అర్హులైన విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలని మంత్రి పితాని సత్యనారాయణను తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు మంజూరులో ఆధార్ లింక్ను తొలగించాలన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించాలన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు. అందుకు నిరసనగా శుక్రవారం హిమాయత్నగర్లోని పితాని నివాసాన్ని టీవీపీ విద్యార్థులు ముట్టడించారు.
ఆ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ క్రమంలో పితాని నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.దాంతో స్థానికంగా కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసు స్టేషన్కు తరలించారు.