వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఉత్తర్వులు
హైదరాబాద్ : వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2017 జనవరి ఒకటో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. కాగా 18 ఏళ్ల తర్వాత సింగరేణిలో మళ్లీ వారసత్వ ఉద్యోగాలు నియాకం జరుగుతున్న విషయం తెలిసిందే. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సు ఉన్న కార్మికులు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో.. ఆ ఉద్యోగాలను వారి కొడుకులు, తమ్ముళ్లు లేదా అల్లుళ్లకు అప్పగించవచ్చు.
కాగా సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు పంచజెండా ఊపిన విషయం విదితమే.