heir
-
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
బారక్పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్‌ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని బారక్పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు. 400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు. -
ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు!
ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయినవారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన యావదాస్తిని తన వద్ద పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆస్తి ఎంతనుకుంటున్నారు? ఏకంగా రూ.91 వేల కోట్ల విలువైన ఆస్తి. ఇందు కోసం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పెస్ (Hermes)ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ (Nicolas Puech) తన దగ్గర పనిచేసే 51 ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 11 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.91 వేల కోట్లు) సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూన్ డి జెనీవ్ ఫార్చ్యూన్ అనే స్విస్ పత్రిక నివేదించింది. ఐదో తరం వారసుడు హెర్మెస్ కంపెనీని థియరీ హెర్మెస్1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఈయన కంపెనీలో 9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన 5- 6 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస్‌కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తదనంతరం సంపదను తన వద్ద పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం న్యాయవాద బృందాన్ని సైతం నియమించినట్లు సమాచారం. ఇప్పటికే రూ.49 కోట్లు అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు (రూ.49 కోట్లు) విలువైన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మొరాకోలోని మరకేష్‌లోని ఆస్తి, స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్లోని ఒక విల్లా ఉన్నాయి. కుటుంబంలో విభేదాలు ఫార్చ్యూన్ కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 220 బిలియన్ డాలర్ల విలువైన హెర్మెస్ కంపెనీలో తనకున్న 5-6 శాతం వాటాను తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీ సూపర్వైజరీ బోర్డు నుంచి నికోలస్ ప్యూచ్ 2014లో తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ హెర్మెస్లో 23 శాతం వాటాను బలవంతంగా దక్కించుకుంది. దీన్ని అడ్డుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్యూచ్ మాత్రం తన వాటాను కొనసాగించారు. ఈ విభేదాలే నికోలస్ తన వారసులుగా కుటుంబ సభ్యులను కాకుండా బయటి వ్యక్తిని తన వారసుడిగా చేయడానికి కారణంగా భావిస్తున్నారు. దత్తత సాధ్యమేనా? నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే వ్యక్తిని దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నా ఆయన పెద్దవారు కావడంతో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల దత్తతకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమతుందో చూడాలి. -
ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. కట్ చేస్తే కుటుంబం చేతిలోనే..
ఏనుగుకి మనిషికి మధ్యన ఏర్పడిన బాంధవ్యం గురించి చక్కగా వివరించే ది ఎలిఫెంట్ విస్పరస్ డాక్యుమెంటరీ ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే . అచ్చం అలాంటి కథే ఉత్తరాఖండ్‌కి చెందిన రెండు ఏనుగులకు ఓ మనిషికి మధ్య జరిగింది. ఆ ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే తాను లేకపోతే ఏనుగులు ఎలా అని తన కుటుంబ సభ్యులు మాదిరిగా ఆస్తి రాసిచ్చేంత వరకు దారితీసింది. కానీ ఆ హద్దులు లేని ప్రేమే అతని హత్యకు కారణమైంది కూడా. అసలేం జరిగిందంటే..బిహార్‌లోని జన్‌పూర్‌కి చెందిన అక్తర్ ఇమామ్ తాను పెంచుకుకంటున్న రాణి, మోతీ అనే ఏనుగులకు తన కుటుంబ సభ్యలు మాదిరిగానే వాటికి కూడా ఆస్థిలో వాటా ఇచ్చాడు. ఎందుకంటే తాను చనిపోతే వాటి ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు. తన ఆస్తిలో సగం తన భార్య, పిల్లలకు పంచి మిగతా రూ. 