ఆ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం
షిమ్లా: ఆరుగురు అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలు బియాస్ నదిలో కొట్టుకు పోయి మృతిచెందిన దుర్ఘట పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
ఈ పరిహారంలో డ్యామ్ బోర్డు 60శాతం, కాలేజీ యాజమాన్యం 30 శాతం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం10 శాతం ఇవ్వాలి. అంతేకాకుండా 7.5 శాతం వడ్డీ కూడా అదనంగా కలుపుకొని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 2014 జూన్ 8న వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతిచెందిన విషయం తెలిసిందే.