మంత్రి శైలజానాథ్కు చీరలు,గాజులు! | High tension at minister Sailajanath house in Anantapur | Sakshi
Sakshi News home page

మంత్రి శైలజానాథ్కు చీరలు,గాజులు!

Published Fri, Dec 6 2013 11:50 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మంత్రి శైలజానాథ్కు చీరలు,గాజులు! - Sakshi

మంత్రి శైలజానాథ్కు చీరలు,గాజులు!

రాష్ట విభజనను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్ పూర్తిగా విఫలమైయ్యారని అనంతపురంలో సమైక్యవాదులు ఆరోపించారు. అందుకు నిరసనగా భారీ సంఖ్యలో సమైక్యవాదులు శుక్రవారం ఉదయం శైలజానాథ్ నివాసానికి చేరుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు.

 

రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమైన శైలజానాధ్కు చీర, గాజులు అందజేసేందుకు అనంత మహిళలు ఆయన నివాసంలోకి చోచ్చుకుపోయేందుకు యత్నించారు. అయితే అప్పటికే మంత్రి శైలజానాథ్ నివాసం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. దాంతో సమైక్యవాలను మంత్రి నివాసంలోని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో శైలజానాథ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement