Helicopter Trips Booking
-
ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్హెచ్ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్జీ అనేది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్‌హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి. -
'5 కి.మీ. ప్రయాణానికి హెలికాప్టర్ బుక్ చేసిన మంత్రి'
గువహతి: దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా వరకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హెలికాప్టర్లను వాడటం మనకు తెలిసిందే. సమయం వృథా కాకుండా.. ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటే ఇలా చేస్తారు. కానీ అసోంలోని ఓ మంత్రి మాత్రం కేవలం 5 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా చాపర్ బుక్ చేసుకున్నారు. ఆర్థిక మంత్రి హిమంత బిస్వాశర్మ ఈ పని చేశారు. ఇంత తక్కువ ప్రయాణానికి ఆయన హెలికాప్టర్ వాడటం ఆసక్తిగా మారింది. అయితే ఆయన ఇలా చేయడానికి ఓ కారణం కూడా ఉందని ఆయన అనుచరులు వెల్లడించారు. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ అసోం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజెన్ బోర్తాకుర్ మరణించడంతో ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమానికి అసోం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హిమంత బిస్వాశర్మ హాజరు కావాల్సి వచ్చింది. కానీ అప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు అక్కడ ఉధృతంగా నడుస్తున్నాయి. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్తలు గుహవటి- తేజ్ పూర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. రోడ్డు మార్గాన వెళితే.. ఆందోళనకారులు అడ్డుకుంటారని భావించి, ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 5 కి.మీ. దూరంలోని తేజ్‌పూర్‌కు హెలికాప్టర్ వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చదవండి: నెలకు ఇంటి అద్దె రూ.15 లక్షలా? -
ఆకాశమార్గాన మేడారానికి...
నేటి నుంచి హెలికాప్టర్ ట్రిప్పుల బుకింగ్ సాక్షి, హైదరాబాద్: మేడారం ఉత్సవాన్ని గగనతల యాత్రతో జరుపుకోవాలనుకునే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. హెలి టూరిజం జాయ్ రైడ్స్ లో భాగంగా దీన్ని సిద్ధం చేసింది. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం రాత్రి కంపెనీ ప్రతినిధులతో చర్చించి గగన విహార ధరలను ఖరారు చేసింది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖతోపాటు ఆ ఏవియేషన్ సంస్థ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి 18 వరకు మేడారం సందర్శనకు అవకాశముంది. పురాతన జలాశయమైన లక్నవరంను ఆకాశం నుంచి వీక్షించేందుకూ ఓ ప్యాకేజీ పెట్టింది. బేగంపేట విమానాశ్రయంతోపాటు నెక్లెస్‌రోడ్డులో హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజి మైదానం, లక్నవరం ఒడ్డున, మేడారం చేరువలో కూడా వాటిని సిద్ధం చేస్తున్నారు. సిటీ ట్రిప్ 21 తర్వాత... హైదరాబాద్ నగరాన్ని గగనతలం నుంచి వీక్షించే ప్యాకేజీలు ఈనెల 21 తర్వాత అందుబాటులోకి రానున్నాయి. దీని ధర రూ.4 వేలుగా ఉండనుంది. ప్యాకేజీ ధరలను త్వరలో ప్రకటించనున్నారు. మేడారానికి ప్యాకేజీ ధరలు * లక్నవరం చెరువును గగనతలం నుంచి వీక్షిం చేందుకు ఒక్కొక్కరికి రూ.3,330. ఒక్కో పర్యటన 8-10 నిమిషాలు. కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి. * లక్నవరం నుంచి మేడారం దేవాలయానికి ఒక్కొక్కరికి రూ.5,400. కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి. * వరంగల్ నుంచి మేడారం వరకు ఆరుగురు ప్రయాణికుల ప్యాకేజీ టూర్(రానూపోనూ) ధర రూ.92,500 (సర్వీసుటాక్స్ అదనం) * బేగంపేట నుంచి మేడారం... ఆరుగురు ప్రయాణికుల ప్యాకేజీ టూరు (రానూపోనూ కలిపి)... ధర రూ. 2,75,000 (సర్వీసు టాక్స్ అదనం)