగా ఎంత మందికి తెలుసు! చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. వీటిని నివారించాలంటే నిబంధనలపై అవగాహన ఉండాలి. వాటిని కచ్చితంగా పాటించాలి. అదే పని చేస్తోంది నగరంలోని ‘రోడ్ సేఫ్టీ క్లబ్’. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అవేర్నెస్సే సరైన మార్గమంటున్న ఈ క్లబ్ విశేషాలు... -ఓ మధు ఫుట్‌పాత్ ఉంటే ఓకే... లేనప్పుడు ఎక్కడ నడవాలి? చాలా మందికి ఈ విషయం తెలియదు. అలాగే వివిధ సూచీలు కనిపిస్తాయి. వాటిపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. ఇది చిన్న విషయమే అనుకోవడం వల్లే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేలా చేయడం రోడ్ సేఫ్టీలో భాగమే. అదే ఈ క్లబ్ లక్ష్యం. ఎక్కువగా దీనిపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు క్లబ్ మెంబర్స్. ఈ కార్యక్రమాలన్నింటినీ స్కూళ్లు, కాలేజీలకు చేరువ చేయడానికి ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్... క్లబ్‌కు సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు అరవైకి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు ఆటో, ట్యాక్సీ, బస్, లారీ డ్రైవర్లకూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ‘రోడ్డు ఎవరి ప్రాపర్టీ కాదు. అందరిదీ. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు వాడతారు. నిబంధనల ఉల్లంఘనకూ పాల్పడతారు. అలా కాకుండా సూచించిన సిస్టమ్‌లో వెళితే చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ఈ దిశలోనే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం’ అంటారు రోడ్ సేఫ్టీ క్లబ్ ఫౌండర్, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మార్పు సాధ్యమేనా! ‘1983లో 40 లక్షల మంది లెప్రసీ రోగులుండేవారు. ఆ వ్యాధిని అదుపు చెయ్యటం అప్పుడు కష్టం. కానీ... భారత్‌ను ఇప్పుడు పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఈ మార్పు కేవలం అవగాహనతో వచ్చిందే. తమ తప్పు లేకుండా ప్రమాదానికి గురైనవారు లెక్కకు మించే ఉన్నారు. రోడ్డుపై కాలు పెట్టిన మరుక్షణం నుంచి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండక తప్పదు. రోడ్డు ప్రమాదాలు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశమంతటా ఇదే పరిస్థితి. విషయం ఇంత తీవ్రమైనదైనప్పుడు దాని గురించి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడం అత్యంత ముఖ్యమైనదని భావించాం’ అన్నారు క్లబ్ ఆర్గనైజర్, ఐడీఎఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంజయ్‌రామ్. వాకథాన్... రోడ్డు ప్రమాదం జరిగిన చాలా సేపటికి గానీ బాధితులు ఆసుపత్రికి చేరడం లేదు. సరైన సమయానికి తేగలిగితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. డాక్టర్‌గా ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. ఈ దిశగా కూడా అవేర్నెస్ తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని స్థాయిల్లో రోడ్డు నిబంధనలు పకడ్బందీగా పాటించేలా చేయగలిగితే ఎన్నో ప్రమాదాలు అరికట్టవచ్చు. ఈ నెల 11న నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా వాకథాన్ నిర్వహిస్తున్నాం. గతేడాది జరిగిన వాకథాన్‌కు ఖర్చు మేమే భరించాం. ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు కూడా సహకరిస్తే సేవలు మరింత విస్తరిస్తాం’ అని క్లబ్ కోఆర్గనైజర్, పిడియాట్రిస్ట్ డాక్టర్ గీతాంజలి చెబుతున్నారు. అందరికీ అవగాహన... చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నది క్లబ్ ఉద్దేశం. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి పిల్లలకు క్లబ్ సభ్యులు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో స్కూల్లో కొంత మంది పిల్లలను ఎంపిక చేసి వారి ద్వారా అక్కడ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. పోస్టర్లు, స్లోగన్స్, ఎస్సే రైటింగ్ వంటివి పెడుతున్నారు.అలాగే కార్పొరేట్ సంస్థలకు కూడా కార్యక్రమాలు విస్తరించారు. వారి కోసం వీడియో ప్రజంటేషన్, ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. చదువుకోని హెవీ వెహికిల్ డ్రైవర్లకు వారానికి రెండుసార్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏడాదికోసారి సేఫ్టీ వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్కూల్ బస్ డ్రైవర్లకూ అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని పాఠశాలల నుంచి చాలా మంది పిల్లలు ఆసక్తిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు క్లబ్ సభ్యులు చెబుతున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్స్ పాటించడం, రోడ్ క్రాసింగ్, ఓవర్‌లోడ్ వంటివి ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు. మెదక్ ఘటన సమయంలో... ‘మెదక్‌లో స్కూల్ బస్ ప్రమాదం వార్త తెలియగానే సంఘటనా స్థలికి చేరుకున్నాం. ఆ ప్రాంతంలో స్కూల్ బస్ డ్రైవర్స్ కోసం రోడ్ సేఫ్టీ గురించి నాలుగు సెషన్స్ నిర్వహించాం. ఆ తర్వాత ఆ జిల్లాలోని అన్ని స్కూల్స్‌లోనూ అవగాహన కల్పించాం. కార్యక్రమాలను మరింత విస్తరించడానికి కొందరికి శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం’ అంటారు శ్రీనివాస్. క్లబ్ వివరాలకు http://www.meetup.com/ROADSAFETYCLUB/లింక్ క్లిక్ చేయవచ్చు.