heroine oriented
-
ఆగస్టు 15న తెరపైకి కీర్తి సురేష్ రఘుతాత
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్ కథానాయకిగా పరిచయమైన కొద్ది కాలంలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి జాతీయ అవార్డును గెలుచుకున్న నటి ఈమె. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ మరోపక్క ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లోను నటిస్తూ రాణిస్తుండటం విశేషం. అలా తాజాగా ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రఘుతాత. రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిమ్స్ పతాకంపై సుమన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ కిరకిందర్ నిర్మిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతం, యామిని జ్ఞానమూర్తి చాయగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ ఇది హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెత్తిస్తున్న కథాచిత్రం అనే ప్రచారం జరుగుతోందని అది వాస్తవం కాదని హిందీ భాషపై ఒత్తిడిని వ్యతిరేకిస్తూ రూపొందించిన వినోదంతో కూడిన కుటుంబ కాథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనంతరం నటి కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత ఈ చిత్రానికి తాను న్యాయం చేయగలనా? అనే సందేహం కలిగిందన్నారు. అయితే దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు ఇది హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత ఉంటుందన్నారు. తాను చదివింది కేంద్ర విద్యాలయం పాఠశాలలో అని, అక్కడ కూడా ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో మాత్రమే బోధనలు ఉండేవని చెప్పారు. కాగా తాను మహానటి చిత్రం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ తర్వాత యోగ వంటివి చేయడంతో ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు అంటూ తెలివిగా బదులిచ్చారు. అలాగే ప్రేమ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ పెళ్లి కాదు కానీ ఒక విషయం మాత్రం జరుగుతోందని, దాని గురించి త్వరలోనే వెల్లడిస్తానని నటి కీర్తి సురేష్ పేర్కొన్నారు. -
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అరుదే!
తమిళసినిమా: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల రాక అరుదైపోయిందని నటి తాప్సీ అంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్న ఈ ఢిల్లీ బ్యూటీని ఇప్పుడు దక్షిణాదిలో దాదాపు మరిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది తాప్సీ. అయితే ఈ జాణకు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ పింక్, నామ్ షబానా వంటి చిత్రాల్లో తాప్సీ నటనకు మంచి ప్రశంసలు లభించడంతో పాటు ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో బాలీవుడ్లోనే మకాం పెట్టేసింది. నామ్ షబానా చిత్ర కథ ఒక రకంగా చెప్పాలంటే తాప్సీ చుట్టూనే తిరుగుతుంది. అలాంటి మంచి కథా చిత్రాలు మరిన్ని రావాలని అంటున్న తాప్సీని హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు హీరోలకు సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం గురించి ప్రశ్నించగా నిజం చెప్పాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని, వాటిలోనూ ఒకటీ అరా చిత్రాలే విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. అదీ గాక హీరోల చిత్రాల స్థాయిలో హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం లేదన్నది నిజం అంది. హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చి సక్సెస్ అయితే సమాన పారితోషికం డిమాండ్ చేసే హక్కు ఉంటుందని అంది. ఆ ఏడాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తాను నటించిన చిత్రం ఒక్కటే భారీ ఓపెనింగ్స్ సాధించిందని పేర్కొంది. అయితే హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
