
పితాని ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆధార్తో ముడి పెట్టవద్దంటూ ఏబీవీపీ మంత్రి పితాని సత్యనారాయణను డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని మంత్రి నివాసాన్ని ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం ముట్టడించారు.
అనంతరం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరులో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆ సంఘం నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందులోభాగంగా మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మంత్రి నివాసం ముట్టడి కార్యక్రమానికి ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో స్థానికంగా కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.