historical agreement
-
ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
వాషింగ్టన్: నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలించి గురువారం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా, అరబ్ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్ చొరవతో తెరపడింది. ‘‘మాకు అత్యంత మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూఏఈల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది’’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ చారిత్రక దినం అంటూ ట్వీట్ చేశారు. అరబ్ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ట్వీట్ చేశారు. -
ట్రంప్-కిమ్ : రేపే చరిత్రాత్మక భేటీ
సింగపూర్: కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపన లక్ష్యంగా అమెరికా–ఉత్తర కొరియా అధినేతల మధ్య మంగళవారం సింగపూర్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశం కోసం సర్వం సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక భేటీ కోసం ఆదివారం సాయంత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ చేరుకున్నారు. మంగళవారం సింగపూర్‌లోని కపెల్లా హోటల్లో ట్రంప్, కిమ్ భేటీ జరగనుంది. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై కొనసాగుతున్న ప్రతిష్టం భనకు పరిష్కారం చూపడమే ఎజెండాగా ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. కెనడాలో జరుగు తున్న జీ–7 సదస్సును ముగించుకుని ట్రంప్ నేరుగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సింగపూర్ చేరుకు న్నారు. అంతకు కొద్ది గంటలముందు ప్రత్యేక విమానంలో కిమ్ సింగపూర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో కిమ్‌కు సింగపూర్ విదేశాంగ మంత్రి వి.బాలకృష్ణన్ స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ ఆయన సెయింట్ రెగిస్ హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్‌తో భేటీ అయ్యారు. ‘యావత్ ప్రపంచం ఉ.కొరియా, అమెరికా మధ్య జరగనున్న చారిత్రక సదస్సు కోసం ఎదురుచూ స్తోంది. భేటీ కోసం మీరు చేసిన ఏర్పాట్లకు ధన్యవాదాలు’ అని లీకి కిమ్ చెప్పారు. అణ్వాయుధాల్ని విడిచి పెట్టేందుకు ఉత్తరకొరియా అంగీకరిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు సింగపూర్ ప్రధాని లీతో ఆయన భేటీ కానున్నారు. ఉ.కొరియా అణ్వస్త్రాల్ని విడిచిపెడుతుందా? అయితే సదస్సు విజయవంతంపై పలు సందేహాలు నెలకొన్నాయి. అమెరికా ప్రధాన భూభాగంపై కూడా దాడిచేయగల సత్తా ఉన్న ఉత్తర కొరియా.. ఎంతో కష్టపడి సాధించుకున్న అణ్వాయుధాల్ని వదులుకు నేందుకు అంత సులువుగా అంగీకరిస్తుందా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై చర్చల్లో పాల్గొనడం కిమ్‌కు ఇదే మొదటిసారి కావడంతో సదస్సు సందర్భంగా ఎలా వ్యవహరిస్తారో? అన్న ఆసక్తి నెలకొంది. 2011లో ఉత్తర కొరియా అధినేతగా కిమ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడు సార్లు మాత్రమే విదేశీ భూభాగంపై అడుగుపెట్టారు. రెండు సార్లు చైనాలో పర్యటించగా.. గత నెల్లో ఉభయ కొరియా సరిహద్దు ప్రాంతంలో దక్షిణ కొరియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. కాగా అమెరికా అధ్యక్షుడితో ఉత్తర కొరియా కీలక నేత ఒకరు నేరుగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి. -
మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం
తెలంగాణ బీడు భూములకు వరం ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పేటెంట్ ప్రాజెక్టుల పేరుతో నిస్సిగ్గుగా దోచుకున్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలతో బీళ్లుగా మారిన తెలంగాణ భూములకు నీళ్లు పారించే చారిత్రక ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ల మధ్య జరిగిన ఒప్పందంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యాలమవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాల అడ్డంకుల కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ ఒప్పందం కుదిరిందన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం హన్మకొండలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలాలు 1400 టీఎంసీలు, ఇందులో తెలంగాణకు 950 టీఎంసీలు రావాలన్నారు. కృష్ణానదిలో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు వస్తే ఇందులో తెలంగాణ 300 టీఎంసీల నీరు వాటా ప్రకారం రావాలన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ అవార్డు నీటి కేటాయింపులు చేసినా వాడుకోలేని దుస్థితి నాటి పాలకులదని విమర్శించారు. 1975, 2012లో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామని కాంగ్రెస్ వారు చెపుతున్నారని... ఒప్పందాలు చేసుకుంటే ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని కడియం ప్రశ్నించారు. 2015లో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించ వద్దని ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్లతో నిర్మిస్తే ఇబ్బందులు తప్పవని, నాలుగు మీటర్ల ఎత్తు తగ్గించి 148 మీటర్ల వరకు నిర్మించాలని మహారాష్ట్ర సీఎం చౌహాన్ సూచించారని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, 148కి తగ్గిస్తే 40 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో మిగతా నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. మేడిగడ్డ వద్ద 180 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తమ్మిడిహట్టి వద్ద కోల్పోయిన 160 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో 36 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పేటెంట్ అని దుయ్యబట్టారు. నాడు ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ వారు నిస్సిగ్గుగా దోచుకున్నారని విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబందించి జీఓ 123ను హైకోర్టు నిలిపివేస్తే స్వీట్లు పంచుకుని రాక్షస ఆనందం పొందారని, దీనిపై అప్పీలుకు వెళితే జీఓ నిలిపివేతను ఎత్తివేస్తే కాంగ్రెస్ నాయకులు బిక్కముఖం వేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జలయజ్ఞంపై సీబీఐ విచారణ జరుపుతుందన్నారు. వాస్తవాలు బయటపడుతాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎంపీ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయబాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.