ఆ పాత్రల్లో నటించడం వేస్ట్
హీరోయిన్లు సెంట్రిక్ ప్రాత్రల్లో నటించడం వేస్టే అంటోంది నటి టబూ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందిన నటి టబూ. ముఖ్యంగా కోలీవుడ్‌లో కండుకొండేన్ కండుకొండెన్, సిరైశాలె, స్నేహితియే వంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామకు ఇటీవల జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న టబూ ఒక భేటీలో పేర్కొంటూ తనకు వైవిధ్య భరిత కథా పాత్రల్లో నటించిన నాయకిగా అభిమానుల మధ్య మంచి పేరు ఉందని అంది. అయితే పాత్రల ఎంపికలో తాను ఎలాంటి పాలసీని అవలంభించలేదన్నారు. తనను ఆకట్టుకున్న పాత్రల్లో నటిస్తున్నానని చెప్పింది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లోనే నటించాలన్న భావన తనకు ఎప్పుడూ కలగలేదంది. అసలు అలాంటి కథా చిత్రాల్లో నటించమని తనను ఎవరూ అడగలేదని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే హృదయాలను కట్టిపడేసే సన్నివేశాలు లేని అలాంటి పాత్రల్లో నటించడం వృథా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వర్తమాన భామల నుంచి, ప్రముఖ కథానాయికల వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు కదా అన్న ప్రశ్నకు వారి గురించి చెప్పడానికి తానెవరినని, అది వారి వారి ఆకాంక్ష అని పేర్కొంది. ఈ అమ్మడు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందన్న చర్చ బాలీవుడ్లో బాగానే జరుగుతోంది. ఇకపోతే తన ఎదుగుదల తన తాహత్తుకు తగ్గట్టుగానే అమరిందని టబూ చెప్పుకొచ్చింది. -
త్రిష గర్జన మొదలైంది
నటి త్రిష గర్జన మొదలైంది. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కథానాయికల మార్కెట్ తగ్గుతుంటుంది. అయితే ఇందుకు చెన్నై చిన్నది త్రిషను అతీతమనే చెప్పాలి. ఈ బ్యూటీ సినిమా వయసు ఒకటిన్నర దశాబ్దం. తమిళం, తెలుగు, కన్నడం, చివరికి బాలీవుడ్ చిత్ర నటనానుభాన్ని కూడా చవి చూసేశారు. అలాంటి త్రిషకు ఒక సమయంలో మార్కెట్ పడిపోయింది. ఇక అమ్మడి పనైపోయిందనే ప్రచారం జోరందుకుంది. త్రిష కూడా సంసార జీవితంలో సెటిలైపోదామని వివాహానికి సిద్ధమైపోయారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త ప్రేమ, పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే అక్కడే త్రిష జీవితం అనుకోని మలుపు తిరిగింది. త్రిష పెళ్లి పీట ల వరకూ వెళ్లలేదు. అది ఎలాంటి అనుభవాన్ని కలిగించిందోగానీ, ఇకపై నటనపైనే తన దృష్టి అంతా అని త్రిష నిర్ణయం తీసుకున్నారు. అంతే తన మార్కెట్ అంతకుమించి అన్నట్లు పెరిగిపోయింది. అప్పటి వరకూ కమర్షియల్ చిత్రాల్లో హీరోలతో డ్యూయెట్లు పాడుతూ అందాలారబోతకు పరిమితమైన త్రిషకు స్త్రీ ప్రధాన ఇతివృత్త కథా చిత్రాల అవకాశాలు రావడం విశేషం. అలా ఈ భామ నటించిన నాయకి నిరాశపరచినా తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. అందులో సగం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే కావడం మరో విశేషం. నటుడు ధనుష్ సరసన కొడి చిత్రంలో రాజకీయ నాయకురాలిగా త్రిష అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మోహిని అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంతో పాటు అరవిందస్వామి సరసన చతురంగ వేట్టై–2, విజయ్‌సేతుపతికి జంటగా 96, ఒక మలయాళ చిత్రం, 1818 అనే మరో చిత్రంలో నటించడానిక కమిట్ అయ్యారు. తాజాగా మరో చిత్రం త్రిష ఖాతాలో చేరింది. అదే గర్జన. హిందీలో అనుష్క శర్మ నాయకిగా నటించిన ఎన్ హెచ్–10 చిత్రానికి రీమేక్ ఈ గర్జన. రోడ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో త్రిష సరసన బుల్లితెర నటుడు అమిత్ భార్గవ్ నటిస్తున్నారు. వంశీకృష్ణ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది.