వారసత్వ ఉద్యోగాలివ్వకుంటే తప్పుకో
కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి హితవు
సాక్షి, హైదరాబాద్: సింగ రేణిలో వారసత్వ ఉద్యోగా లను ఇవ్వలేని సీఎం కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే అర్హతలేదని శని వారం సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. వారసత్వ ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మూడేళ్లు దాటినా.. ఇవ్వకుండా మాటలతో కాలం గడుపుతున్న టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేతకాకుంటే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రానికి 7 జిల్లాల్లో బంద్ కొనసాగుతున్నదన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం ఇచ్చిన సర్క్యులర్ సవరించి, మళ్లీ జారీ చేయాలన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉత్తర్వులు జారీ చేసుకోవాలని హైకోర్టు చెప్పిందని, 1981 నుంచే వారసత్వ ఉద్యోగాల డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పంతాలకు పోయి కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు.