వ్యకిపై వేటకొడవళ్లతో దాడి
వివాహేతర సంబంధమే కారణం?
సుండుపల్లి(కడప)
వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిపై కొందరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లిలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన హిదాయత్ బస్సులో సుండుపల్లికి వెళ్తుండగా దుండగులు బైకుల్లో వెంబడించారు. బస్సు దిగిన వెంటనే అతనిపై కొడవళ్లతో దాడి చేశారు. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ఇద్దరు దుండగులు బాలక్రిష్ణ, సుధాకర్ లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన భాస్కర్ భార్యతో క్షతగాత్రుడికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు.