remembers
-
డిసెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న అల్లు అర్జున్ భార్య (ఫోటోలు)
-
నాటి మధుర క్షణాలు...ఆమెది చాలా విశాల హృదయం: మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. శనివారం ప్రధాని మోదీ తల్లి హీరా బెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కాళ్లు కడిగా ఆశీర్వాదం తీసుకోవడమే గాక చిన్నతనంలో తన అమ్మతో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. బాల్యంలో ఉండగా మోదీ తల్లి ఇతురపట్ల ఎలా ప్రేమతో ఉండేవారు వివరించారు. ఈ మేరకు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను గురించి వెల్లడించారు మోదీ. నాటి మధుర స్మృతిని వివరిస్తూ..."తన తండ్రి స్నేహితుడు తమ ఇంటికి సమీపంలో ఉండే గ్రామంలోనే ఉండేవాడని చెప్పారు. ఐతే ఆయన అకాల మరణం చెందడంతో తన తండ్రి తన స్నేహితుడి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చేవారిని తెలిపారు. అతని పేరు అబ్బాస్ అని, తమతోనే ఉండి చదువు పూర్తి చేసుకున్నాడని అన్నారు. ఇతరుల సంతోషాలలో ఆనందాన్ని పొందడం ఎలాగో నేర్పిన గొప్పవ్యక్తి అంటూ...మోదీ తన తల్లిని ప్రశంసించారు. ప్రతి ఏడాది ఈద్‌కి తన కిష్టమైన వంటకాలు వండేదని, పైగా పండగలప్పుడూ తమ ఇంటికి వచ్చిన ఇరుగుపొరుగు పిల్లలకి తన తల్లి వండిన వంటకాలను ఆస్వాదించడం షరా మాములే ." అంటూ... నాటి మధుర క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మోదీ తన స్వస్థలమైన వాద్‌నగర్‌ను సందర్శించారు. తూర్పు గుజరాత్‌లోని అదే పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేసేవారు. శిథిలావస్థకు చేరిన టీ కియోస్క్ తోపాటు ఆ రైల్వే స్టేషన్ కూడా ప్రస్తుతం పునరుద్ధరించబడింది. (చదవండి: నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోదీ భావోద్వేగం) -
తెలంగాణ వైతాళికులు: నూకల నరోత్తమ్‌రెడ్డి
తెలంగాణ సమాజ చైతన్యానికి, వికాసానికి కృషి చేసిన మహానుభావుల్లో నూకల నరోత్తమ్‌రెడ్డి ముఖ్యులు. అరుదైన బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. నిరాడంబరంగా ఉండే నిశ్చల, నిశ్శబ్ద కార్యదక్షుడాయన. జనహితంలో చిన్న పనిచేసినా పెద్దగా ప్రచారం పొందడానికి ఎన్నో పాట్లు పడే మన వ్యవస్థలో.. ఏమాత్రం ప్రచారయావ లేకుండా , ప్రతిఫలాపేక్ష చూపకనే వివిధ రంగాలు, వర్గాల ప్రజలకు అపార సేవలు అందించిన మహనీయుడు. జర్నలిజం, సాహిత్యం, సాంస్కృతికం, క్రీడలు, విద్య, పరిపాలన, రాజకీయం... ఇలా ఎన్ని రంగాలో? కాలూనిన ప్రతిచోటా తనదైన ముద్రవేసిన ఆయన సామర్థ్యం గురించి వింటే ఎవరికైనా విస్మయమే! ఓ మనిషి, ఒక జీవిత కాలంలో ఇన్ని పనులు, ఇంత సమర్థంగా చేయడం అరుదు. అదీ మచ్చలేని రీతిలో పలువురు ప్రశంసించేలా నిర్వహించడం అసాధారణం. కానీ, నరోత్తమ్‌రెడ్డి తెలుగువారు మరచిపోని విధంగా ఆ కృషి చేసి చూపించారు. మహబూబాబాద్‌కు చెందిన ఆయన తెలంగాణ వైతాళికుల్లో ఒకరు. జర్నలిజం చదివి, దేశ స్వాతంత్య్రపు రోజుల్లో ముంబాయిలో నాటి ‘బొంబాయి క్రానికల్’కు పనిచేస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకత్వం నుంచి తప్పుకున్నపుడు, కొత్వాల్ రాజ బహుదూర్ వెంకట్రామారెడ్డి సూచన మేరకు నరోత్తమ్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి సదరు బాధ్యత చేపట్టారు. అలా.. గోల్కొండ సంపాదకులుగా (20 ఏళ్లు), రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా (10), ఆంధ్ర సారస్వత పరిషత్తు (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) కోశాధికారిగా, చైర్మన్‌గా (30), లలిత కళా అకాడమీ చైర్మన్‌గా (25), రాజా కృష్ణదేవరావ్ పేరిట ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ సంస్థ విద్యాకమిటీ నేతృత్వంలో (15), బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ చైర్మన్‌గా (10), ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యుడిగా, ఉప కులపతిగా కలిపి (20 ఏళ్లు) ఇలా, కొన్నిమార్లు ఏక కాలంలో వేర్వేరు బాధ్యతలూ నిర్వహించి నాయ కత్వానికి తానొక ప్రతీకగా నిలిచారు. ఇంకోరకంగా చెప్పాలంటే... బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ కలగలిపిన 63 ఏళ్ల పరిపూర్ణ జీవితంలో అంతకు రెట్టింపు కంటే ఎక్కువ సంవత్సరాలు, సుమారు 130 ఏళ్ల (వేటికవిగా లెక్కిస్తే!) క్రియాశీల జీవితం గడిపిన ధన్యజీవి! పార్లమెంటు సెషన్ నడుస్తున్నా.. విధిగా హైదరాబాద్ వచ్చి సమావేశాలకు హాజరయ్యే ఉస్మానియా విశ్వవిద్యాలయం, సారస్వత పరిషత్తులు ఆయన జీవితంలో అవిభాజ్య అంగాల య్యాయి. ఆయన చొరవవల్లే ఉస్మానియాలో జర్నలిజం విభాగం ఏర్పడింది. ఉద్యోగాల్లో ఉన్నవారు తీరిగ్గా ఉండే సాయం వేళల్లో చేసుకోవడానికి వీలుగా ఎంబీఏ, లా కోర్సులు తీసుకురావడంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాలతో, స్పర్థలతో ఓయూ ప్రాంగణం మూడేళ్లు కల్లోలితమై 300 మందికి పైగా అసువులు బాశారు. విద్య–విద్యార్థులు చెల్లా చెదురైనపుడు ‘సాంత్వనకు ఓ కులపతి‘ అని సమాజమే కోరి తెచ్చుకున్న ఘనాపాటి! నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగునాట చేసిన ప్రసంగాలకు వేదికలపై అనువాదకుడిగా ఉండేవారాయన. ముఖ్యమంత్రులు సంజీవయ్య, పీవీ నర్సింహారావు, ప్రధానమంత్రులు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి అత్యున్నత వ్యక్తులతో సాన్నిహిత్యం ఉన్నా, పెరట్లో పనిచేసే తోటమాలికి కూడా సముచిత గౌరవం ఇచ్చే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నూకల నరోత్తమ్‌రెడ్డిని, ఆయన శతజయంత్యుత్సవాలు జరుపుకుంటూ స్మరించు కోవడమంటే, మనని మనం గౌరవించుకోవడం. ఆయన బహుముఖ ప్రజ్ఙను భావితరాలకు వారసత్వ సంపదగా పదిలపరిచి, పంపిణీ చేయడం. తెలుగు నాట తరాలతరబడి చైతన్యం రగిలించే స్ఫూర్తిని మరింత పరివ్యాప్తం చేయడం. ఆయన విశేష ప్రతిభ చూపిన సాహిత్యం, జర్నలిజం, లలితకళలు, క్రీడలు, విద్య, పాలన, రాజకీయాలకు సంబంధించి కనీసం ఒక్కోటి చొప్పున ఏడాది పొడుగునా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇదొక గొప్ప సందర్భం. – సవ్యసాచి (మార్చి 27న నూకల నరోత్తమరెడ్డి శతజయంత్యుత్సవాలు ప్రారంభం) -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
హ్యాపి బర్త్ డే అమ్మా..!
