hereditary jobs
-
వారసత్వ ఉద్యోగాలివ్వకుంటే తప్పుకో
కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి హితవు సాక్షి, హైదరాబాద్: సింగ రేణిలో వారసత్వ ఉద్యోగా లను ఇవ్వలేని సీఎం కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే అర్హతలేదని శని వారం సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. వారసత్వ ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మూడేళ్లు దాటినా.. ఇవ్వకుండా మాటలతో కాలం గడుపుతున్న టీఆర్ఎస్ ప్రభు త్వం చేతకాకుంటే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రానికి 7 జిల్లాల్లో బంద్ కొనసాగుతున్నదన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం ఇచ్చిన సర్క్యులర్ సవరించి, మళ్లీ జారీ చేయాలన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉత్తర్వులు జారీ చేసుకోవాలని హైకోర్టు చెప్పిందని, 1981 నుంచే వారసత్వ ఉద్యోగాల డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పంతాలకు పోయి కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. -
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వకుంటే తప్పుకో
- సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్: వారసత్వ ఉద్యోగాలను ఇవ్వలేని టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే అర్హత లేదని సీఎల్పీ ఉపనాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలిస్తామని చెప్పి మూడేళ్లు దాటినా మోసపు మాటలు, చర్యలతో కాలం గడుపుతున్న టీఆర్ఎస్కు ఇవ్వడం చేతకాకుంటే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏడు జిల్లాల్లో బంద్ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ వారసత్వ ఉద్యోగాల కోసం గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన సర్క్యులర్‌ను సవరించి మళ్లీ జారీ చేయాలని జీవన్ రెడ్డి కోరారు. 1981లోనే వారసత్వ ఉద్యోగాలకు ఆమోదం తెలిపారని, 1998లో నిలిపివేశారని వివరించారు. అప్పటినుంచి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలన్న డిమాండు ఉందన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తామని టీఆర్ఎస్ అనుబంధ సంఘం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉత్తర్వులు జారీ చేసుకోవాలని హైకోర్టు చెప్పిందని, పాత వాటిని సవరించి మరో సర్క్యులర్‌ను జారీ చేయడానికి అవకాశం ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పంతాలకు పోయి కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. -
వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఉత్తర్వులు
హైదరాబాద్ : వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2017 జనవరి ఒకటో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. కాగా 18 ఏళ్ల తర్వాత సింగరేణిలో మళ్లీ వారసత్వ ఉద్యోగాలు నియాకం జరుగుతున్న విషయం తెలిసిందే. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సు ఉన్న కార్మికులు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో.. ఆ ఉద్యోగాలను వారి కొడుకులు, తమ్ముళ్లు లేదా అల్లుళ్లకు అప్పగించవచ్చు. కాగా సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు పంచజెండా ఊపిన విషయం విదితమే. -
సింగరేణిలో వారసత్వ కొలువులు
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
⇒ 20 ఏళ్ల తర్వాత సింగరేణిలో వారసత్వ కొలువులు ⇒ సీఎం ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ⇒ 48 నుంచి 59 ఏళ్ల వారు అర్హులని నిర్ణయించిన బోర్డు ⇒ 18 వేల మంది కార్మికులకు లబ్ధి ⇒ చంద్రబాబు హయాంలో నిలిపివేసిన నియామకాలు ⇒ పునరుద్ధరణకు కార్మిక సంఘాల సుదీర్ఘ పోరాటం సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం సింగరేణి కార్మికులకు శుభవార్త. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి బోర్డు అంగీకరించింది. ప్రస్తుతం పనిచేస్తున్న సింగరేణి కార్మికుల్లో గత దసరా నాటికి అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సదరు ఉద్యోగి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామనే నిబంధన విధించింది. దీంతో సింగరేణివ్యాప్తంగా దాదాపు 18 వేల మంది కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తు న్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారసత్వ ఉద్యోగాలకు బోర్డు అంగీకరించినట్లు సమావేశం అనంతరం సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురుచేస్తున్న కార్మికుల కోరిక నెరవేరిందని, ముఖ్యమంత్రి ఆదేశంతో బోర్డు సమావేశంలో చర్చించి ఈ అంశాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు. బోర్డు సమావేశంలో మణుగూరు ఒపెన్ కాస్ట్లో ఓబీ తొలగింపునకు అనుమతి, బుల్డోజర్ల కొనుగోలు, హైవాల్ మైనింగ్, సత్తుపల్లి వాషరీల ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు. 1997లో నిలిపివేసిన చంద్రబాబు సర్కారు 1997 వరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగింది. నష్టాలు సంభవిస్తున్నాయనే నెపంతో 1997లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలిపేశారు. అయితే అధికారికంగా ఉద్యోగాల నిలుపుదల గురించి చంద్రబాబు సర్కారు 2002లో ప్రకటించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు, ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు సింగరేణి సంస్థతో, కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి. అక్టోబర్ 6న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు, సింగరేణి ఏరియాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో సమావేశమై వారసత్వ ఉద్యోగాలపై విన్నవించగా.. సానుకూలంగా స్పందించారు. అదే రోజు సింగరేణి లాభాల బోనస్ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎండీ శ్రీధర్‌తో చర్చలు జరిపిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించాలని, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాల అమలు విధివిధానాలపై సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు సానుకూలమైన నిర్ణయం వెలువడటంతో సింగరేణివ్యాప్తంగా కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 18 వేల మందికి వరం.. సింగరేణి యాజమాన్యం నిర్ణయం సంస్థలో పనిచేస్తున్న 53 విభాగాల ఉద్యోగులకు, కార్మికులకు వరం కానుంది. దాదాపు 18 వేల మంది కార్మికులు వారసత్వపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తేల్చింది. సింగరేణిలో ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లు. ఉద్యోగ విరమణకు ఏడాది ముందు వరకు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు కార్మికులను అర్హులుగా ప్రకటించడంతో వారికి కొంత ఊరట లభించినట్లైంది. నిలిపివేత తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తమను కూడా వారసత్వ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగరేణికి యువశక్తి: సీఎండీ శ్రీధర్ ‘ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశముంది. సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగనుంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సింగరేణి చేస్తున్న కృషిలో వీరందరూ భాగస్వాములు కావాలి. కంపెనీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి..’ అని సంస్థ సీఎండీ శ్రీధర్ పిలుపునిచ్చారు. కార్మికుల భద్రత మా బాధ్యత: ఎంపీ కవిత ‘కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇది. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి కావటంతో సింగరేణి కార్మికులకు మంచి రోజులొచ్చాయి. బొగ్గు బాయి కార్మికులు తెలంగాణ సైనికులు. వారి ఉద్యోగ భద్రత కూడా మా బాధ్యతగా భావిస్తున్నాం..’ అని కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత వారసత్వ ఉద్యోగాల నిర్ణయంపై స్పందించారు. -
వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఓకే
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు దశాబద్ధాలుగా నానుతోన్న వారసత్వం ఉద్యోగాల నియామకాలకు పచ్చజెండా ఊపింది. సింగరేణి బోర్డు నుంచి ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం జరిపిన సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సుగల కార్మికులు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో.. ఆ ఉద్యోగాలను వారి కొడుకులు, తమ్ముళ్లు లేదా అల్లుళ్లకు అప్పగిం 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా న్యాయపరంగా సమస్యలు రావని అభిప్రాయపడిన తర్వాతే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు అంగీకారం తెలిపామని, ఎంతోకాలంగా కార్మికులు కోరుతోన్న ఈ అంశంపై శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సింగరేణి చైర్మన్, సీఎండీ ఎన్. శ్రీధర్ మీడికాకు తెలిపారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. చారిత్రక నిర్ణయం ఎన్నో ఏళ్లుగా వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకమని సంస్థ సీఎండీ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. దీంతో అనేక మంది కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుందని, తద్వారా సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో సంస్థ భాగస్వామ్యం మరింత పెరుగుందని సీఎండీ ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వ నియామకాలతోపాటు మణుగూరు ఓపెన్ కాస్ట్ లో ఓబీ తొలగింపు అనుమతి, బుల్ డోజర్ల కొనుగోళ్లు, హైవాల్ మైనింగ్, సత్తుపల్లి వాషరీల ఏర్పాటు తదితర అంశాలను కూడా బోర్డు చర్చించింది. -
గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు(ఖమ్మం) : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సెంబ్లీ సమావేశం జీరో అవర్‌లో ఈసమస్యపై చర్చించినట్లు ఆయన ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలి పారు. 1998లో కోల్ఇండియా వ్యాప్తంగా సింగరేణిలో సైతం కార్మికులను కుదించాలనే నిర్ణయంతో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేయడంతోపాటు డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌పై నిషేధం విధించారని అన్నారు. అప్పటినుంచి సింగరేణిలో రిక్రూట్ మెంట్ సైతం సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ భారీగా తగ్గిపోతోందని, ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న యాజమాన్యం కార్మికుల సంఖ్యను పెంచడం లేదని చెప్పారు. గుర్తింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం(టీబీజీకేఎస్) డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని వాగ్దానం చేసిందని, అసెంబీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుకు చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించి త్వరలో ఉద్యోగ విరమణ పొందే కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట వాస్తవమేనని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హమీఇచ్చినట్లు పేర్కొన్నారు.