Herald
-
5జీ టెక్నాలజీ భావితరాలకు వరం
సాక్షి, హైదరాబాద్: టెలికమ్యూనికేషన్ రంగంలో 5జీ ప్రవేశంతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుందని అమెరికన్ సైబర్ నిపుణుడు హెరాల్డ్ ఫర్ష్‌టాగ్ అన్నారు. 5జీ, సైబర్ భద్రత అంశాలపై రకరకాల పరిశోధనలు చేసిన హెరాల్డ్ ఈ అంశాలపై పలు పుస్తకాలు రాశారు. బుధవారం బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోవు తరాలకు 5జీ వరంలా మారుతుందని అన్నారు. మనం గతంలో ఊహించనంత స్పీడ్, డేటా ట్రాన్స్ఫర్, అత్యాధునిక అప్లికేషన్లు, వైర్లెస్ టెక్నాలజీతో కమ్యూనికేషన్ల రంగంలో 5జీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని తెలిపారు. 5జీ రాకతో వ్యాపార, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత నదుల సమాచారం, జంతువుల కదలికలు, పంటలకు చీడలు తదితర వివరాలను ఇప్పటికంటే వేగంగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. మంచితోపాటు దుష్ప్రభావాలు.. 5జీ రాకతో మంచితోపాటు, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని హెరాల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాల్లో గూఢచర్యానికి పాల్పడేవారు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్రోహ, ఉగ్ర చర్యలకూ ఆస్కారం ఉంటుందని అన్నారు. కమ్యూనికేషన్, రక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన వ్యవస్థలను హ్యాక్ చేసే ప్రమాదాలు లేకపోలేదన్నారు. గతంలో ఉక్రెయిన్‌లో పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థను కొందరు రష్యన్ హ్యాకర్లు స్తంభింపజేసారని గుర్తుచేశారు. ప్రస్తుతం చైనా 5జీ సాంకేతికత అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఆదేశానికి చెందిన పలు హువాయ్, జెడ్‌టీఈ తదితర కంపెనీలు ఇప్పటికే చైనాలో 5జీ సేవలు అందించడం మొదలుపెట్టాయని తెలిపారు. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా ఆ సాంకేతికతను ఎగుమతి చేస్తోందన్నారు. అయితే, చైనాకు చెందిన కంపెనీల వల్ల భారతదేశానికి ఎలాంటి సైబర్ ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, ఆ దేశానికి చెందిన పలు స్మార్ట్ఫోన్లలో భద్రతకు సంబంధించిన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని తెలిపారు. ఈ కారణంగా ఆ తరహా ఫోన్లు త్వరగా హ్యాకయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో సైబర్ భద్రత ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌గా మారనుందని, అందుకే అనుమానాస్పద మాల్వేర్ సాఫ్ట్వేర్ల దిగుమతిని అమెరికా 2010 నుంచే నిలిపివేసిందని పేర్కొన్నారు. -
‘ఆ కార్టూన్లో తప్పు లేదు’
సిడ్నీ: అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ప్రవర్తనను ఉద్దేశిస్తూ గతేడాది సెప్టెంబరులో ‘హెరాల్డ్ సన్’ పత్రికలో ప్రచురితమైన కార్టూన్లో ఎలాంటి తప్పు లేదని ఆస్ట్రేలియా ప్రెస్ కౌన్సిల్ తేల్చింది. నిరుడు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని సెరెనా... కోర్టులోనే ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. అంపైర్‌ను ‘దొంగ... అబద్ధాలకోరు’ అంటూ తీవ్రంగా దూషించింది. దీనిపై నల్లటి దుస్తుల్లో ఉన్న సెరెనాను కొంచెం లావుగా చూపిస్తూ, రాకెట్ విరగ్గొట్టి కోర్టులో ఆమె గంతులేస్తున్నట్లు, ‘నువ్వు ఆమెను గెలవనివ్వాల్సింది’ అని ఒసాకాకు అంపైర్ చెబుతున్నట్లు ‘హెరాల్డ్ సన్’ కార్టూనిస్ట్ మార్క్ నైట్ కార్టూన్ వేశాడు. సెరెనా చిత్రణను ఆక్షేపిస్తూ ఇది కాస్తా జాతి వివక్ష, లింగ వివక్ష కోణంలో వివాదాస్పదమైంది. అప్పటికీ తప్పేమీ లేదని బలంగా చెబుతూ పత్రిక మరోసారి కార్టూన్‌ను ప్రచురించింది. చివరకు విషయం ఆస్ట్రేలియా ప్రెస్ కౌన్సిల్ వద్దకు చేరింది. విచారణ జరిపిన కౌన్సిల్... మ్యాచ్ రోజు సెరెనా చిన్న పిల్లలా ప్రవర్తించిందనే ఉద్దేశంలోనే కార్టూన్ ఉందని స్పష్టం చేసింది. -
సుబ్రహ్మణ్య స్వామి కొత్త టార్గెట్స్ ఇవే!
