Hero Aadi
-
Aadi Saikumar: ఆది సాయికుమార్ మరదలి ఎంగేజ్మెంట్.. హీరో కూతుర్ని చూశారా? (ఫోటోలు)
-
గ్లామర్ పాత్రలు రావడం లేదు: ‘శశి’ హీరోయిన్
‘‘శశి’ చిత్రనిర్మాతలు మొదట నాకు ఫోన్ చేసి కథ వినమన్నారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ వచ్చి మూడు గంటలు ‘శశి’ కథ చెప్పారు. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యి నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ సురభి అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురభి విలేకరులతో మాట్లాడుతూ -‘‘శశి’ రెగ్యులర్ ప్రేమకథా చిత్రం కాదు. అన్ని రకాల అంశాలున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తల్లితండ్రులు, కూతురు మధ్య ఉన్న ప్రేమను ఈ చిత్రంలో బాగా చూపించారు. నిజ జీవితంలోనూ నా తల్లితండ్రులకు నేనొక్కదాన్నే కావడంతో శశి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. కూతురు పట్ల ఓ తండ్రి ఎంత రక్షణగా, బాధ్యతగా ఉంటాడన్నది ఆకట్టుకుంటుంది. నా తండ్రి పాత్రలో రాజీవ్ కనకాలబాగా నటించారు. ఈ సినిమాలో ఆది పాత్ర రగ్డ్గా ఉంటుంది. తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నేను కూడా రెండు వేరియేషన్స్‌లో నటించడం కొత్తగా అనిపించింది. గ్లామర్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ‘ఓటర్’ సినిమాలో నాది గ్లామర్ పాత్రే. ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. ‘శశి’ సినిమా విడుదల తర్వాత నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. తమిళంలో చేస్తుండడం వల్ల తెలుగులో ఎక్కువగా చేయలేకపోయా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. తమిళంలో 3 సినిమాలు చేస్తున్నాను. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. గోల్డెన్ స్టార్ గణేష్‌తో నటిస్తున్నాను’’ అన్నారు. -
‘చుట్టాలబ్బాయి’ సందడి
నెల్లూరు, సిటీ : నగరంలో చుట్టాలబ్బాయి చిత్ర బృందం గురువారం సందడి చేసింది. చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హీరో ఆది, డైరెక్టర్ వీరభద్ర నర్తకి థియేటర్లో హంగామా చేశారు. అభిమానుల అరుపులు, కోలాహాలం మధ్యన కొంతసేపు ప్రేక్షకులతో మాట్లాడారు. హీరో ఆది అభిమానులు కోరిక మేరకు చిత్రంలోని ఓ డ్యాన్స్ స్టెప్ వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో డైరెక్టర్ వీరభద్ర మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ఓ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. హీరో ఆది మాట్లాడుతూ నా తొలి చిత్రం ప్రేమకావాలి నర్తకీ «థియేటర్లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు. విజయోత్సవ యాత్రలో భాగంగా అప్పట్లో ఇదే నర్తకీ థియేటర్‌కు వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. నా విజయయాత్ర ఇక్కడి నుంచే మొదలైందన్నారు. నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమా చుట్టాలబ్బాయి విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రానున్న రోజుల్లో మంచి చిత్రాల్లో నటిస్తానన్నారు. ప్రస్తుతం ఏ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి, నర్తకీ థియేటర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద దర్గాలో ‘చుట్టాలబ్బాయ్’
కడప కల్చరల్ : యువ సినీ హీరో ఆది నటించిన చుట్టాలబ్బాయి చిత్రం యూనిట్ గురువారం పెద్దదర్గాను దర్శించుకుంది. ఆదితోపాటు హీరోయిన్ నమిత ప్రమోద్, దర్శకుడు వీరభద్రం, ఇతర యూనిట్ సభ్యులు కూడా దర్గాలో ప్రార్థనలు చేశారు. దర్గా ముజావర్ అమీర్ వారితో ప్రదాన గురువుల మజార్‌తోపాటు దర్గా ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శింపజేసి గురువుల చరిత్ర, విశిష్ఠత, గొప్పతనాన్ని వివరించారు. హీరో ఆది చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన తొలిచిత్రం విడుదలైన సందర్బంగా జరిగిన విజయయాత్రలో తిరుపతి నుంచి తాము పెద్దదర్గాకు వచ్చి గురువుల దర్శనం చేసుకున్నామన్నారు. దేశంలోని ప్రముఖ నటులంతా ఈ దర్గాను దర్శించుకుని గురువుల ఆశీర్వాదాలు పొందారని, ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తే కోరికలు తీరుతాయని, విజయాలు సిద్దిస్తాయన్న విశ్వాసం బాలీవుడ్ నటుల్లో సైతం ఉందన్నారు. ప్రస్తుతం విడుదలైన తన చుట్టాలబ్బాయి సినిమాను జిల్లా ప్రజలు బాగా ఆదరిస్తుండడం సంతోషాన్ని ఇస్తోందని, ఈ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి పెట్టగలరన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దర్గాకు వచ్చిన నటీనటులను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానిక యువత ఉత్సాహం చూపారు. -
ఇప్పటికి కుదిరింది..!
సునీల్ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘పూలరంగడు’ ఒకటి. దానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. వాస్తవానికి ఆ చిత్రంలో ఆది హీరోగా నటించాల్సింది. కానీ, అప్పటికి ఆ కాంబినేషన్ కుదరలేదు. ‘చుట్టాలబ్బాయ్’ చిత్రంతో ఇప్పటికి కుదిరింది. రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది.ముహూర్తపు దృశ్యానికి రచయిత గోపీమోహన్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సాయికుమార్‌గారికి, ఆదికి ఈ కథ బాగా నచ్చింది. నా దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ తరహాలో ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదంతో సాగుతుంది. అయితే, ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది’’ అన్నారు.అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న సినిమా అనీ, తన సినిమాకు థమన్ తొలిసారిగా పాటలిస్తున్నారనీ ఆది చెప్పారు. ఈ ఏడాది విడుదలయ్యే మంచి చిత్రాల్లో ఇది కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు. -
‘రఫ్’ కోసం సిక్స్‌ప్యాక్ చేశా!