అందాల నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ జాన్వి తన తల్లి శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా.. తల్లితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఫోటోలతో పాటు ‘హ్యాపి బర్త్‌డే అమ్మా .. ఐ లవ్ యూ’ అనే కామెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను పలువురు బాలీవుడ్ ప్రముఖులు లైక్ చేశారు. ఏడాదిన్నర క్రితం అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై, అక్కడే హోటల్లోని బాత్ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి మొదటి జయంతిని భర్త బోని కపూర్ ఆమె తల్లి నివాసం అయిన చెన్నైలో నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో బోని కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘శ్రీదేవిని నా జీవితంలో ప్రతిరోజు మిస్ అవుతున్నాను. జీవితంలో హీరోలు, లెజెండ్లు ఉంటారు. కానీ హీరోలు జ్ఞాపకం వస్తూ ఉంటారు. కానీ శ్రీదేవి వంటి లెజెండ్ ఎప్పుడు మా నుంచి దూరం కాదు. తాను ఎప్పుడూ మాతోనే ఉంటుంది. మీము తనను మిస్ కామని’ చెప్పారు. ప్రస్తుతం జాన్వీ రూహి అఫ్జా, కార్గిల్ గర్ల్ సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నారు. View this post on Instagram Happy birthday Mumma, I love you A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Aug 12, 2019 at 7:14pm PDT -
అంత్యక్రియల నిర్వాహకుడు
ఇల్లు మార్చిన అంత్యక్రియల నిర్వాహకుడు ఏడ్రియన్ పాత ఇంట్లో ఇంకా మిగిలిన శవపేటికలు తీసుకెళ్లి తన బండికెక్కించాడు. బండికి కట్టిన బక్కగుర్రాలు బస్బనయా వీధి నుండి ఏడ్రియన్ కొత్త ఇల్లుండే నికిట్స్కయా వీధికి కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరాయి.ఏడ్రియన్ కొట్టుకు తాళం వేసి ‘ఇల్లు అద్దెకైనా ఖరీదుకైనా ఇవ్వబడుతుంది’ అని రాసిన ఒక బోర్డును తలుపుపై మేకులతో బిగించి కొత్తింటికి నడుచుకుంటూ వెళ్లాడు. ఆ ఇల్లు కొనాలని అతనికి చాలా ఉంది. చివరకు ఈనాటికా కోరిక తీరింది. అందుకతను చెల్లించిన మొత్తం చిన్నదేం కాదు. కాని ఏడ్రియన్ తన కొత్త ఇంటి పసుపు పచ్చని గోడలను సమీపించే సరికి తనకు కొంచెం కూడా సంతోషం కలగనందుకు ఆశ్చర్యమయింది. తనకింకా కొత్తగా ఉన్న గడపదాటి ఇంట్లోకి వెళ్లాడు. సామానింకా సర్దలేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. 18 ఏండ్లుగా పూచిక పుల్లతో కూడా, ఎక్కడ ఉండవలసిన సామాను అక్కడ ఉంటూ ఉండిన తన పాత మట్టికొంప జ్ఞాపకం వచ్చి దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘ఏమింత నిదానంగా పనిచేస్తున్నారు’’ అని పనిమనిషిని కూతుళ్ళనిద్దరినీ కసరుకొని సామాను సర్దడంలో వారికి తోడ్పడ్డాడు.ఇల్లు చక్కపెట్టడం త్వరగా పూర్తి అయింది. దేవుని మందసం, పింగాణీ సామానూ, బీరువా, బల్ల, పడకకుర్చీ, మంచాలు, ఇవన్నీ వెనకగదిలో ఏ మూల ఏది ఎలా ఉండాలో అలా సర్దాడు.ఇక ఇంటియజమాని ముఖ్యమైన ఆస్తి–రంగురంగుల శవపేటికలు, అంత్యక్రియల సందర్భంలో ఉపయోగించే నల్లహాట్లు, అంగవస్త్రాలూ, దివిటీలు–ఇవన్నీ వంట ఇంట్లోనూ, ముందర గదిలోను పేర్చి పెట్టారు. దివిటీని తలక్రిందుగా పట్టుకొన్న ఒక మన్మథుని బొమ్మగల బోర్డును ఇంటిముందు గేటుకు తగిలించారు. ఆ బొమ్మకింద ‘శవపేటికలు, మామూలువి, రంగువేసినవి, ముసుగు వస్త్రాలతో సహా ఇక్కడ అద్దెకుగాని, ఖరీదుకుగానీ దొరుకుతాయి. పాత శవపేటికలు రిపేరు కూడాచేయబడతాయి’ అని రాసి ఉంది.పనంతా ముగిసిన తరువాత, ఏడ్రియన్ కూతుళ్ళిద్దరూ తమ గదిలోకి వెళ్లిపోయారు. ఏడ్రియన్ ఇంటినొకసారి తనిఖీ చేసివచ్చి కిటికీ వద్ద కుర్చీలో కూర్చొనిసిమోవార్ వేడి చేయమని పనిమనిషికి చెప్పాడు.కాటికాపరులు చీకూ చింతలేని కబుర్లరాయుళ్ళుగా షేక్స్పియర్, సర్వాల్టర్ స్కాట్ తమ రచనల్లో చిత్రించారు. వారి వృత్తికి, వారి ప్రవృత్తికి మధ్యగల వైపరీత్యంతో రసపోషణ చేసి పాఠకులను ఉర్రూతలూగించాలని వారలా చిత్రించారు. కాని, సత్యాన్ని పోషించదలచుకొన్న మేము, ఈ సందర్భంలో వీరిని అనుకరించలేక పోతున్నాము. మేము పేర్కొంటున్న అపరక్రియల నిర్వాహకుని స్వభావం అతని వృత్తికి అనుగుణంగానే ఉందని మేము అంగీకరించక తప్పదు. ఏడ్రియన్ ఎప్పుడూ ముఖం వేలాడేసుకొని విచారంగా ఉంటాడు. అతను మాట్లాడడమే అరుదు. తన కూతుళ్లు దోవన పొయ్యేవాళ్లను కిటికీ గుండా చూసుకుంటూ ఊరకే నిల్చొని ఉండడానికలవాటు పడితే వాళ్లను మందలించడానికో లేక తన కొట్టులోని వస్తువులు కావలసి వచ్చిన దురదృష్టవంతుల నుండి (సందర్భాన్ని బట్టి వాళ్లు అదృష్టవంతులైనా కావచ్చు) ఇంకా నాలుగు డబ్బులు గుంజడానికో తప్ప ఇతరత్రా అతను నోరు తెరిచేవాడే కాదు.ఏడ్రియన్ టీ తాగుతూ మామూలులాగే ఏదో చింత చేస్తూ కూర్చున్నాడు. ఆరవకప్పు అయిపోయింది. ఏడోది తాగుతున్నాడు. రిటైరైన బ్రిగేడియర్ శవాన్ని గడిచినవారం తీసుకొనిపోతుంటే, ఊరేగింపు సరిగ్గా టోల్గేట్ దగ్గరకు వచ్చినప్పుడు కుండపోతగా వర్షం ప్రారంభమయిన సంగతెందుకో అతనికి జ్ఞాపకానికి వచ్చింది.శవపేటిక వెంట వస్తున్న వాళ్లందరి అంగవస్త్రాలు తడిసి ముద్దయ్యాయి. చాలామంది హాట్ల అంచులు వంకరలు పోయినాయి. బ్రిగేడియర్ అంత్యక్రియలకు తాను సప్లై చేసిన హాట్లు, అంగవస్త్రాలు పాతసరుకయినందువల్ల వర్షంలో బాగా దెబ్బతిన్నాయి. వాటి రిపేరుకు చేతి నుంచి కొంతడబ్బు వదులుతుందని ఏడ్రియన్ అనుకున్నాడు. ఒక్క సంవత్సరం నుంచి కాటికి కాలు చాచుకొని ఉన్న ముసల్ది ట్రుఖినా చస్తే ఈ నష్టం పూడ్చుకోవచ్చు. అయితే ట్రుఖినా రజ్గుల్యా వద్ద మంచంలో పడిఉంది. ఆ ముసలిదాని వారసులు అంతదూరం నుంచి తన కోసం చెప్పి పంపారేమో అనే భయం ఏడ్రియన్‌కు పట్టుకొంది. బహుశా వాళ్లు దగ్గరున్న మరే కాంట్రాక్టరుతోనో ఒప్పందం చేసుకోవచ్చు. ఎవరో వీధి తలుపు మూడుసార్లు తట్టడంతో ఏడ్రియన్ ఆలోచనలు మధ్యలో ఆగిపోయాయి. ‘ఎవరది?’ అని అరిచాడు. తలుపు తెరచుకొని ఒక కొత్త మనిషి లోపల ప్రవేశించాడు. అతనొక జర్మన్ వృత్తికారుడని చూస్తూనే చెప్పవచ్చు. వచ్చీరాని రష్యన్ భాషలో ఇలా అన్నాడతను:‘‘క్షమించండి. మీ పనికి అంతరాయం కలిగిస్తున్నానేమో. మీ పరిచయం చేసుకోవాలని వచ్చాను. నేను జోళ్లు కుట్టేవాణ్ణి. నా పేరు గొట్టియబ్ స్కూల్‌ట్‌జ్. మీ కిటికీ నుంచి కనబడే ఆ ఎదురింట్లోనే నా కాపురం. నా పెళ్లై రేపటికి ఇరవైఅయిదు సంవత్సరాలు. మా వివాహరజతోత్సవం జరుపుకుంటున్నాం. మీరూ, మీ కుమార్తెలు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి’’సరే తప్పక వస్తానని ఏడ్రియన్ అతణ్ణి కూర్చోబెట్టి కప్పు టీ పుచ్చుకొమ్మని బలవంతం చేశాడు. గొట్టియబ్ స్కూల్‌ట్‌జ్ కలుపుగోలుతనం వల్ల, ఇద్దరూ చిరకాల మిత్రుల్లా మాట్లాడుకోసాగారు.‘‘మీ వ్యాపారం ఎలా ఉంది?’’ అని ఏడ్రియన్ ప్రశ్నించాడు.‘‘ఎలా ఉందని చెప్పను! ఈరోజు గిరాకీ అయితే రేపు మందం. ఒకేరకంగా ఉండి చావదు. మొత్తంపైన ఫరవాలేదు లెండి. కాని మావి మీ సరుకుల్లాంటివి కాదుగా, బతికి ఉన్న వాళ్లు జోళ్లు లేకపోయినా జరుపుకొంటారు. చచ్చినవాళ్లు శవపేటికలు లేకుండా క్షణముండలేరు కదూ!’’ఇలా నడిచింది సంభాషణ. కొంతసేపటికి స్కూల్‌ట్‌జ్ లేచి సెలవు తీసుకొంటూ తాను వచ్చిన పని మరొకసారి ఏడ్రియన్‌కు జ్ఞాపకం చేసి వెళ్లిపోయాడు.మరుసటిరోజు మధ్యాహ్నానికి ఏడ్రియన్, అతని కూతుళ్లిద్దరూ, తాము కొత్తగా కొన్న ఇంటి గేటు దాటిస్కూల్ట్జ్ ఇంటికి బయలుదేరారు. ఏడ్రియన్ ప్రొకోరస్ ధరించిన రష్యాదేశపు దుస్తుల్ని కులినా, కార్యాలిద్దరూ యూరోపియన్ పద్ధతిలో ముస్తాబైన వైనం నేనిక్కడ వర్ణించడం లేదు, ఆధునిక నవలాకారుల్లా.అయితే ఆ యువతులిద్దరూ ఇలాంటి ప్రత్యేక సమయాల్లో ధరించే పసుపువన్నె హేట్లని, ఎర్రని స్లిప్పర్లను పేర్కొనడం అసందర్భం కాదంటాను.గొట్టియబ్ స్కూల్‌ట్‌జ్ ఇంట్లోని చిన్నగదిఅతిథులతో నిండిపోయింది. వారిలో ఎక్కువమంది జర్మన్ కారువులు, వారి భార్యలూ, వారి వద్ద వృత్తి నేర్చుకునే యువకులూ, విందుకు వచ్చినవారిలో ఒక్క రష్యన్ ఉద్యోగి కూడా ఉన్నాడు. అతను పోలిస్ కానిస్టేబుల్ అయినప్పటికీ ఇంటియజమాని అతడిని ప్రత్యేకంగా ఆదరించాడు. యుర్కోపెగోరెన్స్కీ చిత్రించిన పోస్టుమాస్టరులాగా ఇరవై అయిదు ఏళ్లుగా భయభక్తులతో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పురాతన రాజధాని నగరం 1812లో అగ్నికి ఆహుతి అయినప్పుడు అతని పసుపుపచ్చని కాపలాబడ్డీ బూడిద అయిపోయింది. కాని శత్రుసైన్యాలను దేశం నుంచి తరిమివేసిన తరువాత, దాని స్థానే, తెల్లని డోలిక్ స్థంభాలతో బూడిదరంగు వేసిన కొత్త బడ్డీ తలెత్తింది. యుర్కో దాని ముందు మళ్లీ మునపటిలా సాయుధుడై పారా ప్రారంభించాడు. నికిట్స్ గేట్‌కు చుట్టుపట్ల కాపురముండే చాలామంది జర్మనులు అతనికి తెలుసు. వాళ్లలో కొందరు తప్పతాగి ఆదివారాల్లో రాత్రిపూట ఆ బడ్డీలోనే గడపవలసి వచ్చేది కూడా. అతనితో తనకు ఏనాడైనా పనిపడక తప్పదని గ్రహించిన ఏడ్రియన్, అక్కడికి వచ్చిన వెన్వెంటనే అతన్ని పరిచయం చేసుకున్నాడు.టేబుల్ ముందు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు, ఏడ్రియన్, యుర్కోలు ఎదురుబొదురుగా కూర్చున్నారు. స్కూల్‌ట్‌జ్ దంపతులు, వాళ్ల పదిహేనేళ్ల కూతురు లాట్చెన్, అతిథులతో కలసి భోజనం చేస్తూ మధ్యమధ్య అతిథులకు వడ్డిస్తున్నారు. బీర్ మంచినీళ్లలా ప్రవహిస్తోంది. యుర్కో నలుగురు తినేంత తిన్నాడు. ఏడ్రియన్ కూడా అతనికేమీ తీసిపోలేదు. అతిథులంతా జర్మన్ భాషలో మాట్లాడుకొంటున్నారు.రాను రాను మాటల సందడి హెచ్చింది.హఠాత్తుగా స్కూల్‌ట్‌జ్ ‘‘ఒక్కమాట! ఇలా వినండి!’’ అని బిగ్గరగా అంటూ తారు పూసిన ఒక సీసా బిరడా తీసి ‘‘యోగ్యురాలు, నా లూయిసా ఆయురారోగ్యానికి!’’ అని అన్నాడు.షాంపెన్ బుసబుసమని నురగలు కక్కుతోంది.స్కూల్‌ట్‌జ్ లేచి ఉన్న తన అర్థాంగి ముఖం ముద్దు పెట్టుకున్నాడు. అతిథులు యోగ్యురాలయిన లూయిసా ఆయురారోగ్యానికై గ్లాసులెత్తి ఖాళీ చేశారు.‘‘నా అతిథుల ఆరోగ్యానికి’’ అంటూ గృహస్తు ఇంకొక సీసా బిరడా తీశాడు. అతిథులు గ్లాసులు నింపి ఖాళీ చేశారు. ఈ ధోరణిలో సీసాలు సీసాలు ఎగిరిపొయ్యాయి. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఆయురారోగ్యానికని, మాస్కో నగరానికని, జర్మనీలోని ఒక డజన్ మారుమూల పట్టణానికని, అన్నివృత్తులకని, తరువాత ఫలానాఫలానా వృత్తికని, వృత్తికారుల ఆరోగ్యానికని, వారి కింద శిక్షణ పొందే వారి ఆరోగ్యానికని తాగారు. ఏడ్రియన్ ఒక్క టోస్టు కూడా విడిచి పెట్టకుండా బహు శ్రద్ధగా తాగాడు. తుదకు ఉత్సాహం పట్టలేక తనూ ఒక విచిత్రమైన టోస్టు ప్రతిపాదించాడు. అనంతరం ఒక స్థూలకాయుడైన రొట్టెల వ్యాపారి లేచి తన గ్లాసునెత్తి ‘‘మనమెవరి కోసమని పనిచేస్తున్నామో వారి కోసం’’ అని అన్నాడు. ఈ టోస్టు అంతమంది సంతోషంగా తాగారు. తరువాత అతిథులు ఒకరికొకరు తలవంచి నమస్కరించుకోవడం ప్రారంభించారు. దర్జీ చర్మకారునికి నమస్కరించాడు. చర్మకారుడు దర్జీకి ప్రతి సమస్కారం చేశాడు. రొట్టెలతను ఇద్దరికీ నమస్కరించాడు. అతిథులంతా కలిసి రొట్టెలతనికి నమస్కరించారు. ఇలాసాగిపోయింది.ఈ నమస్కార కార్యక్రమ సందర్భంలో యుర్కో ఏడ్రియన్ వైపు తిరిగి ఇలా అన్నాడు:‘‘నీవు సాగనంపిన మృతుల ఆయురారోగ్యానికై తాగుదాం!’’ అందరూ విరగబడి నవ్వారు.ఏడ్రియన్ మాత్రం కోపంతో ముఖం చిట్లించాడు. కాని ఇదెవ్వరూ గమనించలేదు.గ్లాసులు నింపడం, ఖాళీ చేయడం నిరాటంకంగా సాగిపోయింది. అతిథులు టేబుల్ నుంచి లేచేటప్పటికి సాయంత్రం ప్రార్థనలకు చర్చి గంటలు మోగుతున్నాయి.అతిథులు వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు. చాలామంది పూర్తి నిషాలో ఉన్నారు. రొట్టెలతన్ని, బుక్బైండరూ పోలీసు కానిన్టేబులును చేరి ఒక వైపు చంకల కింద చేయివేసి మెల్లగా అతని బడ్డీకి నడిపించుకొని పొయ్యారు., తమ బాకీ చెల్లించివేశామనుకొంటూ.