న్యూఢిల్లీ: ట్విట్టర్లో వరుస విమర్శలు చేస్తూ సొంత పార్టీ బీజేపీని ఇరకాటంలో పడేసిన ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా పంథా మార్చారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై నేరుగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై పరోక్షంగా స్వామి చేసిన ఆరోపణలు బీజేపీలో గగ్గోలు రేపిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఒక వారంపాటు ట్విట్టర్‌కు కొంత దూరంగా ఉంటానని స్వామి తాజాగా ప్రకటించారు. ఈ వారం రోజుల్లో అయోధ్యలో రామాలయం, కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ ప్రమేయమున్న నేషనల్ హెరాల్డ్, ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులపై దృష్టి పెడుతానని ఆయన తెలిపారు. అదేసమయంలో భారత జీడీపీ మీద ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాలను ఒకింత విస్మయపరిచింది. భారత జీడీపీ గణన, ఆర్బీఐ వడ్డీ రేట్లపై సామ్యూల్సన్-స్వామి థీయరీ వర్తింపజేసి విశ్లేషిస్తే.. అది పార్టీ వ్యతిరేక చర్య అంటూ మీడియా గగ్గోలు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయం కేసు, నేషనల్ హెరాల్డ్, ఎయిర్‌సెల్ మాక్సిస్ , సీఎస్కే తదితర కేసులపై దృష్టి పెడుతున్నందున ట్విట్టర్లో పెద్దగా కనిపించకపోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు. -
నింద - నిజం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 34 ఆఫీస్ సిబ్బంది అంతా దారిలో మంచు తుఫానులో చిక్కుకోకూడదని వెళ్లిపోయారు. హెరాల్డ్ మాత్రం పని ఒత్తిడి వల్ల వెళ్లలేదు. మంచు... కవులకి, ప్రేమ, పవిత్రత, ఆశలకి ప్రతీక. నిరాశావాదులకి మంచు, మరణం, విచారం, ట్రాజెడీలకి ప్రతీక. క్రీడాకారులకు అది ఆనందం. దాని మీద జారచ్చు. బద్ధకస్థులకి కూడా అది ఆనందమే. ఇంట్లో నిప్పు ముందు కాళ్లనిండా దుప్పటి కప్పుకుని వెచ్చగా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రేమికులకీ ఆనందమే. మైథునానికి మంచు చక్కటి ప్రేరణని ఇస్తుంది. మంచు తుఫాను అకస్మాత్తుగా మధ్యాహ్నం మూడు నించి చెలరేగింది. న్యూయార్క్‌లోని పీటర్ కంపెనీలో పనిచేసే హెరాల్డ్ కిటికీలోంచి బయటికి చూశాడు. మూడు అంగుళాల మేర మంచు కురిసిందని రేడియోలో విన్నాడు. ఆ తర్వాత మరికొన్ని అంగుళాల మంచు కురిసి ఉండచ్చని భావించాడు. దాని గురించి తెలియగానే ఆఫీస్ సిబ్బంది అంతా దారిలో మంచు తుఫానులో చిక్కుకోకూడదని వెళ్లిపోయారు. హెరాల్డ్ మాత్రం పని ఒత్తిడి వల్ల వెళ్లలేదు. తను ఎక్కి వెళ్లాల్సిన లోకల్ ట్రైన్స్ రద్దవచ్చని తెలిసినా చాలా ముఖ్యమైన మూడు ఫైళ్లని అతను పరిశీలిస్తున్నాడు. తన భార్య క్లైడ్కి ఫోన్ చేసి తను ఆ రాత్రి ఇంటికి రాలేకపోవచ్చని చెప్పాడు. ‘‘ఈ మంచు తుఫాను నా మంచికే వచ్చినట్లుంది. మా ఆఫీసులో చాలా డబ్బు కొట్టేశారు. ఎవరో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన ఫైళ్లని చదువు తున్నాను. రాత్రి ఆఫీస్‌లోనే ఉండి ఇది ఎవరి పనో రేపు ఉదయానికల్లా తెలుసుకుంటాను. మా కంపెనీ ఆడిటింగ్ ఫర్మ్‌కి వివరాలు ఇస్తాను. ఇక్కడ ఎవర్నీ నమ్మలేను. ఈ ఫైళ్లు చదువుతున్న కొద్దీ అందరూ దొంగలే అనిపిస్తోంది.’’ క్లైడ్ అణకువ గల భార్య. భర్త ఏ చర్యనీ ప్రశ్నించదు. తన భర్త చేసేదంతా సరైనదే అనే నిశ్చితాభిప్రాయంతో జీవించే అతి తక్కువ మంది భార్యల్లో ఆమె ఒకరు. ‘‘జాగ్రత్తండీ. తినడానికి ఆఫీస్‌లో ఏమైనా ఉందా?’’ అడిగింది. ‘‘లేదు. ఇందాకే ఫోన్ చేసి కనుక్కున్నాను. మా పక్క ఆఫీస్ బిల్డింగ్‌లోని కార్నర్ షాప్ రాత్రంతా తెరిచే ఉంచుతానని చెప్పాడు. అతను కూడా నాలాగే మంచు తుఫాను వల్ల షాపు మూసి ఇంటికి వెళ్లలేకపోతున్నాడు. చీజ్, తాజా బ్రెడ్, జింజర్ ఏల్, పళ్లు, బిస్కెట్ లాంటివి అక్కడ ఉంటాయి. వేడి కాఫీ కూడా దొరుకుతుంది.’’ ‘‘ఇంకేం? కానీ మంచులో నడిచేప్పుడు జాగ్రత్తండీ.’’ ‘‘తాజా మంచు ఇబ్బంది పెట్టదు. మంచు గడ్డ కట్టాకే జారే సమస్య.’’ మరి కాసేపు మాట్లాడాక రిసీవర్ పెట్టేసి హెరాల్డ్ దీక్షగా ఆ ఫైల్స్‌ని చదువుతూ ఓ ప్యాడ్‌లో పాయింట్స్‌ని రాసుకోసాగాడు. ఆఫీసులో డిస్టర్బ్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో అతని పని సాఫీగా సాగింది. ఫైల్స్‌లోని బిల్స్, ఇన్వాయిస్లని తనిఖీ చేసి, బ్యాంక్ స్టేట్మెంట్స్ని పరిశీలించి తేడాల జాబితా రాసి కూడాడు. మూడు నెలల్లో డెబ్భై ఆరు వేల రెండు వందల పదిహేడు డాలర్ల ముప్ఫై ఏడు సెంట్లు తేడా వచ్చింది. ఆ డబ్బుని కొట్టేశారని గ్రహించాడు. అది ఎవరి పనో కూడా జాబితా పూర్తయ్యేసరికి హెరాల్డ్‌కి అర్థమయ్యింది. అతని పని పూర్తయ్యేసరికి ఒంటి గంటా పది నిముషాలు పూర్తయింది. గట్టిగా ఆవులించి లేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకుని, ఆఫీస్ తలుపు తాళం చెవి తీసుకుని ఓవర్ కోట్ తొడుక్కుని బయటికి నడిచాడు. గాలి లేకపోవడంతో చలి తెలీడం లేదు. నెమ్మదిగా నిర్మానుష్యంగా ఉన్న కార్నర్ స్టోర్ వైపు నడిచాడు. కార్నర్ స్టోర్ యజమాని హెరాల్డ్‌ని ఆనందంగా ఆహ్వానించాడు. అతనితో పిచ్చాపాటి మాట్లాడుతూ కడుపు నిండా తిని, వేడి వేడి కాఫీ తాగి, డబ్బు చెల్లించి గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చాడు. కొద్దిసేపు నడవాలనిపించి నడవసాగాడు. అటు, ఇటు ఆగిన కార్ల మీద మంచు ఉంది. ఎక్కడ చూసినా తెల్లటి మంచు దూది పింజెల్లా కురుస్తోంది. కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగాడు. దారిలో ఓ చోట ఓ మంచు రాశి మీద కాలు వేయకుండా దాన్ని దూకాడు. అతని కాలు జారింది. కిందపడ్డాడు. తల ఓ ఇంటి మెట్టుని తాకడంతో స్పృహ తప్పింది. అరగంట తర్వాత రోడ్డు మీది మంచుని శుభ్రం చేసే వాహనం వచ్చింది. మీద మంచు కురిసిన హెరాల్డ్ అతనికి కనపడలేదు. హెరాల్డ్ మీదకి మూడు అడుగుల ఎత్తున మంచు కుమ్మరించబడింది. మర్నాడు సీటన్ కంపెనీ ఆఫీస్ తెరిచారు. మధ్యాహ్నానికి కాని హెరాల్డ్ భార్య ఆఫీస్‌కి ఫోన్ చేయలేదు. తన భర్త ఆఫీస్‌కి రాలేదని తెలిశాక, ఇంటికి కూడా రాకపోడంతో కంగారుపడి పోలీసులకి ఫిర్యాదు చేసింది. మరణించిన హెరాల్డ్ రెండు రోజుల తర్వాత మంచుని తొలగించే సిబ్బంది కంటపడ్డాడు. మరో రెండు రోజుల తర్వాత సీటన్ కంపెనీ వార్తల్లోకి ఎక్కింది. స్వర్గీయ హెరాల్డ్ సీటన్ కంపెనీ డబ్బుని దొంగిలించాడని పోలీసులకి ఆ కంపెనీ యజమాని ఫిర్యాదు చేశాడు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో అమ్మకాలు తగ్గడానికి కారణం హెరాల్డ్ జోక్యమే అని సేల్స్ మేనేజర్ ఆరోపించాడు. నాసి రకం ముడిసరుకుని కొనడానికి బాధ్యత హెరాల్డ్దే అని ఫ్యాక్టరీ మేనేజర్ చెప్పాడు. ఆఫీస్‌లో కొత్తగా పరిచిన కార్పెట్ నాసి రకంది. హెరాల్డ్ దాన్నే కొనమని తనని ఆజ్ఞాపించాడని పర్చేజ్ ఆఫీసర్ మెమోకి జవాబుగా రాశాడు. హెరాల్డ్ చాలా తప్పులకి బాధ్యుడయ్యాడు. ఆఖరికి పేపర్ జెమ్ క్లిప్స్ పని చేయకపోవడానికి కూడా హెరాల్డే బాధ్యుడయ్యాడు. హెరాల్డ్ భార్య కనెక్టికట్‌లోని తమ ఇంటిని అమ్మేసి, భర్త ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకుని కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. హెరాల్డ్ పుట్టి పెరిగిన ఊళ్లోని అతని మిత్రులు హెరాల్డ్ పచ్చి దొంగ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఐతే హెరాల్డ్ నిజాయితీపరుడు అని తెలిసింది ఒక్కరికే. అతని భార్యకి. తన భర్త నిజాయితీని అందరికీ చెప్పి ఒప్పించగల సమర్థత తనలో లేదని గుర్తించి ఆమె ఎప్పటికీ మంచు పడని కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. (ఎర్ల్ ఫుల్డ్జ్ కథకి స్వేచ్ఛానువాదం) -
సోనియా, రాహుల్ కు ఊరట..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. వీరిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు తెలిపింది. సోనియా, రాహుల్ సహా మరో ముగ్గురికి ఈ మినహాయింపును ఇస్తున్నట్లు పాటియాలా హౌజ్ కోర్టు ప్రకటించింది. గతంలో ఇదే కేసులో సోనియా, రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పట్లో అది పెద్ద ఊరటగా భావించారు. అయితే, దిగువ కోర్టు న్యాయమూర్తి అవసరం అనుకుంటే మాత్రం వాళ్లిద్దరినీ కోర్టుకు పిలవచ్చని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పుడు దిగువ కోర్టు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం రాహుల్, సోనియాలకు రాలేదు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్యామ్ పిట్రోడాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేసులోని సోనియా, రాహుల్ సహా ఇతరులు ఇంతకుముందే బెయిల్ పై ఉండగా.. తాజాగా పిట్రోడాకు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. అనంతరం కేసు విచారణను మార్చి 21 కి వాయిదా వేసింది. -
నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంటులో రచ్చ