hereditary
-
అర్చకులకు వంశపారంపర్య హక్కులు.. స్వరూపానందేంద్ర స్వామి స్పందన ఇదే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. సీఎం జగన్కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
అర్చక లోకం.. ఆనంద మంత్రం
మహారాణిపేట (విశాఖ దక్షిణం): ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అర్చకుల కల నేరవేరింది. గత ప్రభుత్వ హయాంలో వంశపారంపర్య అర్చకత్వం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. నేడు,రేపు అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల పాటు కాలయాపన చేసి చివరకు మొండి చెయ్యి చూపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్చకులకు బాసటగా నిలిచారు. అర్చకుల వంశపారంపర్య అర్చకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్చక చట్టం సవరణ జరిగితే, తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పించారు. దీంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న అర్చకులు,వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అర్చకులకు జీవం పోసిన జగన్ అర్చకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జీవో జారీ చేశారు. త్వరలోనే ఈ జీవో అమలుకానుంది. ఈ సమస్యతోపాటు ఇతర సమస్యల సాధన కోసం అర్చక సంఘాలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేశాయి. టీడీపీ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. జగన్ సీఎం కాగానే వీరి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. వంశపారంపర్య హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారు. 6బి,6సి దేవాలయాల్లో పనిచేసే ప్రతి అర్చకుడికి రూ. పదివేలు జీతం ఇవ్వాలని దేవదాయ అధికారులను సీఎం ఆదేశించారు. సంకల్పయాత్రలో, విశాఖలో నిర్వహించిన బ్రాహ్మణ గర్జనలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకుటున్నారు. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కు జీవో విడుదల చేయడంతో అర్చకులు సంతోషంలో వ్యక్తం చేస్తున్నారు. అర్చకులకు బాసటగా వైఎస్సార్ దివంగత వైఎస్సార్ అంటే అర్చకులకు ఎనలేని అభిమానం. అర్చకుల సమస్యలపై ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. 1987 నాటి అర్చక చట్టాన్ని సవరిస్తూ 2007లో శాసనసభ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. వైఎస్సార్ మరణాననంతరం అర్చకుల వంశపారంపర్య హక్కులు, ఇతర సమస్యలు పరిష్కారం అలాగే ఉండిపోయాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ అర్చకుల బాధలను చూసి చలించిపోయారు. వంశపారంపర్య హక్కుల పునరుద్ధరణకు జీవో తెచ్చారు. పునాతన,శిథిలావస్థకు ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం అమలుకు నిధులు కూడా కేటాయించారు. జిల్లాలో ఆలయాలు జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో మొత్తం 1047 ఆలయాలు ఉన్నాయి. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహాస్వామి, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం, ఆశీలమెట్ట శ్రీ సంపత్ వినాయకగర్ ఆలయాలు జిల్లాలో పెద్దవి. జిల్లాలో 6ఎ దేవాలయాలు 11 , 6బీ 60 ఆలయాలు, 6సి 972 ఆలయాలు ఉన్నాయి. వీటిలో వంశపారంపర్య హక్కులు ఉండే ఆలయాలు దాదాపు 35 నుంచి 40 వరకు ఉంటాయి. సీఎంకు రుణపడి ఉంటాం దేవాదాయశాఖ ఇచ్చిన జీవోలను అమలు చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో జీవోలను పక్కన పెట్టారు. ఇప్పడు వంశపారంపర్య హక్కు జీవోను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అర్చకుల కోసం పని చేస్తున్న సీఎం జగన్కు అర్చక లోకం రుణపడి ఉంటుంది. వంశపారంపర్య హక్కు అమలు కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టాం. కాని అమలు కాలేదు. ఇప్పుడు అమలు అవుతుండడంతో సంతోషంగా ఉంది. – కొత్తలంక మురళీకృష్ణ, ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి సంతోషంగా ఉంది సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే అర్చక లోకానికి మేలు చేసే పనులు చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అర్చకుల వంశపారంపర్య హక్కు జీవో జారీ చేశారు. అర్చక కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. గతంలో ఈ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. అయినా పట్టించుకోలేదు. కాని జగన్ వచ్చిన కొద్ది నెలలకే సమస్య పరిష్కరించారు. – వెలవలపల్లి కోటేశ్వర శర్మ, అర్చక సంఘం నాయకుడు అర్చకుల కష్టాలను అర్థం చేసుకున్న జగన్ అర్చకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పాదయాత్రలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వివరించాం. మంచి రోజులు వస్తున్నాయి. అంతా మంచి జరుగుతుందని మాతో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఇంకా కొన్ని ఆలయాల్లో అతి తక్కువగా జీతాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు కూడా లేవు. 6సి,6బి అర్చకులకు నెలకు రూ.20 వేల జీతం ఇవ్వాలని కోరుతున్నాం. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు, ఉత్తరాంధ్ర అర్చక సంఘం అధ్యక్షుడు అర్హులందరికీ జీతం జిల్లాలో 6సీకి సంబంధించిన ఆలయాల్లో 51 మంది అర్చకులకు నెలకు పది వేల రూపాయల జీతాలను అమలు చేశాం. ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు. వీరి కూడా రూ.10 వేలు జీతం ఇచ్చేందుకు ధార్మిక పరిషత్కు లేఖ రాశాం. దేవాలయం నుంచి కొంత భాగం, థార్మిక పరిషత్ నుంచి మొత్తం కలిపి ఈ జీతం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఎ.శాంతి, సహాయ కమిషనర్, దేవాదాయశాఖ విశాఖ జిల్లా -
బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది
సాక్షి, విజయవాడ: బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారు. వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేటి నుంచి కార్యరూపం దాల్చనుంది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా అర్చకుడు మదనగోపాలస్వామికి తొలి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. (జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో) అర్చక సమాఖ్య కార్యదర్శి ఆత్రేయబాబు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అర్చకులకు తీరని ద్రోహం చేశారన్నారు. అర్చకులతో బలవంతపు పదవీ విరమణలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత అన్ని ప్రభుత్వాలు అర్చకులను నిర్లక్ష్యం చేశాయన్నారు. పుష్కరకాలం తర్వాత సీఎం జగన్ అర్చకుల జీవితాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. మా కుటుంబాల్లో జీవనజ్యోతి వెలిగించారని సంతోషం వ్యక్తం చేశారు. (అర్చకుల కల సాకారం) -
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత
సాక్షి, విజయవాడ : ఏపీలో వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలుపుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అర్చకుల కుటుంబాల్లో వెలుగు నింపినట్లుయిందని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు హయాంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని నిర్ణయించడం సంతోషదాయకమని రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వారసత్వ బదిలీల్లో జాప్యమెందుకు?
