నాన్న లాలన
పిల్లలను పెంచడమంటే ఓ కళ. ఆ కళ అమ్మలకే కాదు... నాన్నలకూ ఉండాలనేది నిపుణుల మాట. పేరెంటింగ్‌లో కష్టాలు, ఇబ్బందులు, సవాళ్లపై అవగాహన కల్పిస్తూ... పిల్లల్ని పాలించడమే కాదు... ఆడించి... లాలించడంలోనూ తండ్రులకూ సమాన బాధ్యత ఉందని చెబుతూ హిమాలయ డ్రగ్ కంపెనీ వర్క్‌షాప్ నిర్వహించింది. సోమాజిగూడ హోటల్ పార్క్ హయత్‌లో మంగళవారం జరిగిన ఈ ‘నాపీ మే హ్యాపీ’ వర్క్‌షాప్‌లో వినోదాత్మక పోటీ ఏర్పాటు చేసింది.
తండ్రులు తమ చిన్నారులకు డయాపర్లు మార్చాలి. అందరి కంటే తక్కువ సమయంలో మార్చిన వారికి బహుమతులు ఇచ్చారు. ఇందులో తండ్రులు ఎంతో ఉత్సాహంగా పోటీపడ్డారు. ‘కుటుంబంలో నాన్న పాత్ర డబ్బులు సంపాదించటమే కాదు.. పిల్లల ఆలనపాలన బాధ్యతలనూ షేర్ చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల తండ్రుల పాత్రపై మరింత అవగాహన పెరిగింది’ అంటున్నారు పోటీలో పాల్గొన్న తండ్రులు.
- సాక్షి, సిటీ ప్లస్