లిఫ్ట్ ఇస్తామంటూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను దోచేశారు!
ఆఫీసు నుం1చి ఇంటికి వెళ్దామని కారులో బయల్దేరిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది అతడిచి చితక్కొట్టి అతడి నుంచి రూ. 25వేలు దోచుకున్నారు. గడిచిన 45 రోజుల్లో పుణెలో ఇలాంటి దోపిడీ జరగడం ఇది మూడోసారి. ప్రధానంగా హింజెవాడి ఐటీ పార్కు, దాని పరిసరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులను దోపిడీ దొంగలు టార్గెట్ చేసుకుని, వాళ్ల మీద దాడి చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటం, అక్కడివాళ్లు రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసి తిరిగి వెళ్లడం లాంటి పరిస్థితులు వాళ్లకు అనుకూలిస్తున్నాయి.
అమోల్ అనంత్ హతీమ్ (25) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాత్రి 8.15 గంటల సమయంలో తన పని ముగించుకున్నాడు. సాధారణంగా రోజూ అతడు పుణె మెట్రోపాలిటన్ బస్సుల్లో వెళ్తాడు. కానీ అరగంట పాటు బస్సురాలేదు. అప్పుడే ఓ కారు వచ్చింది. డాంగే చౌక్ వరకు తీసుకెళ్తానని డ్రైవర్ చెప్పాడు. యఅఇతే కారులో అప్పటికే నలుగురు ఉన్నారు. ముందు ఇద్దరు, వెనక ఇద్దరు ఉన్నారు. ఆ కారు భుంకర్ చౌ్ వైపు వెళ్తుండగా, ఉన్నట్టుండి డ్రైవర్ రూటు మార్చాడు. దాంతో అనుమానం వచ్చిన హతీమ్ఓ అతడిని ఆపమని చెప్పేలోగానే కారు వేగం పెరిగింది. పక్కన ఉన్నవాళ్లు అతడిని కొట్టారు. అతడి ఏటీఎం కార్డు లాక్కుని, పిన్ నెంబరు చెప్పాలని బలవంతపెట్టారు. తొలుత తప్పు నెంబరు చెప్పినా, వాళ్లు చంపేస్తామని బెదిరించడంతో అసలు నెంబరు చెప్పాడు. దాంతో వాళ్లు ఏటీఎం సెంటర్ వద్దకువెళ్లి నాలుగుసార్లుగా రూ. 25వేలు డ్రా చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.