5 కోట్ల ఆస్తిని తన ఏనుగుల పేర రాశాడు. ఏనుగుల యజమానులు చనిపోతే వాటి సంరక్షణ ఎవరూ పట్టించుకోని పలు ఘటనలు చూశానని అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలా ఏనుగుల కోసం తన ఆస్తిని కేటాయించిన తొలి వ్యక్తి ఇమామ్ అని వన్య ప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమామ్ ఆధ్వర్యంలోని ఏషియన్ ఎలిఫెంట్ రిహాబిలేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్‌ని ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సంరక్షిస్తున్నారు. ఇమామ్ ఈ ట్రస్ట్‌ని తన ఏనుగుల కోసమే ఏర్పాటు చేసినట్లు ఖాన్ తెలిపారు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారి పలు ఛానెల్స్‌లో అక్తర్ ఇమామ్ పేరు మారు మ్రోగినట్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఇమామ్ లేడు. ఆయన ఇలా ఏనుగులకు ఆస్తి ఇవ్వడం అతని కుటుంబానికి నచ్చలేదు. ఈ విషయమై ఇమామ్‌కి తన కుటుంబ సభ్యుల మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి కూడా. అదీగాక తన కుటుంబం నుంచి ప్రమాదం పొంచి ఉందని 2020లో కోవిడ్ సమయంలో మొదటి లాక్‌డౌన్‌ని ఎత్తివేయగానే బిహార్‌న నుంచి హుటాహుటినా తన రెండు ఏనుగులను తీసుకుని ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు వచ్చేశాడు. అక్కడే ఏనుగులకు సంరక్షణకు సంబంధించిన ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి ఈ ఏనుగులను ప్రేమగా చూసుకుంటుండేవాడు. ఐతే ఇమామ్ ఊహించినట్లుగానే జరిగేంది. 2021లో ఇమామ్ తన కుటుంబం చేతిలోనే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఆ ట్రస్ట్‌ని, ఇమామ్ పెంచుకుంటున్న ఏనుగులను వన్యప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇమామ్ పెంచుకున్న ఏనుగుల్లో మోతీ అనే ఏనుగు చనిపోయింది. దీంతో రాణి అనే ఏనుగు ఒక్కత్తే ఆ రూ. 5 కోట్ల ఆస్తికి వారసురాలు. కానీ ఆస్తి మాత్రం బిహార్‌లోని పాట్నాలో ఉంది. నిధుల కొరతతో సతమతమవుతున్న అక్తర్ ఫౌండేషన్‌కి ఆ ఆస్తి చెందితేనే ఇమామ్ కోరిక కూడా నెరవేరుతుందని సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. (చదవండి: భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్) -
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్‌పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్‌నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
ఆడపిల్ల వద్దంట..!
వారసుడి కోసం ఆ దంపతులు ఆడశిశువును వద్దకున్నారు.. మగ బిడ్డే ముద్దు.. ఆడబిడ్డ వద్దంటూ పేగుబంధాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.శిశువును అప్పగించేందుకు శిశుగృహకు చేరుకున్నారు. కానీ ఆ శిశువు పుట్టి మూడు నెలలు మాత్రమే కావడం, ఆరు నెలల పాటు తల్లి పాలనే పట్టించాలని అధికారుల కౌన్సిలింగ్‌తో వెనక్కు తగ్గారు. ఈ ఘటన తిరుమలగిరి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మండలంలోని నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధి జాల్ తండాకు చెందిన జటావత్ అంజి, లక్ష్మి వ్యవసాయంతో పాటు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదటి కాన్పులో ఆడ శిశువు జన్మించింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లనే పుట్టడంతో తాము ఆ శిశువును సాకలేమంటూ ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తీసుకెళ్లారు. చిన్నారికి 3 నెలలు మాత్రమే ఉన్నాయని, కనీసం ఆరు నెలల వరకైన తల్లి పాలను పట్టించాలని అధికారులు సూచించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల సూచన మేరకు సీడీపీవో గంధం పద్మావతి మంగళవారం గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి చదువు, పెండ్లి వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆడపిల్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని సౌకర్యాలతో ప్రసవాలు చేస్తారన్నారు. దీంతో పాటు కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12వేలు అందిస్తుందని తెలిపారు. గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో ప్రతి గిరిజన బాలికకు రూ.లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యాయోజన పథకం, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పేద విద్యార్థులకు చదువులు, సన్నబియ్యంతో పాటు, నాణ్యతతో కూడిన మెనూ అందిస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు. మారని గిరిజన సంప్రదాయం అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజనుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన దంపతులు మగబిడ్డకు జన్మనివ్వాల్సిందే నట... ఆ దంపతుల సంతానంలో మగపిల్లాడు పుట్టకుండా, ఆడపిల్లలే పుట్టినట్లయితే ఆ తల్లిని గొడ్రాలిగా భావించి హీనంగా చూడడం, శుభకార్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, వారసుడి కోసం అత్తామామలు భర్తకు మరో యువతితో వివాహంం జరిపించటానికి వెనుకాడని పరిస్థితి.. తొమ్మిదినెలలు మోసిన తన బిడ్డను శిశుగృహకు అప్పగించటానికి ఆ తల్లులకు బాధగా ఉన్నా మగబిడ్డ కోసం తప్పడం లేదంటూ వాపోతున్నారు. -
వారసత్వంపై యంగ్ హీరో క్లారిటీ..!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులకు కవలలు జన్మించనున్నారట. కొడుకు పుడితే వారసుడు పుట్టాడని అంటారు. ఈ విషయంపై మంచు విష్ణు స్పందించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ చాలా మంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా.. నాకు ఇద్దరు వారసురాళ్ళు ఉన్నారు.. అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు.’ అని మంచు విష్ణు తన అకౌంట్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాక మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
అసలు జయలలితకు వారసులెవరు?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం నేడు ఓ.పన్నీర్‌సెల్వం, శశికళ రెండు వర్గాలుగా చీలిపోవడం సరిగ్గా 30 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రతిబింబిస్తోంది. 1987లో ఎంజీ రామచంద్రన్ చనిపోయినప్పుడు ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్, జయలలిత మధ్య చోటుచేసుకున్న వారసత్వ రాజకీయాలే నేడు పునరావతమవుతున్నాయి. నాడు ఎంజీఆర్ చనిపోయిన రోజు నుంచే వారసత్వ రాజకీయాలకు తెరలేవగా నేడు కాస్త ఆలస్యంగా రాజుకున్నాయి. ఎంజీఆర్ హయాంలో పార్టీ సైంధాంతిక ప్రాతిపదికగల పార్టీగా కాకుండా ఎంజీఆర్ ఫ్యాన్ క్లబ్గానే నడిచింది. జయలలిత హయాంలో కూడా దాదాపుగా అలాగే కొనసాగింది. ఏఐఏడీఎంకేకు సైంధాంతిక ప్రాతిపదిక ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన వారికే ముఖ్యమంత్రి సీటు దక్కేది. జయలలితకు నిజమైన వారసులెవరనే సమస్య వచ్చేది కాదు. జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉన్నందుకు శశికళను ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకోవాలా? జయలలిత జైలు కెళ్లినప్పుడల్లా ఆమె పరమ విధేయుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలను మోసినందున పన్నీర్‌సెల్వంను వారుసుడిగా ఎన్నుకోవాలా? ఇందులో ఏది ప్రజాస్వామ్యం? ఏది అప్రజాస్వామ్యం? ఏఐడీఎంకేకు ఓ సైంధాంతిక ప్రాతిపదిక ఉండి, అది ప్రజాస్వామ్యబద్దంగా పనిచేసి ఉన్నట్లయితే జయలలిత జైలుకెళ్లినప్పుడే ఆమెను పార్టీ బహిష్కరించి ఉండేది. అది పార్టీ పరంగా నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకునేది. వాస్తవానికి జయలలిత ఇంతకాలం ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన కార్వదర్శిగా పాలన సాగించిందీ ప్రజాస్వామ్యబద్ధంగా కాదు. ముసుగేసిన నియంత్రత్వం పద్ధతిలో. అలాంటప్పుడు జయలలిత వారసులు ఎవరన్నది పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఎలా తేల్చగలరు? వ్యక్తిగత ప్రయోజనాల లాలూచిలోపడే ఎమ్మెల్యేలు ఆకర్షణీయ ఆఫర్లకు లొంగిపోయి ఎన్నుకోవడమే అసలైన ప్రజాస్వామ్య రాజకీయం. లేదంటే ముఖ్యమంత్రి చనిపోయిన సందర్భాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అది సాధ్యమయ్యే పనికాదు కనుక మొత్తం అసెంబ్లీని సమావేశపరిచి పోటీ పడుతున్న నాయకుల మధ్య రహస్య బ్యాలెట్ నిర్వహించాలి. ఎమ్మెల్యేలతో శిబిరాలను నిర్వహించే సంస్కతికి చెరమగీతం పాడాలి. వ్యక్తులను చూసి కాకుండా, పార్టీలను చూసి ఓటేసే పరిణతి పార్టీలకు, ఓటర్లుకు వచ్చిన నాడే వారసత్వ రాజకీయాలకు తెరపడుతుంది. –ఓ సెక్యులరిస్ట్ కామెంట్