High ranking officers
-
అభివృద్ధా.. కనపడదే?
మార్క్సనగర్, సాయిమాణిక్నగర్ సిద్ధార్థనగర్, సంజీవ్‌నగర్ తదితర కాలనీలలో ఎటుచూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. దారిగుండా ముక్కుమూసుకొని దాటడమే కానీ ఎవరూ ఈ మురికిని పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల సమయంలో అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, వార్డు కౌన్సిలర్లు సైతం హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక కాలనీ వైపే చూడడం మానేశారు. - కాలనీలలో అన్నీ సమస్యలే.. - కనీస వసతులు ఉండవు - అధికారులకు అసలే పట్టదు.. - పాలకులు పట్టించుకోరు.. సంగారెడ్డి మున్సిపాలిటీ: సాయిమాణిక్ నగర్.. ఈ కాలనీ ఎక్కడో మూలన లేదు. ప్రధాన రహదారికి కేవలం 500 మీటర్ల దూరంలోనే కాలనీ ఉంది. ఈ కాలనీలో బ్యాంక్, పరిశ్రమలకు చెందిన ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ అభివృద్ధి జాడే లేదు. కౌన్సిలర్‌గా గెలుపొంది ఏడాది పూర్తయినా.. ఏ ఒక్కరోజూ కాలనీ పరిస్థితిని కౌన్సిలర్ పరిశీలించిన పాపానపోలేదు. సమస్యల పట్ల పలు మార్లు అధికారులకు.. కౌన్సిలర్లకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. మార్స్స్నగర్, సిద్దార్థనగర్, సంజీవ్నగర్లలో సైతం సమస్యలు తిష్టవేసినా.. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర బలహీనవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. ఈ కాలనీలో కనీసం మురికికాల్వలు లేకపోయాయి. ఇక్కడున్నవారంతా ఓపెన్డ్రైనేజ్ పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో వర్షకాలం వచ్చే వరదనీటితో పాటు డైనేజీలో నుంచి ముక్కుపుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. కానీ ఇంతవరకు మురికికాల్వలు నిర్మించలేకపోయారు. సాయిమాణిక్ నగర్లో సైతం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనందున గోకుల్ వెంకటేశ్వర ఆస్పత్రి నుంచి వచ్చే మురికి నీరు కాలనీల మధ్య వచ్చి నిల్వ ఉంటుంది. దీంతో పందులు సంచరిస్తున్నాయి. దీనికి తోడు కచ్చాకాల్వలు కూడా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. పట్టణంలో గతేడాది డెంగీవ్యాధి వచ్చిన వారిలో అధికంగా ఈ కాలనీ వారే ఉండటం గమనార్హం.. అధికారులు అన్ని కాలనీలను అభివృద్ధి చేశాం అని చెబుతున్నా.. ఈ కాలనీలో మాత్రం ఒక్క అడుగు మురికి కాల్వలు కూడా నిర్మించలేకపోయారు. ఈ కాలనీలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. నెల రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఈ కాలనీ చెత్తకాలనీగా తయారైంది. కాలనీలో మురికికాల్వలు, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోయాయి. ప్రతిపాదనలు పంపాం.. మార్క్సనగర్, సాయిమాణిక్నగర్ లో.. ఇటీవల 13 ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్ ఫండ్ నుంచి మురికికాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది. రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే త్వరలోనే పనులు చేపడతామన్నారు.. - గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్ -
ఇక పెద్దల వంతు
- ట్రేజరీ స్కాంలో స్వప్నకుమారి అరెస్టు - మరో ఇద్దరు ఉన్నతోద్యోగులపై చర్యలు - ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు - డీటీవో పాత్రపైనా విచారణ! - కుదిపేస్తున్న ఖజానా కుంభకోణం మహారాణిపేట(విశాఖ): చింతపల్లి ఖజానా కుంభకోణం ఆరోగ్య, ఖజానాశాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ స్కామ్‌లో15 మందిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి అప్పటి పాడేరు ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారిని 16వ నిందితురాలిగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ కార్యాలయంలో కూడా ఈ అవినీతి కుంభకోణానికి మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అప్పటి డీఎంహెచ్‌వోతో పాటు డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ కార్యాలయంలో కీలకమైన అధికారి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.8కోట్ల మేర కుంభకోణంపై క్రైం డీఎస్పీ కృష్ణవర్మ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు శాఖల్లోని ఉన్నతాధికారులకు ఈ స్కామ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పటి డీఎంహెచ్‌వో రెడ్డి శ్యామలను విచారించినట్టు తెలిసింది. ఫిర్యాదుతో సంబంధం ఉన్నవారినందరినీ దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే రికార్డులను స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధానపాత్రధారి చింతపల్లి పీహెచ్సీ జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌తో పాటు, డీఎంహెచ్‌వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ నిర్మలాకుమారి,పాడేరు ఏడీఎంహెచ్‌వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సన్యాసిరావు, ఆర్సీడీ ఆస్పత్రిలోని సీనియర్ అసిస్టెంట్ సింహాచలం, చింతపల్లి సబ్‌ట్రెజరీ అధికారి లోకేశ్వర్‌రావు, అకౌంటెంట్ అప్పలరాజులను అరెస్ట్ చేశారు. మరో 8మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి రూ. 42లక్షల నగదుతో పాటు 3కోట్లు విలువైన ఆస్తులను వెనక్కి తెప్పించగలిగారు.శ్యామల పాత్రపై ఆధారాలు: విచారణ సమయంలోనే అప్పటి డీఎంహెచ్‌వో రెడ్డి శ్యామల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. సాధారణంగా పాడేరు అడిషనల్ డీఎంహెచ్‌వో కార్యాలయ నిధులు నేరుగా ఆ కార్యాలయానికి చెందిన ఏడీఎంహెచ్‌వో ఖాతాలోకే జమ చేస్తారు. ఆ నిధులతోనే ఉద్యోగుల జీత భత్యాలు, కాంటాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లిం చాలి. ఇక్కడే కథ మలుపుతిరిగింది. ఆ డివిజన్లో ఏడీఎంహెచ్‌వో కార్యాలయంలోని డ్రాఫ్టింగ్ అధికారి నిర్మలాకుమారి, సీనియర్ అసిస్టెంట్ సింహాచ లం, చింతపల్లి సబ్‌ట్రెజరీ అధికారి లోకేశ్వర్రావులు కలిసి పాడేరు ఏడీఎంహెచ్‌వో కార్యాలయంలో కాకుండా విశాఖ డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి కాంటాక్ట్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి రూ.3.9 కోట్లు డ్రా చేశా రు. డ్రాఫ్టింగ్ అధికారి చూసిన ఫైల్‌ను ఏవోకు పంపాలి ఆయన చూశాక ఫైల్ ను సూపరెంటెండెంట్ సంతకానికి పం పాలి. ఆయన చెక్ చేసి డీఎంహెచ్‌వో సంతకానికి పంపిస్తే అప్పుడు డబ్బులు డ్రా చేసుకునే అవకాశముం టుంది. ఇందుకు భిన్నంగా నిర్మలా కుమారి పె ట్టిన బిల్లులపై ఏవో, సూపరెంటెండెం ట్ సంతకాలు లేకుండానే డీఎంహెచ్‌వో సంతకాలు పెట్టేశారు. దీంతో ఆమె పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో శ్యామలను పోలీసులు నేడో, రేపో విచారించనున్నారు. డీటీవో ఏం చేసినట్టు..? ఈ కేసులో జిల్లా ఖజానాశాఖాధికారి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2012 నుంచి 2014 మధ్యలో జరిగిన కుంభకోణంలో ఖజానాశాఖకు రావాల్సిన 774 వాంటింగ్ ఓచర్లు రాకుండానే నాలుగేళ్లు ఎలా ఆడిట్ చేయించారు? మిస్సయిన వోచర్ల గురించి డీటీవో ఎందుకు అడగలేదు. గతంలో ఒక ఓచర్ మిస్సయితేనే ఎస్టీవోను సస్పెండ్ చేయాలని ఆదేశించిన డీటీవో ఇప్పుడు భారీగా వోచర్లు మిస్సయితే ఎందుకు విచారణకు ఆదేశించలేదనే దానిపై అనుమానాలు వ్యకమవుతున్నాయి. కుంభకోణం ఇన్నేళ్ల నుంచి జరుగుతున్నా డీటీవో ఎందుకు విచారణ కొనసాగించలేదు. కాగా ప్రస్తుతం అరెస్టయిన అడిషనల్ డీఎంహెచ్‌వో స్వప్నకుమారి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.