Hera Ben
-
నాటి మధుర క్షణాలు...ఆమెది చాలా విశాల హృదయం: మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. శనివారం ప్రధాని మోదీ తల్లి హీరా బెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కాళ్లు కడిగా ఆశీర్వాదం తీసుకోవడమే గాక చిన్నతనంలో తన అమ్మతో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. బాల్యంలో ఉండగా మోదీ తల్లి ఇతురపట్ల ఎలా ప్రేమతో ఉండేవారు వివరించారు. ఈ మేరకు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను గురించి వెల్లడించారు మోదీ. నాటి మధుర స్మృతిని వివరిస్తూ..."తన తండ్రి స్నేహితుడు తమ ఇంటికి సమీపంలో ఉండే గ్రామంలోనే ఉండేవాడని చెప్పారు. ఐతే ఆయన అకాల మరణం చెందడంతో తన తండ్రి తన స్నేహితుడి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చేవారిని తెలిపారు. అతని పేరు అబ్బాస్ అని, తమతోనే ఉండి చదువు పూర్తి చేసుకున్నాడని అన్నారు. ఇతరుల సంతోషాలలో ఆనందాన్ని పొందడం ఎలాగో నేర్పిన గొప్పవ్యక్తి అంటూ...మోదీ తన తల్లిని ప్రశంసించారు. ప్రతి ఏడాది ఈద్‌కి తన కిష్టమైన వంటకాలు వండేదని, పైగా పండగలప్పుడూ తమ ఇంటికి వచ్చిన ఇరుగుపొరుగు పిల్లలకి తన తల్లి వండిన వంటకాలను ఆస్వాదించడం షరా మాములే ." అంటూ... నాటి మధుర క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మోదీ తన స్వస్థలమైన వాద్‌నగర్‌ను సందర్శించారు. తూర్పు గుజరాత్‌లోని అదే పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేసేవారు. శిథిలావస్థకు చేరిన టీ కియోస్క్ తోపాటు ఆ రైల్వే స్టేషన్ కూడా ప్రస్తుతం పునరుద్ధరించబడింది. (చదవండి: నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోదీ భావోద్వేగం) -
‘లంచం తీసుకోనని అమ్మకు మాటిచ్చాను’
న్యూఢిల్లీ : ఆ రోజు మా అమ్మ నా చేత లంచం తీసుకోనని ప్రమాణం చేయించింది.. అందువల్లే నేను ఈ రోజు ఇంత స్వచ్ఛంగా ఉన్నాను అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు విషయాల గురించి మాట్లాడారు. ‘మా అమ్మ దృష్టిలో ప్రధాని పదవి కన్నా గుజరాత్ సీఎం పదవే చాలా విలువైనది. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు నేను ఆమెకు దగ్గరగా ఉండేవాడిని కదా అందుకే సీఎం పదవంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం’ అని తెలిపారు. అంతేకాక ‘నన్ను తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రకటించిన సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ప్రమాణస్వీకారానికి ముందు నేను మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవడానికి అహ్మదాబాద్ వెళ్లాను. అప్పుడు మా అమ్మ నా సోదరుని దగ్గర ఉండేది. నేను వెళ్లేసరికే అక్కడ సంబరాలు ప్రారంభమయ్యాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని కాబోతున్నానని మా అమ్మకు కూడా తెలిసింది. అయితే ఆ పదవి బాధ్యతలు ఎలా ఉంటాయనే విషయం మా అమ్మకు తెలియదు. నేను వెళ్లగానే మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని.. పోనిలే ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు. నాకదే చాలు అంది’ అని గుర్తు చేసుకున్నారు. అప్పుడు మా అమ్మ ‘నీ ఉద్యోగం ఏంటో నాకు తెలియదు. కానీ జీవితంలో లంచం తీసుకోను అని నాకు మాటివ్వు అన్నారు. ఆ రోజు మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నా జీవితంలో లంచం తీసుకునే పాపం చేయ్యలేదు. ఫలితంగా ఈ రోజు ఇంత స్వచ్ఛంగా ఉన్నాన’ని తెలిపారు. అంతేకాక ‘సీఎం, పీఎం అన్నది అమ్మకు ముఖ్యం కాదు. ఆ సీటులో కూర్చున్న వారు ఎవరైనా సరే నిజాయితీగా ఉండాలి.. దేశం కోసం పాటుపడాలి అనేదే ఆమె సిద్దాంతం’ అంటూ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు పనిచేశారు. 2014లో బీజేపీ తరఫున ప్రధాని అయ్యారు -
మోడీ తల్లికి షరీఫ్ బహుమతి
న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య సత్సంబంధాల మాటేమో కానీ.. రెండు దేశాల ప్రధానమంత్రుల మధ్య మాత్రం బహుమానాల సాక్షిగా మంచి అనుబంధం ఏర్పడింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి మోడీ అందమైన షాల్‌ను కానుకగా పంపిస్తే.. మోడీ మాతృమూర్తి హీరాబెన్‌కు షరీఫ్ అద్భుతమైన తెల్లని చీరను బహూకరించారు. ఈ విషయాన్ని గురువారం మోడీ ట్విట్టర్లో వెల్లడించారు. ‘నవాజ్ షరీఫ్ మా అమ్మ కోసం అందమైన తెల్లని చీరను పంపించారు. అందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. త్వరలోనే ఆ చీరను అమ్మకు పంపిస్తాను’ అని మోడీ ట్వీట్ చేశారు. భారత ప్రధాని మోడీ తన నానమ్మకు పంపిన షాల్ చాలా బాగుందంటూ నవాజ్ షరీఫ్ కూతురు మార్యమ్ నవాజ్ షరీఫ్ కూడా గతంలో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ‘మీరు నానమ్మకు పంపిన బహుమతికి థాంక్యూ వెరీమచ్ పీఎం నరేంద్రమోడీ.. మా నాన్నగారు దాన్ని స్వయంగా మా నానమ్మకి ఇచ్చారు’ అని ఆమె ట్వీట్ చేశారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవాజ్ షరీఫ్ హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరువురి మధ్య భావోద్వేగపూరిత సంభాషణ జరిగినట్లు ఆ తరువాత మోడీ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం హీరాబెన్ మోడీకి స్వీట్లు తినిపిస్తున్న చిత్రాలు తనను, తన తల్లిని ఎంతో కదిలించాయని షరీఫ్ చెప్పినట్లు మోడీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రతీవారం తన తల్లి దగ్గరకు వెళ్తానని షరీఫ్ చెప్పారన్నారు.