highest paid athletes
-
ఎన్ని గోల్డెన్ డకౌట్లైనా.. కోహ్లి ఇప్పటికీ గోల్డే..!
Virat Kohli Is The Only Indian In Top 100 Highest Earning Athletes: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. గత రెండున్నరేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. సంపాదనలో వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ టాప్ 100 అథ్లెట్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. స్పోర్టికో విడుదల చేసిన ఈ జాబితాలో విరాట్ ఏకైక భారతీయ అథ్లెట్ కావడం విశేషం. 2021-22 సంవత్సరానికి గానూ అత్యధిక రాబడి కలిగిన ప్రపంచ అథ్లెట్లలో విరాట్ 61 స్థానంలో నిలిచాడు. అతని ఆదాయం 33.9 మిలియన్ డాలర్లుగా ఉంది. కోహ్లి మినహా మరే ఇతర భారతీయ అథ్లెట్‌కు ఈ స్థాయిలో ఆదాయం లేదు. List of World's highest paid athletes in the World in each Sports at No.1 - Virat Kohli only Cricketer and only Indian. (According to Sportico) pic.twitter.com/nRLWfYcF4F — CricketMAN2 (@ImTanujSingh) May 11, 2022 ఈ జాబితాలో ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ 126.9 మిలియన్ డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలువగా.. ఫుట్‌బాల్ దిగ్గజ త్రయం లియోనల్ మెస్సీ (122 మిలియన్ డాలర్లు), క్రిస్టియానో రొనాల్డో (115 మిలియన్ డాలర్లు), నెయ్మార్ (103 మిలియన్ డాలర్లు) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాలను ఆక్రమించారు. ఐదో స్థానంలో ప్రొఫెషనల్ బాక్సర్ కెనెలో అల్వారెజ్ (89), 8వ స్థానంలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ (85.7), 10వ స్థానంలో గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ (73.5) నిలిచారు. ఇక విరాట్ ప్రస్తుత ఫామ్ విషయానికొస్తే.. రన్ మెషీన్ ప్రస్తుత ఐపీఎల్లో సీజన్లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో అతనిప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 19.6 సగటున కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్లు (తొలి బంతికే ఔట్) కూడా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి ఫామ్ ఇంతకంటే దారుణంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో అతను సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతుంది. పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో అతని స్థానం కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇన్ని విపత్కర పరిస్థితుల్లోనూ కోహ్లి ఆదాయం ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. చదవండి: IPL 2022: ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ.. క్లూ ఇచ్చిన కోహ్లి -
అర్జెంటీనా స్టార్ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. 2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. బుధవారం ప్రకటించిన ఫోర్బ్స్ అథ్లెట్ జాబితాలో మెస్సీ తొలిస్థానంలో ఉండగా.. దిగ్గజ ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ రెండు, పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో మూడో స్థానంలో ఉన్నాడు. మే 1, 2022 ముగిసేనాటికి మెస్సీ 131 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నాడు. ఇందులో 55 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో సంపాదించాడు. ఇక రెండో స్థానంలో ఉన్న ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ 121 మిలియన డాలర్ల పారితోషికం తీసుకోగా.. తర్వాత వరుసగా పోర్చుగల్ కెప్టెన్ రొనాల్డో(115 మిలియన్ డాలర్లు), బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్(95 మిలియన్ డాలర్లు), మూడుసార్లు ఎన్బీఏ చాంపియన్ స్టీఫెన్ కర్రీ(92.8 మిలియన్ డాలర్లు)తో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఎన్బీఏ ఆటగాడు కెవిన్ డురంట్(92 మిలియన్ డాలర్లు) ఆరో స్థానంలో ఉండగా.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(90.7 మిలియన్ డాలర్లు) ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాల్లో మెక్సికన్ బాక్సర్ కానెలో అల్వరెజ్(90 మిలియన్ డార్లు), ఏడుసార్లు సూపర బౌల్ చాంపియన్ టామ్ బ్రాడీ(83.9 మిలియన్ డాలర్లు), ఎన్బీఏ చాంపియన్ గియనిస్ (80.9 మిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 33.9 మిలియన్ డాలర్లతో(31 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో) 61వ స్థానంలో ఉన్నాడు. కోహ్లి తప్ప మరే భారతీయ ఆటగాడు టాప్-100లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఈ ఫోర్బ్స్ జాబితాను ప్రతీ ఏడాది ప్రకటించడం ఆనవాయితీ. ఆటగాళ్ల వార్షిక సంపాదన, ఎండార్స్మెంట్, బోనస్, స్పాన్సర్షిప్ డీల్స్, లైసెన్స్ ఇన్కమ్ ద్వారా వివరాలను వెల్లడిస్తుంటారు. చదవండి: MS Dhoni: సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్ The World’s 10 Highest-Paid Athletes 2022 https://t.co/MIB7ZF8u5I pic.twitter.com/ujPt4ny41s — Forbes (@Forbes) May 12, 2022 -
ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా.. సింధు!
