Himayath nagar
-
మలబార్ గోల్డ్ & డైమండ్స్‌ను ప్రారంభించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
-
లాయర్ తలకు తుపాకీ గురి.. భూవివాదం
సాక్షి, హైదరాబాద్: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
హవాలా కేసు ఐటీ శాఖకు అప్పగింత
హైదరాబాద్ : హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తు పట్టుకున్న కేసును నారాయణగూడ పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు. రెండు రోజుల క్రితం హిమాయత్ నగర్లో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 84.75 లక్షల నగదుతోపాటు 2 కార్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హవాలా వ్యవహారం గురించి పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హిమాయత్ నగర్ నుంచి కారులో డబ్బు తరలిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నారు. వీరిలో హిమాయత్ నగర్‌లోని హైదరాబాద్ హిరా గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో నలుగురు ఉన్నారు. చాంద్‌బాగ్‌కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వారు డబ్బు తరలిస్తున్నట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయంపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. -
పితాని ఇంటిని ముట్టడించిన టీవీపీ విద్యార్థులు
-
పితాని ఇంటిని ముట్టడించిన టీవీపీ విద్యార్థులు
అర్హులైన విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలని మంత్రి పితాని సత్యనారాయణను తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు మంజూరులో ఆధార్ లింక్‌ను తొలగించాలన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించాలన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు. అందుకు నిరసనగా శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పితాని నివాసాన్ని టీవీపీ విద్యార్థులు ముట్టడించారు. ఆ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ క్రమంలో పితాని నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.దాంతో స్థానికంగా కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించారు.