hemalatha reddy
-
న్యూస్ రీడర్ నుంచి హీరోయిన్గా రాణిస్తున్న విశాఖ బ్యూటీ (ఫోటోలు)
-
మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక..
సీతమ్మధార(విశాఖ): అటు అందం.. ఇటు అభినయం కలగలిపిన విశాఖ సోయగం హేమలతారెడ్డి.. గ్లామర్ ఫీల్డ్‌లో పాదరసంలా దూసుకుపోతున్నారు. బుల్లితెర, వెండితెర, ఫ్యాషన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పలు టీవీ చానళ్లలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చారు. అటు సీరియళ్లు, సినిమాలు.. ఇటు ఫ్యాషన్ రంగంలో విజయాలతో తన కలలను సాకారం చేసుకుంటున్నారు. వెండితెరపై నా పేరుండాలి.. నా నటన అందరూ గుర్తు పెట్టుకోవాలి.. అని అంటున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశాఖలోనే ఓనమాలు విశాఖ నటనలో నాకు ఓనమాలు నేర్పింది. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇప్పుడీస్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే. డాబాగార్డెన్స్‌లో ఉంటున్నాం. నాన్న సూర్య దేవర వెంకటరావు నేవీలో పనిచేసి రిటైరయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు. చదువుంతా సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థలో సాగింది. తాను ఇంటర్ వరకు అక్కడే చదివా. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ క్లాసికల్ చేశా. తల్లి ధనలక్ష్మి ఫైనాన్స్ వ్యాపారం.న్యూస్‌రీడర్ నుంచి హీరోయిన్ వరకు.. నాన్న నన్ను న్యూస్ రీడర్‌గా చూడాలనుకున్నారు. ముందుగా టీవీ 9, తర్వాత ఎన్టీవీలో ఎంటర్టైన్మెంట్ షోలు చేశా. ఎందరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశా. జెమిని టీవీలో సినిమా న్యూస్‌రీడర్‌గా చేశా. మంచు విష్ణు నిర్మించిన హ్యాపీడేస్ సీరియల్లో కల్యాణి పాత్రలో నటించా. ఆ సీరియల్‌కు, అందులో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. అంతఃపురం, క్రైమ్ తదితర సీరియల్స్ చేశాను. జెమిని, మా టీవిలో నేను నటించిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. నేను ఇప్పటివరకు సుమారుగా 20 వరకు సీరియల్స్‌లో నటించాను. గతంలో విశాఖ బిగ్ ఎఫ్ఎంలో జాబ్ కోసం ట్రై చేశా. ఇప్పుడు అదే ఎఫ్ఎంలో నన్ను ఇంటర్వ్యూ అడగడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక. సౌందర్య, సమంత తన అభిమాన హీరోయిన్లు. తెలుగు హీరోయిన్లు అంజలి, వైష్ణవి సినిమాల్లో రాణిస్తున్నారు. వారి లాగే నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వీరభద్ర క్రియేషన్స్ పేరిట సొంత బ్యానర్ 2017లో ప్రారంభించాను.గ్లామర్ ఆన్ మిసెస్ ఇండియా అవార్డుతో విశాఖలో జని్మంచిన పోతురెడ్డి హేమలతా రెడ్డి మలేసియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్ టీవీ, జెమినీ టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత పలు షోలో పాల్గొన్నారు. హ్యాపీడేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అనంతరం హీరో జగపతిబాబుతో ప్రవరాఖ్యుడు సినిమాలో నటించారు. అందులో హేమలతా రెడ్డి హీరోయిన్ ప్రియమణి స్నేహితురాలిగా నటించారు. నిన్నే చూసి సినిమాలో హీరోయిన్గా నటించి నిర్మాతగా వ్వవహరించారు. అక్కడ నుంచి మిసెస్ ఇండియా పోటీలో విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించి ప్రపంచ వ్యాప్తంగా 300 మందిలో విజేతగా నిలిచారు. -
'నిన్నే చూస్తు' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నే చూస్తు దర్శకుడు: కె. గోవర్ధనరావు నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలత రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్త్ మహేష్ తదితరులు బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్ ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి సంగీతం: రమణ్ రాతోడ్ ఎడిటర్ : నాగిరెడ్డి కెమెరా : ఈదర ప్రసాద్ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022 శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం నిన్నే చూస్తు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ అమలాపురంలో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్‌ను హత్య చేసిన వారిని చంపాలని రగిలిపోతుంటాడు. బ్యాగ్‌లో గన్ పెట్టుకొని తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెదుకుతూ ఉంటాడు. చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్‌లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర)ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్ స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య. ఈ క్రమంలో హీరోహీరోయిన్లిద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య. దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణకు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడు. అతడి మీద కోపంతో సత్యతో నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్ యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకుతో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అసలు జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్‌ను ఎందుకు చంపాడు? జగదీశ్‌ను కృష్ణ చంపాడా లేదా? సత్య కృష్ణను పెళ్లాడిందా? లేక తన బావను పెళ్లి చేసుకుందా? అన్న విషయాలు తెలియాలంటే "నిన్నే చూస్తు".. సినిమా చూడాల్సిందే! నటీనటుల పనితీరు అమ్మను ప్రేమగా చూసుకొనే కొడుకుగా, సత్యను ప్రేమించే లవర్‌గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కొడుకుగా పలు షేడ్స్ వున్న పాత్రలో శ్రీకాంత్ చక్కగా నటించాడు. ఒక వైపు నిర్మాతగా మరోవైపు హీరోయిన్గా బుజ్జి(హేమలతా రెడ్డి) ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు, హీరో ఫ్రెండ్స్ వారి పాత్రలకు తగ్గట్లు నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనను దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. రమణ్ రాథోడ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ పర్వాలేదు. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఇంకాస్త ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. చదవండి: అప్పుడే సమంతతో లవ్‌లో పడ్డా: విజయ్ దేవరకొండ బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? -
క్రిస్మస్ జోష్