ఆది ఆల్‌రౌండర్. క్లాస్, మాస్ సినిమాలకు న్యాయం చేయగలం. శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రమిది. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పిస్తున్నారు. ‘‘నా ప్రయాణంలో ‘రఫ్’ సినిమా చాలా చాలా స్పెషల్. నా పెళ్లికి ముందు విడుదలవుతోంది. ఈ సినిమా విజయవంతమైతే నాన్న కళ్లల్లో హ్యాపీనెస్ చూస్తాను. ఆయన ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు’’ అంటున్న హీరో ఆది ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆవిషయాలివీ... భారీ బడ్జెట్! ‘‘నన్ను ఇంకో నాలుగు మెట్లు ఎక్కించే సినిమా ‘రఫ్’. నటుడిగా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా. నూటికి నూరుశాతం నా టాలెంట్‌ని ఈ సినిమాలో పెట్టా. అందుకే ‘రఫ్’ గురించి చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వినోదం, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్స్... ఇలా అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి. థియేటర్లోకి అడుగుపెట్టిన ఏ ప్రేక్షకుడూ నిరుత్సాహపడని రీతిలో ఈ కథని తీర్చిదిద్దారు దర్శకుడు సుబ్బారెడ్డి. ఆయనకి ఇదే తొలి చిత్రమైనా... ఎక్కడా అలా అనిపించలేదు. తొలిసారి చేసిన ఒక పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి ఈ సినిమా రిజల్ట్ నాకు చాలా చాలా కీలకం. నా కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తయారైంది. చందు సరదాలు! సినిమాలో నా పాత్ర పేరు చందు. ప్రేమ విషయంలో అతని ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? నందు అనే అమ్మాయితో తనకి పరిచయం ఎలా ఏర్పడింది? అనే అంశాల్ని స్క్రీన్‌పైనే చూడాలి. చందు పంచే సరదాలు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్‌సింగ్ కూడా చాలా కష్టపడింది. ఆమె అందం సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుంది. ఇటీవల యూత్ రకుల్‌ని చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. ఇందులో ఆమె మరింత అందంగా కనిపించింది. మణిశర్మ, సెంథిల్‌కుమార్ లాంటి టెక్నీషియన్లతో పనిచేయడం ఈ సినిమాతో నాకు దక్కిన మరో గొప్ప అవకాశం అని భావిస్తారు. సిక్స్‌ప్యాక్ ఓ అవసరం! ‘‘అందరూ చేస్తున్నారు, నేనూ చేయాలి అని నేను సిక్స్‌ప్యాక్ బాడీ చేయలేదు. సినిమాకి అది అవసరమైంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో వైవిధ్యం చూపాలంటే సిక్స్‌ప్యాక్ చేయడమే కరెక్ట్ అనిపించింది. దర్శకుడు కూడా అదే చెప్పాడు. దీంతో దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశా. దానివల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. అయినా సరే ‘ఏం ఫరవాలేదు’ అంటూ నిర్మాత నన్ను ప్రోత్సహించారు. ఒక ఛాలెంజ్‌గా భావించి సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేశా. ఇప్పుడు సినిమాల్లో ఆ ట్రెండ్ కూడా నడుస్తుండడం నాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. - ఆది -
గరం మూవీ పోస్టర్స్
-
ఆది, ఆదా జోడీగా ‘గరమ్’!
‘‘పవన్‌కల్యాణ్ ఏడో సినిమా ‘ఖుషి’... మహేశ్‌బాబు ఏడో సినిమా ‘ఒక్కడు’... ఎన్టీఆర్ ఏడో సినిమా ‘సింహాద్రి’...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న ‘గరమ్’ చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా’’ అంటున్నారు రాజ్‌కుమార్ యం. ఆయన నిర్మాతగా.. మదన్ దర్శకత్వంలో ఆది, ఆదా శర్మ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గరమ్’. ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి పారిశ్రామికవేత్త టి. వెంకట్రావు కెమెరా స్విచాన్ చేయగా, చిత్రనిర్మాత రాజ్‌కుమార్ కుమార్తె రాజశ్రీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఆది మాట్లాడుతూ -‘‘మంచి కథ, చక్కని సంభాషణలు కుదిరిన చిత్రం ఇది. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్నాయి’’ అని చెప్పారు. మదన్ మాట్లాడుతూ -‘‘నా సహాయ దర్శకుడు శ్రీనివాస్ ఈ కథ ఇచ్చారు. జీవన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలొచ్చినా... అవన్నీ పక్కకు నెట్టేసి ముందుకు తీసుకెళ్లిపోయే తత్వం ఇందులో హీరోది. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కుర్రాడు ఒకడుండాలి అనిపించేలా హీరో పాత్ర ఉంటుంది జీవితమనే వాహనం చివరిదాకా ప్రయాణించాలంటే ‘ప్రేమ’ అనే ఇంధనం అవసరమని తెలిపే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో సంగీతానికి మంచి అవకాశం ఉందనీ, మ్యూజికల్ హిట్టయ్యే పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అగస్త్య తెలిపారు. ఆదికి వంద శాతం నప్పే పాత్ర ఇదని రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగిరెడ్డి బి., లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి.