న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. శనివారం ప్రధాని మోదీ తల్లి హీరా బెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కాళ్లు కడిగా ఆశీర్వాదం తీసుకోవడమే గాక చిన్నతనంలో తన అమ్మతో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. బాల్యంలో ఉండగా మోదీ తల్లి ఇతురపట్ల ఎలా ప్రేమతో ఉండేవారు వివరించారు.
ఈ మేరకు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను గురించి వెల్లడించారు మోదీ. నాటి మధుర స్మృతిని వివరిస్తూ..."తన తండ్రి స్నేహితుడు తమ ఇంటికి సమీపంలో ఉండే గ్రామంలోనే ఉండేవాడని చెప్పారు. ఐతే ఆయన అకాల మరణం చెందడంతో తన తండ్రి తన స్నేహితుడి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చేవారిని తెలిపారు. అతని పేరు అబ్బాస్ అని, తమతోనే ఉండి చదువు పూర్తి చేసుకున్నాడని అన్నారు.
ఇతరుల సంతోషాలలో ఆనందాన్ని పొందడం ఎలాగో నేర్పిన గొప్పవ్యక్తి అంటూ...మోదీ తన తల్లిని ప్రశంసించారు. ప్రతి ఏడాది ఈద్‌కి తన కిష్టమైన వంటకాలు వండేదని, పైగా పండగలప్పుడూ తమ ఇంటికి వచ్చిన ఇరుగుపొరుగు పిల్లలకి తన తల్లి వండిన వంటకాలను ఆస్వాదించడం షరా మాములే ." అంటూ... నాటి మధుర క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో మోదీ తన స్వస్థలమైన వాద్‌నగర్‌ను సందర్శించారు. తూర్పు గుజరాత్‌లోని అదే పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేసేవారు. శిథిలావస్థకు చేరిన టీ కియోస్క్ తోపాటు ఆ రైల్వే స్టేషన్ కూడా ప్రస్తుతం పునరుద్ధరించబడింది.
(చదవండి: నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోదీ భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment