hindu maha sabha
-
పిటిషన్ వేయడానికి మీరెవరు.. సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ముస్లిం మహిళలను మసీదులోకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అఖిల భారత హిందూ మహాసభ కేరళ విభాగం అధ్యక్షుడు దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళల తరుఫున పిటిషన్‌ను దాఖలు చేయడానికి మీరెవరని ఘాటుగా ప్రశ్నించింది. వారకి అన్యాయం జరగుతుందని భావిస్తే.. వారే స్వయంగా కోర్టు దృష్టికి తీసుకువస్తారని అప్పుడు ఖచ్చితంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. పిటిషన్ దాఖలు చేయడానికి మీకు ఎలాంటి అర్హత లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. వ్యక్తిగత ప్రచారం కోసమే పిటిషన్ వేశారని.. దీనిలో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ముస్లిం మహిళలను కోల్పోతున్నారని.. అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా వారిని కూడా మసీదులోకి అనుమతించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే దానిని స్వీకరించేందుకు ఎలాంటి మేరిట్ లేదని కోర్టు తోసిపుచ్చింది. కాగా గతంలో కేరళ హైకోర్టు కూడా పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని సుప్రీం ప్రస్తావిస్తూ.. దిగువ కోర్టు ఎందుకు కొట్టివేసిందో తెలుసుకోవాలని సూచించింది. -
వారిలో మార్పుకోసం 'బుద్ధి, శుద్ధి' యాగం
సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, సాహితీవేత్తలకు బుద్దిని ప్రసాదించాలని కోరుతూ అలీఘడ్‌లో 'బుద్ధి, శుద్ధి యాగం' నిర్వహించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగం ద్వారా మేధావులైన రచయితలకు బుద్ధి పునర్ప్రాప్తి జరగాలని కోరుకుంటున్నట్లు జాతీయ అధ్యక్షురాలు పూజా శకున్ పాండే తెలిపారు. జాతీయ అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా దేశ ప్రతిష్ఠకు, జాతీయ సమైఖ్యతకు భంగం వాటిల్లే చర్యలకు రచయితలు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రతువు ద్వారా వారిలో మార్పును ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ హేతువాద రచయిత నరేద్ర దబోల్కర్, కన్నడ రచయిత కాల్బుర్గీల హత్యల నేపథ్యంలో ఇటీవల రచయితల హత్యల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 40 మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చారు. దేశంలో భావప్రకటన స్వేచ్చకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ.. రచయితలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.