Highway Project
-
వడివడిగా హాయివే.. పామర్రు నుంచి దిగమర్రు వరకు 4 లేన్ల ప్రయాణానికి సిద్ధం
ఆకివీడు: నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకం. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి పాలకొల్లు మండలం దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చొరవతో ఈ పనుల్లో మళ్లీ పురోగతి కనిపిస్తోంది. రెండు దశల్లో పనుల నిర్వహణ.. ఈ మొత్తం రహదారి పనులను రెండు ఫేజ్‌లుగా విడదీసి పనులు వేగవంతం చేశారు. పామర్రు నుంచి ఆకివీడు 64 కిలోమీటర్ల మేర ఒక ఫేజ్, అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 43 కిలోమీటర్ల మేర మరో ఫేజ్‌లో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పామర్రు నుంచి ఆకివీడు వరకూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 90 కల్వర్టుల నిర్మాణం.. పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశారు. రూ.273 కోట్లతో పనులను చేపడుతున్నారు. దీనిలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనులను చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆకివీడు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు. నాలుగు జిల్లాలకు మేలు.. ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని.. దీని ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని వివరిస్తున్నారు. వేగంగా పనులు కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు చేపడుతున్నాం. 90 కల్వర్టులు, రెండు మేజర్ వంతెనల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. –ఎం.సత్యనారాయణరావు, DE, NH, కృష్ణా జిల్లా కోర్టు అనుమతి రావాలి.. ఎన్‌హెచ్ 165 రహదారికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే 165 రహదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి. – శ్రీనివాసరావు, DE, NH, పశ్చిమ గోదావరి జిల్లా -
చైనాకు మరో షాక్ ఇచ్చిన భారత్
-
చైనాకు షాక్.. భారీ ప్రాజెక్టు రద్దు
ఢాకా : పరాయి దేశాల్లో భారీ ప్రాజెక్టుల ముసుగులో చైనా సాగిస్తోన్న అవినీతి కలాపం బట్టబయలైంది. ఉన్నతాధికారులకు విచ్చలవిడిగా లంచాలు పంచుతూ నిధులను దారిమళ్లించిన వ్యవహారం చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో చైనా ప్రఖ్యాత కంపెనీలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పందాలను రద్దుచేసుకోవడం సంచలనంగా మారింది. ‘ఢాకా-సిల్హట్ హైవే’లో అక్రమాలు : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, సిల్హట్ పట్టణాలమధ్య కొత్తగా హైవేను నిర్మిస్తున్నారు. బంగ్లాతో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా చైనా ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా నడిచే చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీయే హైవే నిర్మాణ పనులను చేపట్టింది. కాగా, ఈ ప్రాజెక్టు నిధులను ఇతర అవసరాలకు వినియోగించాలని చైనీస్ కంపెనీ భావించింది. అందుకు బాంగ్లా అధికారుల అనుమతి కూడా తప్పనిసరి కావడంతో లంచాల పంపకానికి తెరలేపారు. ‘‘బంగ్లా ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్ శాఖ చీఫ్‌కు చైనీస్ కంపెనీవాళ్లు భారీగా లంచం ఇచ్చినట్లు తేలింది. ఇది దేశాలమధ్య కుదిరిన నిబంధనలకు విరుద్ధం. కాబట్టి చైనా కంపెనీని ప్రభుత్వం నిషేధించింది. మిగిలిపోయిన పనులు ఎవరు చెయ్యాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి అమా ముహిత్ మీడియాకు చెప్పారు. -