న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సంపాదన పరంగా చరిత్ర సృష్టించారు. మంగళవారం విడుదల చేసిన 2019 ఫోర్బ్స్ టాప్-15లో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా ఘనత సాధించారు. సింధు 5.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో 13వ స్థానాంలో నిలిచారు. ఈ ఆదాయం అంతా ఆమె ప్రకటనలు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా లభించింది. సింధు భారత మహిళా అథ్లెట్స్‌లో ప్రభావవంతమైన క్రీడాకారిణి అని, వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ 2018లో సింధు విజేతగా నిలవడంతో అభిమానుల్లో ఆమెకు మరింత క్రేజ్ పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక గతేడాది విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది మహిళా అథ్లెట్లలో అత్యంత సంపన్నరాలిగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్సన్ నిలిచారు. సెరెనా సంపద 29.2 మిలియన్ డాలర్లు. గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సింధు అంచనాలకు మించి ఆడటం లేదు. ఇండోనేసియా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో సహా.. సింగపూర్, మలేసియా, జపాన్, జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్క్ష్యంగా సింధు బరిలోకి దిగుతోంది. -
ఆదాయం పెరిగింది.. ర్యాంకు తగ్గింది!
న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 2018 ఫోర్బ్స్ టాప్–100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడిగా నిలిచాడు. బుధవారం విడుదలైన ఈ జాబితాలో రూ.2.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.173 కోట్లు) ఆదాయంతో అతను చిట్టచివరి స్థానం పొందాడు. ఈ ఆదాయం అంతా అతనికి ప్రకటనలు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా లభించింది. వాస్తవానికి 2017 జాబితాలో 2.4 కోట్ల డాలర్ల ఆదాయంతో 83వ స్థానం పొందిన కోహ్లీ.. ఈసారి అంతకంటే 10లక్షల డాలర్లు అధికంగా సంపాదించినా ర్యాంకు తగ్గడం గమనార్హం. కాగా, ఈసారి జాబితాలో టాప్–3 స్థానాలు ఫుట్‌బాల్ ఆటగాళ్లకే దక్కాయి. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ 127 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ టాప్ అథ్లెట్స్ లిస్టులో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ టాప్‌లో నిలవడం ఇదే మొదటిసారి. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్లతో రెండవ, బ్రెజిల్ ఫుట్‌బాలర్ నెయ్మార్ 105 మిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 93.4 మిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానంలో నిలిచాడు. -
కోహ్లి ఒక్కడికే ఆ జాబితాలో చోటు
ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాళ్ల జాబితాలో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నారు. 