ఏడ్రియన్ సగం మత్తులో, సగం కోపంతో ఇంటికి తిరిగి వచ్చాడు.‘‘నా వృత్తి ఇతర వృత్తులంత గౌరవమయింది కాక పోయిందా? నేను ఉరి తీసేవాడితో సమానమా? నన్ను చూసి నవ్వడానికి ఈ విదేశీయులకేమి కనబడింది! నా గృహప్రవేశసందర్భంలో వీళ్లందరినీ పిలిచి విందు చేయాలనుకున్నాను. ఛీ! ఛీ! ఈ వెధవల్నా పిలవడం? నేను ఎవరి కోసం పని చేస్తున్నానో ఆ ప్రేతాలనే ఆహ్వానిస్తున్నాను’’‘‘అయ్యో! ఇదేమిటి బాబూ’’ అని ఏడ్రియన్ బూట్లు విప్పుతూ అంది పనిమనిషి ఆశ్చర్యంతో.‘‘మీరు తెలిసే మాట్లాడుతున్నారా? చెంపలు వేసుకోండి! గృహప్రవేశానికి చచ్చినవాళ్లను పిలవటమా? ఇంతకంటే ఘోరముందా?’’‘‘దేవుని సాక్షిగా చెబుతున్నాను నేను. ఆ పని చేసి తీరుతాను’’ అని ఏడ్రియన్ అన్నాడు. ‘‘రేపే ఆ పని చేస్తాను. నా శ్రేయోభిలాషులారా! రేపు రాత్రి నాతో విందారగించి నన్ను ధన్యుణ్ణి చేయండి! ఈ బీదవానికుండే సర్వస్వంమీదే’’ ఈ మాటలని ఏడ్రియన్ మేను వాల్చడో లేదో కొన్ని నిమిషాల్లో గురకలు పెట్టనారంభించాడు.ఏడ్రియన్‌కు మెలకువ వచ్చేసరికి ఇంకా చీకటి విచ్చలేదు. ఆ వ్యాపారస్తుని భార్య, ట్రియుఖీనా రాత్రి మరణించింది. ఆమె నౌకరొకడు వచ్చి ఈ వార్త ఏడ్రియన్‌కు తెలియజేశాడు. ఏడ్రియన్ వోడ్కాకని పది కొపెక్కులు వాడి చేతిలో పెట్టి, తొందరగా బట్టలు వేసుకొని ఒక గుర్రపుబండి అద్దెకు తీసుకొని రజ్గుల్యాకు వెళ్లాడు. పోలీసువాళ్లను గేటు దగ్గర కాపలా ఉంచారు. పీనుగ కోసం కాచుకొన్న రాబందుల్లా ఇటూ అటూ పచార్లు చేస్తున్నారు వ్యాపారస్తులు. శవాన్ని బల్లపై పడుకోబెట్టారు. ముఖం నల్లబడిపోయింది. అయితే గుర్తుపట్టడానికి వీలులేనంత వికృతవికారం కాలేదు. బంధువులు, ఇరుగుపొరుగువారు, నౌకర్లు చుట్టూ చేరారు. కిటికీలన్ని తెరిచి ఉన్నాయి. గదిలో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మతగురువులు విగతజీవుల ఆత్మశాంతికై చేసే ప్రార్థనలు పఠిస్తున్నారు.ఏడ్రియన్, చనిపోయిన ముసలిదాని మరిది కొడుకు పరధ్యానంతో సరే మంచిదన్నాడు. డబ్బు విషయంలో బేరమాడదలచుకోలేదనీ, ఎందులోనూ లోపం చేయడనే నమ్మకంతో అన్ని ఏర్పాట్లు అతనికే వదలి వేస్తున్నాననీ అన్నాడు.ఏడ్రియన్ తన అలవాటు ప్రకారం ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ పుచ్చుకోనని ప్రమాణం చేసి ముసలిదాని మరణవార్త తెలియజేసి నౌకరు వైపు సాభిప్రాయంగా చూచి, అపరక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి వెళ్లిపోయాడు.ఆ పగలంతా రజ్గుల్యా వనికట్స్కీ గేటు మధ్య గుర్రపుబండిలో ఎన్నిసార్లు తిరిగాడో లెక్కలేదు. సాయంత్రానికి పని పూర్తయింది. బండివాడికి అద్దె ఇచ్చి పంపించివేసి కాలినడకన ఇంటికి బయలుదేరాడు.అది వెన్నెలరాత్రి. ఏడ్రియన్ నికిట్స్కీ గేటు సురక్షితంగా చేరుకున్నారు. చర్చి దాటి వెడుతుండే సమయంలో పారా కాస్తున్న యుర్కో ‘ఎవరది’ అని కేక వేసి, వెంటనే ఏడ్రియన్‌ను గుర్తించి ‘మీరా? గుడ్‌నైట్’ అన్నాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. ఏడ్రియన్ ఇంటి దగ్గరకు వస్తున్నాడు. హఠాత్తుగా వీధిలో నుంచి ఎవరో, తన ఇంటి గేటు తీసుకొని లోపలికి వెళ్లినట్లు అతనికి తోచింది.ఎవరతను? ఈ అగాథవేళలో నాతో ఎవరికి పని ఉంటుంది? రాత్రిల్లు, ఎవరైనా కుర్రకుంకలు నా మతిమాలిన పిల్లల దగ్గరకు వచ్చిపోతున్నారా ఏమిటి కొంపదీసి? తన స్నేహితుడు యుర్కోను సహాయానికి రమ్మని పిలుద్దామా అని కూడా అనుకున్నాడు. ఆ క్షణంలో ఇంకొకరు గేటు తీసుకొని లోపలికి అడుగు పెట్టబోతూ, హడావిడిగా వస్తున్న ఏడ్రియన్‌ను చూచి హాటు పైకెత్తి నమస్కరించాడు. ఏడ్రియన్ తొందరలో అతని ముఖం పరీక్షగా చూడలేదు. అతన్ని తానెక్కడనో చూశానని అనుకొన్నాడు. ‘‘మీరు నా కోసం వచ్చారా? లోపలికి దయచేయండి’’ అని ఎగపోసుకుంటూ అన్నాడు.‘‘మర్యాదపట్టింపులెందుకు? మీరు మొదట వెళ్లండి. అతిథులకు దారి చూపించండి’’ ఏడ్రియన్ తానుండే హడావుడిలో మర్యాదలను గూర్చి ఆలోచించే స్థితిలో లేడు.గేటు గడియా తీసేవుంది. మెట్లెక్కి తలవాకిలి సమీపించాడు. అతిథి వెనుకనే వస్తున్నాడు, ఇంట్లో చాలామంది ఇటూ అటు తిరుగుతున్నట్లు ఏడ్రియన్‌కు అనిపించింది.‘‘ఏమిటిదంతా?’’ అని అనుకుంటూ తలుపు తీసుకొని లోపలకడుగు పెట్టాడు...కాళ్లు గడగడ వణికాయి. గది నిండా ప్రేతలు తిరుగుతున్నాయి. కిటికీ గుండా లోపల పడుతున్న వెన్నెల వెలుగులో ప్రేతల పాలిపోయిన ముఖాలు, దిగజారిన నోళ్లూ, కాంతిహీనమైన అరమోడ్పు కళ్లూ, ఎత్తయిన ముక్కులూ కనబడుతున్నాయి...గతంలో తాను ఎవరెవరిని పాతి పెట్టడానికి తోడ్పడ్డాడో వాళ్లందరిని ఏడ్రియన్ గుర్తించాడు. అతని గుండెలు గుభేలుమన్నాయి. తనతో ఇంట్లోకి వచ్చినతను కుండపోతగా వర్షం కురుస్తుంటే, పాతిపెట్టిన బ్రిగేడియర్ అని ఏడ్రియన్ గుర్తించాడు.ఏడ్రియన్ లోపలికి రాగానే, గదిలో చేరినవారంతా స్త్రీలూ, పురుషులూ–ఏడ్రియన్ చుట్టూ చేరి నమస్కారం చేసి పలుకరించారు. ఒక పేదవాడు మాత్రం నమ్రతతో గదిలో దూరంగా ఒక మూల నిల్చున్నాడు తన చిరిగిన దుస్తులు చూసుకొని సిగ్గుపడుతున్న వానిలా. కొద్దిరోజుల క్రితం ఏడ్రియన్ ఇతని శవాన్ని ఉచితంగా పాతి పెట్టవలసి వచ్చింది. ఇతనొకడు తప్ప ఇతరులంతా మంచి దుస్తులు వేసుకున్నారు. అధికారులు యూనిఫారాలు ధరించారు. కాని వారి గడ్డాలు మాశాయి. వర్తకులు ఖరీదైన దుస్తులు వేసుకున్నారు. అక్కడ చేరిన వాళ్లందరి తరపున బ్రిగేడియర్ ఇలా అన్నారు: ‘‘ప్రొఖరొన్గారూ, మీ ఆహ్వానం అంగీకరించి మేమంతా లేచి వచ్చాము. పూర్తిగా శిథిలమై, వట్టి అస్థిపంజరాలుగా మిగిలిపోయి, నిస్సహాయస్థితిలో ఉన్న వారు మాత్రేమే వెనుక నిల్చిపోయారు. కాని వారిలో ఒక్కతను మాత్రం మిమ్మల్ని చూసి రావాలనే ఆదుర్దా కొద్ది రాకుండా ఉండలేకపొయ్యాడు...’’