‘విజయవాడ హైవే’లో వాటా సేల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్తుల్ని తగ్గించుకోవటానికి పెట్టుకున్న ‘అసెట్ లైట్’ కార్యక్రమాన్ని జీఎంఆర్ వేగవంతం చేస్తోంది. మూడు రోజుల క్రితమే టర్కీ ఎయిర్‌పోర్టు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన జీఎంఆర్ తాజాగా మరో హైవే ప్రాజెక్టును విక్రయించే ఆలోచనలో పడింది. విజయవాడ-హైదరాబాద్ మధ్య నిర్మించిన 181.5 కి.మీ హైవే ప్రాజెక్టులో మెజార్టీ వాటాను అమ్ముతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 74 శాతం వాటా ఉంది. దీన్లో 48 శాతం వాటాను మోర్గాన్ స్టాన్లీ ఇన్ఫ్రా ఫండ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జీఎంఆర్ తన వాటాగా రూ. 1,740 కోట్లు ఖర్చుపెట్టింది. ప్రస్తుతం 48 శాతం వాటాకు రూ. 800 నుంచి రూ.900 కోట్లు చెల్లించడానికి మోర్గాన్ స్టాన్లీ ఫండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇదే విషయమై కంపెనీ రహదారుల విభాగం ఎండీ భుజంగరావును ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి సంప్రదించగా... మార్కెట్ స్పెక్యులేషన్స్ గురించి తామేమీ చెప్పలేమన్నారు. ‘‘వాటా విక్రయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇన్ఫ్రా ప్రాజెక్టులపై రంగరాజన్ క మిటీ చేసే సిఫారసులను చూశాకే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. అయినా మేం మా ప్రాజెక్టుల్లో వాటాలను పునర్వ్యవస్థీకరించాలనుకుంటున్నామే తప్ప పూర్తిగా వైదొలగాలనుకోవటం లేదు. ఈ ప్రాజెక్టులో కూడా కనీసం 26 శాతం వాటా ఉంచుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రంగరాజన్ కమిటీ సిఫారసులను చూసి నిర్ణయం తీసుకోవటానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు మాత్రం మొత్తం ప్రక్రియ ఏడెనిమిది నెలల్లో పూర్తయిపోతుందని చెబుతుండటం గమనార్హం. బ్యాలెన్స్ షీటు విలువకు రెండున్నర రెట్లు అధికంగా... దాదాపు 40వేల రూపాయల రుణాల్ని కలిగి ఉన్న జీఎంఆర్... వీటిని తగ్గించుకోవడానికి వివిధ ప్రాజెక్టులను విక్రయిస్తోంది. ఇప్పటికే జడ్చర్ల, తమిళనాడు హైవేలను, కొన్ని విద్యుత్, ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుల్లో వాటాలను విక్రయించింది. ఇవికాక నేపాల్‌లో ఉన్న రెండు విద్యుత్ ప్రాజెక్టుల్లో వాటాలను రూ. 1,000 కోట్లకు విక్రయిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులనూ విక్రయిస్తే జీఎంఆర్‌కు రూ.100 కోట్ల రుణ వడ్డీ భారం తగ్గుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుధవారం ఎన్ఎస్ఈలో జీఎంఆర్ షేరు స్వల్పంగా పెరిగి రూ.24.85 వద్ద ముగిసింది. -
తమిళనాడు హైవే ప్రాజెక్టును విక్రయించిన జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూపు తమిళనాడులోని 73 కి.మీ తిండివనం - ఉలుండుర్‌పేట్ జాతీయ రహదారి ప్రాజెక్టులో మెజార్టీ వాటాను విక్రయించింది. ‘అసెట్ రైట్ - అసెట్ లైట్’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టులోని 74 శాతం వాటాను రూ.222 కోట్లకు ఐడీఎఫ్సీకి చెందిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కి విక్రయించింది. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ వలన కంపెనీ రుణ భారం రూ.459 కోట్లు తగ్గడమే కాకుండా రూ.222 కోట్లు చేతికి వచ్చినట్లు జీఎంఆర్ గ్రూపు సీఎఫ్‌వో మధు తెర్దల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐడీఎఫ్సీ ఇన్ఫ్రా ఫండ్ 1,878 కి.మీ రహదారులను నిర్వహిస్తున్నట్లు ఐడీఎఫ్సీ మేనేజింగ్ పార్టనర్, సీఈవో ఎం.కె.సిన్హా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎంఆర్‌కి రూ.33,000 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ రూ.52,000 కోట్లు వరకు ఉన్నట్లు మంగళవారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో పేర్కొంది. అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి మరిన్ని ఆస్తులను విక్రయించనున్నట్లు ఈ సమావేశంలో పేర్కొన్నారు.