తహసీల్దారుపై మంత్రి తుమ్మల ఆగ్రహం గండుగులపల్లి (దమ్మపేట): ‘‘వారసత్వ భూబదలాయింపుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది?ఎక్కడా లేని సమస్యలు ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? రైతులకు ఈ–పహణీ, 1బి పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే ఎలా?’’ అని, దమ్మపేట తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మలను గండుగులపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కలిశారు. ముందుగా, దమ్మపేట తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావును మంత్రి పిలిచారు. ఆ సమయంలో ఆయన లేరు. కొద్దిసేపటి తర్వాత వచ్చి కలిశారు. ‘‘తహసీల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కారమవడం లేదని రైతుల నుంచి నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. అర్హులైన రైతుల వారసత్వ బదలాయింపులు, పాస్ పుస్తకాల జారీలో నెలల తరబడి ఎందుకు జాప్యం చేస్తున్నారు?’’ అని ఒకింత ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆన్లైన్ ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘‘ఇక నుంచి మీ కార్యాలయంపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సహించేది లేదు’’ అని హెచ్చరించారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, పోతినేని శ్రీరామవెంకటరావు, కేవీ సత్యనారాయణ, బండి పుల్లారావు, చల్లగుళ్ల నరసింహారావు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, పానుగంటి రాంబాబు, కురిశెట్టి సత్తిబాబు, కాసాని నాగప్రసాద్ తదితరులు ఉన్నారు. -
సోరియాసిస్ (psoriasis)
సోరియాసిస్ మచ్చలు పింక్ లేక ఎరుపు వర్ణంలో పొలుసులతో కూడి ఉంటాయి. చర్మం దళసరిగా ఉంటుంది. ఈ పొలుసులను బలవంతంగా తీస్తే వాటి కింద ఎర్రటి రక్తపు మచ్చలుగా కనిపిస్తాయి. ఈ సోరియాసిస్ మచ్చలు. కొంచెం కాని, ఎక్కువ సంఖ్యలోగాని ఉంటాయి. శరీరంలోని చాలా భాగాలలో అంటే చేతులు, కాళ్ళు, తల, వీపుమీద, మోకాళ్ళ ముందుభాగాన, ఉదరం, అరికాళ్ళు, అరిచేతులలో అధికంగా ఈ మచ్చలు వస్తాయి. పొలుసులు చాలా దట్టంగా, అధికంగా ఉండి కొవ్వొత్తి మైనం లాగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాపుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా చాతి, కాళ్ళమీద... సోరియాసిస్ ప్రధానంగా యుక్త, మధ్య వయస్సులో అధికంగా కనిపిస్తుంది. చాలా తక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులలో కనిపించవచ్చు. అధిక వత్తిడి వలన, వంశపారంపర్యంగా తల్లిదండ్రులకు ఉంటే వారి పిల్లలకు ఈ వ్యాధి రావటానికి అవకాశాలుంటాయి. కాలివేళ్ళు, చేతివేళ్ళ గోళ్లలో గుంటలు పడినట్లు ఉంటాయి. చికిత్సా విధానం ప్రధానంగా సోరియాసిస్ (కిటిభ కుష్టం) అనే వ్యాధిలో పంచకర్మ చికిత్సా విధానం ఎంతో ప్రముఖమైనది. ఈ పంచకర్మ విధానంలో వమన కర్మ ప్రధానమైనది. దీనివలన శరీరంలో ఉన్న చెడుభావాలు రసాయనాలు మొదలగు శరీరం నుండి బయటికి పంపబడతాయి. తక్రధార: ఈ చికిత్సా విధానంలో ప్రత్యేకంగా ఔషధాలతో తయారు చేయబడిన తక్రము లేదా మజ్జిగ ధారతో మచ్చలు గల శరీర భాగలను శుభ్రంగా తడపటం జరుగుతుంది. దీనివలన శరీరంపై భాగంలోని పొలుసులన్నీ ఊడిపోతాయి. నివారణ మానసిక వత్తిడి నుండి పూర్తిగా విముక్తి వలన పులుపు పదార్థాలు, మాంసాహార సేవన, సముద్ర ఉత్పత్తులు పూర్తిగా నిషేధించటం వలన వాయుకాలుష్యం, జల కాలుష్యం నుంచి దూరంగా ఉండటం పరిశ్రమలలో సరైన రక్షణ విధానాలు పాటించటం వలన నివారించవచ్చు. డాక్టర్ దీప్తి ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక ph: 8977 336688 / 90300 85456 www.starayurveda.com, Email : info@starayurveda.com