ఇలా అంటూ ఉండగానే, ఒక చిన్న అస్థిపంజరం గుంపును ఇటూ అటూ తోసుకుంటూ ఏడ్రియన్‌ను సమీపించింది. చర్మ మాంసాలు లేని అతని ముఖం ఆప్యాయతతో పళ్లికిలించింది. పచ్చని, ఎర్రని పేలికలూ, పట్టుచొక్కా, వెదురుబొంగుకు తగిలించినట్లుగా, ఆ ఎముకలగూడుకు అతుక్కొని ఉన్నాయి. దానిముంగలి ఎముకలు, ఎల్తైన గుర్రపు రౌతు బూట్లతో పళపళమని శబ్దం చేస్తున్నాయి రోల్లో రోకలిబండలా.‘‘ప్రొఖోరొవ్! నన్ను గుర్తించలేదూ! గార్డు దళంలో రిటైర్డు సార్జంట్పై తొర్పెచ్కురిల్కిన్ని. జ్ఞాపకం లేదూ? నీ మొట్ట మొదటి శవపేటిక అమ్మింది నాకే.1799లో(అది ఓక్ కర్రతో చేసిందన్నావు కాని డీల్ కర్రతో చేసిందిలే)’’ ఇలా అంటూ ఆ అస్థిపంజరం ఏడ్రియన్‌ను కౌగిలించుకోవడానికి తన చేతిఎముకలెత్తింది. భయవిహ్వలుడైన ఏడ్రియన్, తన బలమంతా కూడదీసుకొని గట్టిగా అరుస్తూ అతన్ని వెనుక్కు తోశాడు. పైటొర్ పెట్రోవిచ్ తూలి, కీళ్లు వదిలి విడిపోయిన ఎముకలపోగైకిందపడ్డాడు.ప్రేతాలు ఆ...ఆ...అన్నాయి కోపోద్రేకంతో.పళ్లు కొరుకుతూ, తిడుతూ, నిన్నేం చేస్తానో చూడమని బెదిరిస్తూ, తమ సహచరుని గౌరవం నిలబెట్టడానికై, ఏడ్రియన్ పైకి లేచాయి.చెవులు తూట్లు పడుతున్న వాటి అరుపులకు, ధాటికీ గుండె చెదిరి ఏడ్రియన్‌కు తెలివి తప్పి సార్జెంట్ ఎముకల పై దభాలుమని పడిపోయాడు.ఏడ్రియన్ మంచం పైన సూర్యకిరణాలు .ఏడ్రియన్కళ్లు తెరచి చూచేటప్పటికి పనిమనిషి. సామొవార్లో నిప్పులు రాజుకోడానికి ఊదుతోంది. రాత్రి జరిగిన సంఘటనలు ఏడ్రియన్‌కు గుర్తుకొచ్చి గుండె జలదరించింది.ట్రియుకినా, బ్రిగేడియర్ సార్జెంట్కురిల్కిన్ అతని హృదయాంతరాళంలో తారాడుతున్నారు. రాత్రి జరిగిన సంఘటన పరిణామం పనిమనిషినే చెప్పనిమ్మని ఏడ్రియన్ మౌనంగా ఉన్నాడు.‘‘ఎంతసేపు నిద్రపోయారు బాబూ!’’ అనిఅక్సిన్యా ఏడ్రియన్‌కు ఉదయం చొక్కా అందిస్తూ అన్నది.‘‘పక్కింటి దర్జీ మిమ్మల్ని చూడటానికి వచ్చారు. కాని మీరు గాఢనిద్రలో ఉన్నందువల్ల మేము మిమ్మల్ని లేపలేదు’’‘‘చనిపోయినట్టి ట్రియుకినాఇంటి నుంచి ఎవరైనా నా కోసం వచ్చారా?’’‘‘ట్రియుకినా? ఎందుకు? ఆమె పోయిందా?’’‘‘ఒట్టి మతిలేని మనిషివి నీవు. ఆమె అపరక్రియలకు అన్నీ సిద్ధం చేయడానికి నిన్న నీవే నాకు ?’’‘‘అయ్యో, బాబూ! మీకేమైనా మతిపోయిందా ఏమిటి? లేక నిన్న పగలంతా కూర్చొని తాగిన మత్తు వదల్లేదా? నిన్న ఎవరి అంత్యక్రియలూ జరగలేదు. నిన్న మీరు ఆ జర్మన్ వాళ్లింట్లో జరిగిన విందుకువెళ్లిపూర్తి నిషాతో వచ్చారు. వచ్చీ రావడంతో మంచం పైన పడి తెలివి లేకుండా నిద్రపోయారు. చర్చిగంటలు మోగడం ఇప్పుడే ఆగిపోయింది’’‘‘అట్లనా?’’ అన్నాడు ఏడ్రియన్ గుండె తేలికై.‘‘మరేమిటి?’’ అంది పనిమనిషి.‘‘అయితే వెళ్లి టీ కాచి, పిల్లల్ని పిలు’’ రష్యన్ మూలం : పుష్కిన్ తెలుగు: బి.రామచంద్రారావు -
ఒక్క మాట జ్ఞాపకం ఉంటే చాలు!
‘‘నాన్నా, ఈ పరీక్షలు బాగా రాయి. మంచి మార్కులొస్తే చెన్నై లో ఒక కాలేజిఉంది. అక్కడ సీటు వస్తుంది. అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని బ్రాంచ్ ఉంటుంది, దానిలో చేరితే నీవు కోరుకున్న వ్యక్తివి అవుతావు’’ అన్నారు. ఒక్కమాట... ఆ ఒక్కమాటను ఆయన జ్ఞాపకం పెట్టుకుని చెల్లెలు అత్తగారు బంగారం ఇస్తే తాకట్టు పెట్టుకుని చదువుకున్నాడు. తాను కోరుకున్న వ్యక్తి అయ్యాడు. మనకు ప్రాతః స్మరణీయుడయ్యాడు. అబ్దుల్ కలామ్ చదువుకునే రోజుల్లో శివసుబ్రమణ్యం అయ్యర్ అని ఒక మేష్టారుండేవారు. తెల్లవారు ఝామునలేచి స్నానం చేసి వెళ్ళిన 10 మందికే లెక్కలు చెప్పేవారు. స్కూల్లో పాఠం చెప్పేవారు. ఒక రోజు పాఠం చెబుతూ చెబుతూ... పక్షి ఎలా ఎగురుతుందో బ్లాక్ బోర్డుమీద బొమ్మలు వేశాడు. పక్షి ఎలా కూర్చుంటుంది, ఎగిరేటప్పుడు రెక్కలు ఎలా విప్పుతుంది, శక్తినంతా కూడ దీసుకుని రెక్కలు అల్లారుస్తూ శరీరాన్ని పైకి ఎలా లేపుతుంది, తోకతో దిశను ఎలా మార్చుకుంటుందో చెప్పి ‘మీకర్థమయిందా?’ అని అడిగారు. కలాం నిలబడి ‘సార్, మీరు చెప్పడంలో ఏమీ దోషంలేదు, కానీ మేమే అందుకోలేక పోయాం, అర్థంకాలేదు’ అన్నారు. ‘’అయితే ఈ సాయంత్రం 5 గంటలకు సముద్రపు ఒడ్డుకురండి (ఆ ఊరు సముద్రం పక్కనే ఉంది), నేనూ వస్తాను’’ అని అయ్యర్ చెప్పారు. ఆ సాయంత్రం పక్షులు బారులు బారులుగా వచ్చి వెడుతుంటే వాటి కదలికలను చూపుతూ వివరించి చెప్పారు. కలాం వాటిని చూస్తూ తాదాత్మ్యం చెందాడు. వేకువఝామునే వెళ్ళి గురువుగారిని కలిసి ‘‘నిన్న మీరు చెప్పిన పాఠం విన్నాను, పక్షులను చూశాను. విమానం గురించి విన్నాను. నాకు కూడా అలా గాలిలో ఎగిరేవి నిర్మించాలని ఉంది’’ అని చెప్పారు.‘అదెలా సాధ్యం?’ అని గురువుగారు అనలేదు. ‘‘నాన్నా, ఈ పరీక్షలు బాగా రాయి. మంచి మార్కులొస్తే చెన్నై లో ఒక కాలేజి ఉంది. అక్కడ సీటు వస్తుంది. అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని బ్రాంచ్ ఉంటుంది, దానిలో చేరితే నీవు కోరుకున్న వ్యక్తివి అవుతావు’’ అన్నారు. ఒక్కమాట... ఆ ఒక్కమాటను ఆయన జ్ఞాపకం పెట్టుకుని చెల్లెలు అత్తగారు బంగారం ఇస్తే తాకట్టుపెట్టుకుని చదువుకున్నాడు. తాను కోరుకున్న వ్యక్తి అయ్యాడు. మనకు ప్రాతః స్మరణీయుడయ్యాడు. భారతదేశానికి ఉపగ్రహాలను నిర్మించడంలో సాటిలేని మేటియై, ఏ మేష్టారు ఎంత ఓర్పుగా మాట్లాడితే ఈ అబ్దుల్‌కలాం ఇంతటివాడయ్యాడో, రాష్ట్రపతి భవన్లో కూర్చోగలిగాడో అలాటి అయ్యర్‌ని దృష్టిలో పెట్టుకుని... ‘‘ఆయనలాగా అంతమంది పిల్లలను తయారు చేయడానికి రాష్ట్రపతి భవన్‌ను విడిచిపెట్టి విశ్వవిద్యాలయాలకు, పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులను కలవడానికి ఇష్టపడి వెళ్ళిపోతున్నాను’’ అని రాసుకున్నారు కలాం, తను రచించిన ‘ఇన్‌డామిటబుల్ స్పిరిట్’ అనే గ్రంథంలో. -
నీడ
అకస్మాత్తుగా వెనక నుంచి నా భుజం మీద ఎవరో చేతులేశారు. క్షణంసేపు నిశ్చేష్టురాలయ్యాను. ఆ చేతులు నిఖిల్‌వి – నా కొడుకువి. ఎందుకో ఆ చేతుల స్పర్శతో నాకు మా ఆయన – నిఖిల్ తండ్రి – సుధీర్ జ్ఞాపకం వచ్చారు. ‘‘అమ్మా, ఈవేళ వెళ్దాం కదూ?’’ నిఖిల్ మొహం నా మొహం దగ్గరికి తెచ్చి అడిగాడు. ‘‘ఎక్కడికిరా? ఎక్కడికెళ్దాం?’’ నేను విసుగ్గా, పట్టించుకోనట్లు అడిగాను. ‘‘అలా ఎందుకంటావమ్మా? ప్రతి ఏడాదీ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మనం కథల పుస్తకాలు కొనడానికి బజారుకి వెళ్తాం కదా? నిన్ననే నా రిజల్ట్స్ వచ్చాయి కదా?’ ‘‘నిజమేరా నిఖిల్. కానీ నాకు ఇంట్లో పనులింకా పూర్తవలేదు కదా!’’ నేనన్నాను. వీడికి నేనెలా నచ్చచెప్పడం? ఈవేళ సోమవారం అనీ, అమెరికా నుంచి రావాల్సిన సుధీర్ ఉత్తరం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది –ఈవేళ రావచ్చనీ! బయటకి వెళ్లాలంటే త్వరగా వెళ్లి పోస్టుమేన్ వచ్చేలోగా హడావుడిగా తిరిగి రావలసివుంటుంది. లేకపోతే ఆ ఉత్తం నేనే స్వయంగా అందుకోలేదని చిరుకోపంతో కినుక వహించదూ? ‘‘ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా?’’ వాడు ఏడుపుమొహం పెట్టాడు. ‘‘వెళ్లమ్మా కోడలా, వాడి మనస్సును కష్టపెట్టవద్దు’’ మూలన కూర్చున్న అత్తగారు దూదివత్తులు చేస్తూ అన్నారు. ‘‘సరే రా, వెళ్దాం పద.’’ నేను నిఖిల్‌తో అన్నాను. ప్రతీ సంవత్సరం రిజల్ట్స్ వచ్చింతరువాత మరుసటిరోజు కథల పుస్తకాల కోసం వెళ్లడం మాకు ఆనవాయితీ. మరి ఈ సంవత్సరమే ఎందుకు మర్చిపోయానో? నాకే ఆశ్చర్యం వేసింది. గతకాలంలోని చిన్న చిన్న విషయాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. రాజా–రాణీల కథల్లో నిమగ్నమైవుండే నిఖిల్ నా కళ్లముందు వచ్చాడు. కాస్త బజారుకి షాపింగ్‌కు వెళ్తేచాలు, ఎప్పుడూ పుస్తకాలు కొనమని బెట్టు చేస్తాడు. పుస్తకాలు – పుస్తకాలు – పుస్తకాలు. తండ్రీ, కొడుకులిద్దరూ ఒకటే, ఒకే మాలలో మణులు. సుధీర్ పుస్తకాలు కొనడానికి వెళ్లినప్పుడల్లా నిఖిల్ ఏడుస్తాడు – తనకూ కావాలని. ‘‘మీ నాన్న ముందు పుస్తక ప్రపంచం నుంచి బయటపడనియ్యి. తరువాత నీ సంగతి చూద్దాం.’’ఇలా నేను అప్పుడప్పుడు దెప్పిపొడిచేదానిని. ‘‘దివ్యా! తండ్రి మీద కోపం కొడుకుమీద ఎందుకు చూపిస్తావమ్మా?’’ సుధీర్ వ్యంగ్యంగా అన్నాడు. ఆ తరువాత సుధీర్ ఒక ఉపాయంతో నిఖిల్‌కి నచ్చజెప్పాడు. ‘‘ఇదిగో చూడు నిఖిల్ ప్రతీ సంవత్సరం రిజల్ట్స్ వచ్చిన మర్నాడే మనం పుస్తకాల షాపుకి వెళ్లి, నీకు కావలసినన్ని పుస్తకాలు కొందాం. ఇలా మధ్య మధ్య తీసుకోవడం వద్దు. ఈ పద్ధతి అనుసరిస్తే నీ తల్లి రుసరుసలు, కోపతాపాలూ నీమీదా, నామీదా పడవు. ఇద్దరం బతికిపోతాం.’’ నిఖిల్ తండ్రి మాటలు విని ‘‘సరే అలాగే చేద్దాం’’ అంటూ తలాడిస్తూ, కోతిలా గెంతులేస్తూ బయటికి వెళ్లిపోయాడు. నేను మాత్రం ఈ తండ్రీ కొడుకుల నాటకం కుతూహలంగా చూస్తూ వూరుకున్నాను. సుధీర్ ఎప్పుడు నా వెనకనించి వచ్చి నా మెడలో చెయ్యి వేశాడో నాకు తెలియలేదు. ‘‘దివ్యా, మనం ఈ పుస్తకాల వల్లనే దగ్గరికి వచ్చాం కదూ?’’ అతను తన చెంపని, నా చెంపకి చేర్చాడు. నా మనస్సు గతంలోకి పోయింది. బరోడా యూనివర్సిటీ రోజులు గుర్తుకొచ్చాయి. నేనూ, సుధీర్ ఫైనల్ ఇయర్ బిఎ చదువుతున్నాం. నాకూ, సుధీర్‌కీ పుస్తక పఠనం అంటే ప్రాణసమానం. అందువల్ల మా టైము చాలావరకూ లైబ్రరీలోనే గడిపేసేవాళ్లం. అక్కడే మా పరిచయం మొదలైంది. ఇద్దరి అభిరుచులూ, మనస్సులూ కలిశాయి. ఎలా ఎలా నేను సుధీర్‌కి దగ్గరవుతున్నానో, అలా అలా అతని ఆర్థిక పరిస్థితీ, అసామాన్య బుద్ధికుశలత, అంతులేని మహత్వాకాంక్ష అర్థమవసాగాయి. ఆ ప్రకారమే అతనికి నచ్చే విధంగా నేను ప్రవర్తించసాగాను. బిఎ పరీక్షలో సుధీర్‌కి వచ్చినన్ని మార్కులు, గత పది సంవత్సరాలలో ఎవ్వరికీ రాలేదట! కొత్త రికార్డు స్థాపించి గోల్డ్‌మెడల్ సంపాదించాడు. అతను ఎంఎ చదవడం మొదలెట్టాడు. నేను మాత్రం బిఎ తరువాత బి.ఎడ్. కోర్సు పూర్తి చేసి టీచరు ఉద్యోగం సంపాదించాను. అతను ఎంఎ కూడా మంచి మార్కులతో పూర్తి చేశాడు. ఆ తరువాత మా వివాహం అయింది. కానీ అతని చదివే అలవాటు ఏమాత్రం సడలలేదు. నిజానికి పెరిగింది. ఒక ప్రసిద్ధ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. ఒక అద్భుతమైన అధ్యాపకుడిగా పేరు గడించాడు. నాకు అతణ్ని చూస్తే గర్వంగా ఉండేది. నా టీచరు ఉద్యోగం, సంసార బాధ్యతలు రెండూ నడుస్తున్నాయి. ఆఖరుకు ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న సుధీర్ కలలు పండే రోజు ఆసన్నమైంది. అతనికి అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో పెద్ద చదువులకి ప్రవేశం దొరికి, అతను స్టడీ లీవ్ తీసుకుని, అమెరికా వెళ్లాడు. బహుశా ఈవేళ రానున్న సుధీర్ ఉత్తరంలో అతని థీసిస్ ఎప్పటికి పూర్తయ్యేదీ, అతనెప్పుడు అమెరికా నుంచి మన దేశం తిరిగి వచ్చేదీ, తెలుస్తుంది. వేడి వేడి చపాతీలు నా చేతికి తగిలి, ఊహాలోకం వదిలి మేల్కొన్నాను. ఈ మధ్య నాకేదో చెప్పలేని బాధ పట్టుకుంది. ఈ బాధ ఎటువంటిదీ? శారీరకమైనదా? మానసికమైనదా? బహుశా రెండు విధాలా అనుకొంటాను. సుధీర్ ఉన్నత లక్ష్యాల పరుగులో అతనికి ఎలాగున్నా నాకు మాత్రం బాగా అలసట వచ్చి, విసిగిపోయాను. అతను ఆశయాలు సాధించడానికి నేను అటు ఉద్యోగం, ఇటు సంసారబాధ్యతలూ ఒక్కదాన్నే భరించి నడుపుకొస్తున్నాను. అలాగే నిఖిల్ ఆరోగ్యం, చదువు, ఆటపాటలూ పర్యవేక్షించాలి – కళ్లలో వొత్తులేసుకొని మరీ. చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. గత కొద్ది రోజులుగా నాకీ వొంటరితనం విసుగెత్తింది. ముఖ్యంగా మగదిక్కు లోపించడం కుటుంబంలో పెద్ద భారంగా తోస్తోంది. అన్ని నిర్ణయాలూ, పనులూ సుధీర్ చేయాలనీ, నేను అతని నీడలా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా వుండిపోవాలని ఆకాంక్ష మొదలైంది. ఈవేళ అతని దగ్గర్నుంచి వచ్చే ఉత్తరంలో తెలుస్తుంది – అతనెప్పుడొచ్చేదీ, ఎప్పుడు నాకీ బాధ్యతా, బరువూ తొలిగేదీ! ఈమధ్య నాకేమయిందో నాకే తెలియదు. ఇంట్లోని ఎన్నో పనులు సుధీర్ వచ్చి చూసుకుంటాడులే అని చేయకుండా అలాగే వుంచేస్తున్నాను – మరీ తప్పనిసరి అయినవి తప్పిస్తే! ఇంటికి రంగు వెయ్యడం, వి.సి.ఆర్. కొనడం, వంటయింట్లో చెయ్యాల్సిన బాగులు, మార్పులు, ఇలా వొకటా, రెండా – కొన్ని వందల పనులు. ఇంట్లో వుండేది నేనూ, మా అత్తగారూ, నిఖిల్ పిల్లవాడు. ఈ ఆడపెత్తనంతో ఎన్నాళ్లు సంసారం నడుస్తుంది? సుధీర్ వీటన్నిటికీ అతీతంగా, దూరంగా వున్నాడు. అదృష్టం! ‘పోస్ట్’ అనే శబ్దంతో నేను తెలివిలోకి వచ్చాను. మామూలుగా వచ్చే నీలంరంగు ఉత్తరం చూసి నేను కరిగిపోయాను. కొత్త పెళ్లికూతురిలా సిగ్గుబడుతూ ఆ ఉత్తరాన్ని చింపాను. త్వరత్వరగా చదవాలనే ఆత్రుత కళ్లనిండా నిండింది. ఉత్తరం మీద ఉత్సుకతతో పరుగులెత్తుతున్న నా కళ్లు హఠాత్తుగా ఆగాయి. సుధీర్ ఇలా రాశాడు. ‘‘పి.హెచ్డీ కోసం నాకు ఏర్పాటైన గైడ్ అకస్మాత్తుగా లండన్‌కు ఏదో కాన్ఫరెన్స్‌కి వెళ్లవలసివచ్చింది. అందువల్ల నా థీసిస్ పని కాస్త పొడిగించాల్సివచ్చింది. అంటే మరో నాలుగు నెలలు ఆలస్యం అవుతుంది. నాకు తెలుసు రాణీ! నేను నీ వోపిక పరీక్షిస్తున్నాను. ఇన్నాళ్లూ నువ్వు భరించావు. మరో నాలుగు నెలలు నవ్వుతూ ఏమాత్రం బాధ కనిపించకుండా, నీ అమూల్య అంగీకారం తెలియజెయ్యి.’’నా కళ్లలో బొటబొటా నీళ్లు. సుధీర్ రాసిన నాలుగు నెలల ఆలస్యం నా పాలిట నాలుగు యుగాలు! ‘‘వెళ్దాం పద అమ్మా’’ నిఖిల్ మాటలు నన్ను మేల్కొలిపాయి. ‘‘అవును, వెళ్దాం. నన్ను తయారవనియ్యి.’’‘‘సరే నువ్వు సిద్ధంగా ఉండు. నేను బయటకెళ్లి రిక్షా తీసుకువస్తా’’ నిఖిల్ అలా అని బయటకు పరుగెత్తాడు.నేను యాంత్రికంగా అన్ని పనులూ చేస్తున్నాను. సుధీర్ ఆగమనం మరో నాలుగు నెలలు వాయిదా పడింది. అంటే ఈ ఇంటి భారాలన్నీ నేనొక్కర్తినే మరో నాలుగు నెలలు నిర్వహించాలి.నాకు వూరికే పెద్ద దెబ్బ తగిలినట్లనిపించింది. అత్తగారికి చెప్పి బయటపడ్డాను. ముందు చూస్తే నిఖిల్ రిక్షా తీసుకువస్తున్నాడు. వాడు రిక్షా కొద్దిదూరంలో ఆపి గబగబా నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. నాకు ఎందుకో ఇరవై ఏడేళ్ల క్రిందట సుధీర్‌తో జరిగిన ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. మేమిద్దరం రిక్షాలో కూర్చున్నాం.నేను అనుకోకుండా వాడిని చూశా. ఆశ్చర్యమేసింది. వీడి మొహం మీద లేతదనం, పసితనం పోయింది. పెదవులపైన నలుపు వచ్చింది. నాకు కొత్తగా గుర్తుకొచ్చినట్లనిపించింది. వచ్చే సంవత్సరమే వీడు పదకొండవ క్లాసు పరీక్షకి కూర్చుంటాడు. నాలోని తల్లి హృదయం సంతోషంతో నిట్టూర్చింది. వాడు బట్టల విషయం అంతగా పట్టించుకోవడం లేదు. వాడు పొడుగు ప్యాంటూ, పొడుగు చేతుల షర్టూ వేసుకున్నాడు. చాలా పొడుగ్గా కూడా అయ్యాడు.యథాలాపంగా ప్రతీ సంవత్సరం ఈ పుస్తకాలు కొనే ప్రక్రియ గుర్తుకొచ్చింది. పోయిన ఏడాది నేనే వెళ్లి రిక్షా తెచ్చాను. వాడి చేతులు పట్టుకుని ముందు వాడిని రిక్షాలో కూర్చోబెట్టి, ఆ తరువాత వాడి చేతుల ఆధారంగా నేను రిక్షాలో కూర్చున్నాను. ఈ ఆలోచనల్లో మునిగివుండగా, రిక్షా పుస్తకాల షాపు ముందు ఆగింది. మేమిద్దరం రిక్షా దిగి, డబ్బులిచ్చి, షాపులోకి వెళ్లాం. ఏం పుస్తకాలు తీసుకోవాలా అని నేను పరికిస్తున్నాను. ఇంతలోనే నిఖిల్ షాపు యజమానికి నాలుగైదు చక్కటి పుస్తకాల పేర్లు చెప్పాడు – అవి కావాలని. నిఖిల్ ఫటాఫట్ పుస్తకాలు ఏరుతున్నాడు. ఇప్పుడు వాడికి ఇదివరకటిలాగ భూత, ప్రేత, పిశాచ కథలూ, రాజా–రాణీ కథలూ అక్కరలేదు. వాటిని ముట్టనయినా ముట్టలేదు. రెండు మూడు వైజ్ఞానిక కథలుండే పుస్తకాలు తీసి పక్కన పెట్టాడు. అవి రాసింది వాడి అభిమాన రచయిత అట!ఆ తరువాత వాడు మహిళల కోసం రాసిన పుస్తకాలున్న ర్యాక్ దగ్గరికి వెళ్లాడు. నేను వాణ్ని పరీక్షగా చూస్తూ వెంబడించాను. ఎన్నో పుస్తకాలు వెతికి, చివరికి ఒక పుస్తకం తీశాడు. అది తీసి నా చేతిలో వుంచి,‘‘అమ్మా! ఇది నీకోసం నా కానుక’’ అన్నాడు.నేను పుస్తకం పేరు చదివి, పేజీలు తిరగేశాను. నలభై సంవత్సరాలు దాటిన మహిళల మానసిక సమస్యలూ – వాటి సమాధానాలూ శాస్త్రీయ దృక్పథంతో సులభశైలిలో సామాన్య స్త్రీలకోసం రాసిన పుస్తకం అట. నేను ప్రశంసాపూర్వకంగా ఆ పుస్తకం రెండు చేతుల్తోటీ తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. ఇంతలో వాడు మరో పుస్తకం తీసి నా చేతుల్లో వుంచి ‘‘ఇది నాన్నగారికోసం’’ అన్నాడు. తీసిన పుస్తకాల ధరలు వాడు పరీక్షగా చూస్తున్నాడు. ఆ తరువాత పుస్తకాలన్నీ కౌంటర్దగ్గర దొంతరగా పెట్టాడు. షాపువాడు బిల్లు తయారుచేయసాగాడు. బిల్లు డబ్బులు నిఖిలే ఇచ్చాడు. నేను వూరికే నిల్చున్నాను. మేమిద్దరం దుకాణం నుంచి బయటకొచ్చాం. ఎప్పుడూ వెళ్లే హోటల్‌కి వెళ్లాం. వాడికిష్టమైన ఐస్‌క్రీమ్ అడగాలని నేను అనుకున్నాను. నేను నోరు విప్పేలోగానే, నిఖిల్ ఆర్డర్ ఇచ్చాడు. ‘‘అమ్మా! నిన్ననే మిగిలిన స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి. అందుకనే ఈసారి పుస్తకాల డబ్బు నేనే ఇచ్చాను.’’ నాకు కళ్లనీళ్లు ఉప్పెనలా వచ్చాయి. చెప్పలేనంత ఆశ్చర్యంతో నిఖిల్కేసి చూశాను – ‘‘ఎంత త్వరగా ఎంత పెద్దవాడయ్యాడూ!?’’ అని.‘‘అరే! ఎంత పెద్దవాడవయ్యావురా నువ్వు. ఇన్ని రోజులూ నేను గమనించలేదెందుకనీ?’’ ఎందుకో ఈ మాటలు మనస్సులోనే వుండిపోయాయి. బయటపడలేదు. నేను తాపీగా బటాటా వడ తింటూ కూర్చున్నాను.బస్టాప్‌కు వచ్చాం. అక్కడ చాలా రద్దీగా వుంది. జనంతో కిటకిటలాడుతూన్న బస్సు వచ్చింది. నిఖిల్ నన్ను ముందు ఎక్కించాడు. తరువాత తనూ ఎక్కాడు. నా చుట్టూ చేతుల్తో కోటకట్టినట్లు నిలబడ్డాడు. నాకు ఏ విధంగానూ ఇబ్బంది కలక్కుండా వుండేలా జాగ్రత్తపడ్డాడు.అకస్మాత్తుగా నా మనస్సులో బరువు తగ్గినట్లనిపించింది. మా స్టాపు రాగానే దిగాము. నడుస్తూ, నడుస్తూ నిఖిల్ అడిగాడు –‘‘అమ్మా! నాన్న ఎప్పుడు తిరిగివస్తాడూ?’’