వాషింగ్టన్: నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలించి గురువారం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయెల్‌కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా, అరబ్ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్ చొరవతో తెరపడింది. ‘‘మాకు అత్యంత మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూఏఈల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది’’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ చారిత్రక దినం అంటూ ట్వీట్ చేశారు. అరబ్ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment