తెలంగాణలో తుగ్లక్ పాలన
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు
జనగామ : తెలంగాణలో తుగ్లక్ పరిపాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఆరోపించారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణకు బాటలు వేస్తారని ఆశించిన ప్రజలకుæటీఆర్ఎస్ ప్రభుత్వం హైఓలే్టజీ షాక్ ఇస్తుందని మండిపడ్డారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఒం టెద్దు పోకడలతో ఏర్పాటు కానున్న జిల్లాల విషయంలో అధికార పార్టీ నేతలు సైతం విస్మయానికి గురవుతున్నారని తెలిపారు. జనగామ జిల్లా చేయాలని మెజార్టీ మండలా లు కోరుతూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని సీఎం కేసీఆర్ హన్మకొండను తెరపైకి తీసుకురావడం హాస్యాస్పదమన్నారు. జనగామ జిల్లా చేసేందుకు పది మండలాలు సిద్ధంగా ఉన్నాయని, మరో రెండు కలుపుకుని జిల్లాగా ప్రకటించాలని సీఎంను కోరారు. నెల్లుట్ల నర్సింహారావు, శ్రీనివాస్, జగదీష్, సత్యం, రమేష్, వెంకట్ పాల్గొన్నారు.