‘‘ఆయన అమెరికాలో వుండవలసిన కాలం మరో నాలుగు నెలలు పెంచారట.’’‘‘ఐతే అమ్మా.. ఇలా చేద్దాం.. మనమే నాయనమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం. నాన్న వచ్చేవరకూ ఆగవద్దు. ఇవ్వాళే డాక్టరుగారి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నేనే నాయనమ్మని డాక్టరు దగ్గరకు తీసుకెళ్తాను. నాన్నగారి స్కూటర్ సరిగ్గా స్టార్ట్ అవడం లేదు. నిన్ననే చూశా. దాన్ని గ్యారేజ్‌కి ఇస్తాను – బాగుచేయడానికి’’‘‘అరే, నీకు స్కూటర్ నడపటం రాదు కదరా?’’ నేను చటుక్కున అడిగాను.‘‘ఏంటమ్మా అలా అంటావు? నేనే నడిపి మెకానిక్ దగ్గరకు వెళ్లాలా? వాడికి చెప్పి ఇంటికి పిలవ్వొచ్చుకదా!? అలాగే ఇంటికి రంగు వేయడం విషయం చూద్దాం. నాన్న వచ్చే సరికి అంతా కొత్తగా, ఎంచక్కా కనిపించాలి.’’ నిఖిల్ నాలాగా నాన్చకుండా, తండ్రిలాగే త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. నా మనస్సు బెంగలన్నీ మాయమయి శాంతించింది. హమ్మయ్య! వీడు ఎదిగొచ్చాడు!రాత్రి నిర్మల హృదయంతో సుధీర్‌కి నీలం రంగు ఉత్తరం రాశా.‘‘సుధీర్! సావకాశంగా నీ థీసిస్ పూర్తి చేసి సంపూర్ణ యశస్సుతో స్వదేశానికి లాభంగా తిరిగిరా. నాలుగు నెలలేం పెద్ద సమస్యకాదు. కాలం ఇట్టే గడిచిపోతుంది..’’ -
ఐక్యూ పెరగాలంటే?
జీవితంలో విజయవంతంగా ముందుకు పోవడానికి వివేకం, విచక్షణ చాలా అవసరం. ఇందుకు ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెంట్) స్థాయిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. పిల్లల్లో వివేక సూచిక (ఐక్యూ)ను పెంచడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నామా? 1. పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ ఐక్యూ మెరుగుపడటంలో ఆహారం కీలకం. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్ తగినంత ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. ఎ. అవును బి. కాదు 2. మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారం అందనప్పుడు ఆ లోటును ఓమేగా 3 ఆయిల్ క్యాప్సూల్స్ భర్తీ చేస్తాయి, కానీ వాటిని డాక్టరు సలహా లేకుండా వాడకూడదని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. ఐక్యూ స్థాయి పెరగడానికి తగినంత నిద్ర తప్పని సరి. ముందు తరం పాటించినట్లు చదువుకునే పిల్లలు త్వరగా పడుకుని వేకువఝామున నిద్రలేవాలన్న నియమం అలాంటిదే. ఎ. అవును బి. కాదు 4. చదివినది ఎక్కువ కాలం జ్ఞాపకం ఉండాలంటే సుఖనిద్ర అవసరం. కలత నిద్ర వల్ల మెదడు గ్రహించిన విషయాలను తాత్కాలికంగా నిల్వ చేసుకుని త్వరగా వదిలేస్తుంది. ఎ. అవును బి. కాదు 5. చెస్, సుడోకు వంటి ఇండోర్ గేమ్స్, పజిల్స్ పరిష్కరించడం వంటి హాబీలు ఐక్యూ స్థాయిని పెంచుతాయి. ఎ. అవును బి. కాదు 6. పిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు వ్యూహాత్మకంగా ఆడాల్సిన ఆటలను ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు 7. దేహానికి వ్యాయామాన్నిస్తూ ఐక్యూ పెంచడానికి చేతుల కదలికలు, మెదడు, కంటి చూపు... మూడింటి సమన్వయంతో ఆడగలిగిన టెన్నిస్, పింగ్‌పాంగ్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు దోహదం చేస్తాయి. ఎ. అవును బి. కాదు 8. దేహదారుఢ్యానికి మంచి ఆహారం, చక్కని వ్యాయామం, తగినంత విశ్రాంతి ఎలా అవసరమో మెదడు చురుకుదనానికి కూడా ఇవన్నీ అవసరమేనని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. మెడిటేషన్, యోగసాధన ద్వారా మెదడు కణాలు ఉత్తేజితమవుతాయి. ఎ. అవును బి. కాదు ‘ఎ’లు ఐదు కంటే ఎక్కువ వస్తే ఐక్యూ పెంచుకోవడం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువగా వస్తే మీరు పిల్లల విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకో వాలి. అప్పుడు వాళ్లు భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. -
ప్రజలు వైఎస్‌ను ఎన్నటికీ మరువరు
-
లోక్‌సభలో 'నీర్జా'కు నీరాజనాలు
న్యూఢిల్లీ: విమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు 2014 (యాంటీ హైజాకింగ్ లా)కు లోక్ సభలో సోమవారం ఆమోద ముద్ర పడింది. సవరించిన ఈ బిల్లు ప్రకారం విమానాల హైజాకింగ్‌కు పాల్పడిన వారికి ఇకముందు మరణదండన విధిస్తారు. బిల్లుపై చర్చ సందర్బంగా హైజాకర్లు కాల్చి చంపిన నీర్జా భానోత్ కు సభ్యులు నీరాజనాలు పలికారు. ఈ బిల్లు పైగా చర్చ సందర్భంగా 1986 లో హైజాక్ విమానంలో మరణించిన పాన్ ఏఎం ఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ సాహసాన్ని సభ్యులు కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారని ప్రశంసించారు. ఆమె ఒక సాహసోపేత మహిళ అనీ, ఆమె తెగువపై బాలీవుడ్ లో ఇటీవల చిత్రం కూడా విడుదలైందని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బీఎన్ గౌడ్ బిల్లును సమర్ధిస్తూ మాట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం అందించేలా పటిష్టయైన వ్యవస్థను రూపొందించాలన్నారు. అమెరికాకు చెందిన పాన్ ఏఎం కంపెనీ ఇప్పటికీ భారత సిబ్బందికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నీర్జా భానోత్ , సీనియర్ అటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ముంబై -న్యూ యార్క్ పాన్ ఏఎం విమానాన్ని కరాచీలో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. సెప్టెంబర్ 5, 1986 లో ప్రయాణీకులను కాపాడే క్రమంలో ఉగ్రమూకల తూటాలకు నిర్జా బలి అయ్యారు. ఆమె ధైర్యసాహసాలకుగాను భారతదేశం అత్యున్నత శాంతి సేనా పురస్కారం అశోక్ చక్ర ప్రకటించింది. కాగా ఇంతకుముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇటీవల ఆమోద ముద్ర వేసినసంగతి తెలిసిందే. -
పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలెత్తించిన మైకేల్ పాట