2.4 కోట్ల డాలర్లు (రూ.158 కోట్లు సుమారు) పారితోషికంతో కోహ్లి 83వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడికే చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ ఫ్లాయిడ్ మేవెదర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ఈ జాబితాలో ఒక్క మహిళా అథ్లెట్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కోహ్లికి ఉన్న పాపులారిటీ మరెవరికీ లేదని, సోషల్ మీడియా ఫాలోవర్సే దీన్ని ప్రతిబింబిస్తున్నారని ఫోర్బ్స్ పేర్కొంది. ఒక్క భారత్‌లోనే కాకుండా కోహ్లీ ప్రపంచవ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందిన ఆటగాడిగా ఫోర్బ్స్ అభివర్ణించింది. ట్విట్టర్లో ఇప్పటికే ఈయనికి 2.5 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నట్టు వివరించింది. ఫోర్బ్స్ రూపొందించిన ఈ జాబితాలో ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన మేవేదర్ పారితోషికం 28.5 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ.1,881 కోట్లు. మేవెదర్ తర్వాతి రెండో స్థానంలో అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సి, మూడో స్థానంలో సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోలు ఉన్నారు. టాప్ 100 ఆటగాళ్ల ఉమ్మడి సంపాదన 3.8 బిలియన్ డాలర్లు. అంటే 2,580 కోట్ల రూపాయలు. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది. బీసీసీఐ ఇటీవలే విరాట్ కోహ్లికి ఏ+ కాంట్రాక్ట్‌ను ఇచ్చింది. పుమా, పెప్సీ, ఆడి, ఓక్లే తదితర పాపులర్ బ్రాండ్లకు కోహ్లీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. -
భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడే...
న్యూయార్క్ : భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి, మరోసారి ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే 100 మంది అథ్లెట్స్ లో భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచారు. 'ది వరల్డ్స్ హైయస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ ' 2017 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. మొత్తం చెల్లింపులు 22 మిలియన్ డాలర్ల(రూ.141కోట్లకు పైగా)తో విరాట్ ఈ జాబితాలో 89వ స్థానాన్ని పొందారు. విరాట్ ఆర్జించే పారితోషికాల్లో 3 మిలియన్ డాలర్ల వేతనం, విన్నింగ్స్, మరో 19 మిలియన్ డాలర్ల ఎండోర్స్ మెంట్స్ ఉన్నాయి. విరాట్ ను ఇండియన్ క్రికెట్ ఫెనోమ్ గా ఫోర్బ్స్ అభివర్ణించింది. కోహ్లి బ్యాటింగ్ లో రికార్డులు సృష్టిస్తున్నాడని కొనియాడింది. 2015లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ గా విరాట్ ను ఎంచుకున్నప్పడు, ఈ జాబ్ ను నిర్వర్తించే అత్యంత పిన్న వయసు ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపుపొందినట్టు పేర్కొంది. గతేడాది తన నేషనల్ టీమ్ ప్లే కింద కోహ్లి 1 మిలియన్ డాలర్లు(రూ.6కోట్లకు పైగా) వేతనం, శాలరీలు పొందారని, అలాగే ఐపీఎల్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి 2.3 మిలియన్ డాలర్ల(రూ.14కోట్లకు పైగా) వేతనం పొందినట్టు తెలిపింది. కోహ్లి ఆదాయాలు ఎక్కువగా ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన స్పానర్ షిప్ పోర్టు ఫోలియోలతో వస్తున్నాయని చెప్పింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రోనాల్డ్ 93 మిలియన్ డాలర్ల పారితోషికం పొందుతున్నారు. రెండో స్థానంలో బాస్కెట్ బాల్ స్టార్ లీబ్రోన్ జామ్స్ నిలిచారు. ఈయన పారితోషికం 86.2 మిలియన్ డాలర్లు. ఈ పారితోషికాల్లో ఆటగాళ్లు 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు పొందిన వేతనాలు, నగదు బహుమతులు, బోనస్ లు ఉన్నాయి. 21 దేశాల ఆటగాళ్లు ఈ టాప్ 100 లో ఉన్నారు. అయితే 63 మంది ఆటగాళ్లతో అమెరికా ఈ జాబితాలో ఆధిపత్యంలో నిలిచింది.