అధిష్టానం నుంచి సీఎంకు పిలుపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు ఉదయం 9.45 గంటలకు బయలుదేరి ఆయన ఢిల్లీ వెళతారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత పార్టీ పెద్దలను కూడా ఆయన కలుస్తారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షించేందుకే సిఎంని పిలిపించినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను అధిష్టానానికి ఆయన వివరించే అవకాశం ఉంది. యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి.