ministers house
-
పితాని ఇంటిని ముట్టడించిన టీవీపీ విద్యార్థులు
అర్హులైన విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలని మంత్రి పితాని సత్యనారాయణను తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు మంజూరులో ఆధార్ లింక్‌ను తొలగించాలన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించాలన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు. అందుకు నిరసనగా శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పితాని నివాసాన్ని టీవీపీ విద్యార్థులు ముట్టడించారు. ఆ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ క్రమంలో పితాని నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.దాంతో స్థానికంగా కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
పితాని ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆధార్‌తో ముడి పెట్టవద్దంటూ ఏబీవీపీ మంత్రి పితాని సత్యనారాయణను డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని మంత్రి నివాసాన్ని ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం ముట్టడించారు. అనంతరం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరులో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆ సంఘం నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందులోభాగంగా మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మంత్రి నివాసం ముట్టడి కార్యక్రమానికి ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో స్థానికంగా కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. -
మంత్రి శైలజానాథ్‌కు చీరలు,గాజులు!
రాష్ట విభజనను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్ పూర్తిగా విఫలమైయ్యారని అనంతపురంలో సమైక్యవాదులు ఆరోపించారు. అందుకు నిరసనగా భారీ సంఖ్యలో సమైక్యవాదులు శుక్రవారం ఉదయం శైలజానాథ్ నివాసానికి చేరుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమైన శైలజానాధ్‌కు చీర, గాజులు అందజేసేందుకు అనంత మహిళలు ఆయన నివాసంలోకి చోచ్చుకుపోయేందుకు యత్నించారు. అయితే అప్పటికే మంత్రి శైలజానాథ్ నివాసం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. దాంతో సమైక్యవాలను మంత్రి నివాసంలోని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో శైలజానాథ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.