history-sheeter
-
రౌడీని కొట్టి చంపిన మహిళలు
సాక్షి, సేలం (తమిళనాడు): నీళ్ల కుళాయి వద్ద దౌర్జన్యం చేసిన ఓ రౌడీని పది మందికిపైగా మహిళలు రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈరోడ్ జిల్లాలోని సిత్తోడు ఆర్ఎన్ పుదూర్ మాదేష్‌వరా నగర్‌కు చెందిన సెల్వం(38)పై పలు స్టేషన్లలో అనేక కేసులున్నాయి. ఓ హత్య కేసులో జైలు శిక్ష పడి రెండేళ్ల కిందట బెయిల్‌పై విడుదలయ్యాడు. గురువారం సాయంత్రం తాగునీటి కుళాయి వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటుండగా సెల్వం అక్కడికి వెళ్లాడు. కుళాయి కిందనున్న బిందెను పక్కకు తీసి నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్నవారు సెల్వంతో గొడవ పడ్డారు. ఆగ్రహానికి గురైన సెల్వం.. రంగనాథన్ అనే వ్యక్తి చేతిని కత్తితో నరికాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలంతా సెల్వంపై మూకుమ్మడిగా దాడికి దిగారు. రాళ్లు, దుడ్డుకర్రలు, ఇనుప రాడ్లతో చితకబాదారు. సెల్వాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రాళ్ల దాడి: 10 మంది పోలీసులకు తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ సమీపంలోని సిక్రి గ్రామంలో రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులుపై ఆ గ్రామస్థులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐలు ఆజాద్ అలీ, రణబీర్ కౌర్‌లతోపాటు పోలీసు కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... దోపిడి కేసులో రౌడీ షీటర్ పున్నా నిందితుడిగా ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల బృందం సిక్రీకి వెళ్లింది. దాంతో ఆ గ్రామస్థులు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో గ్రామస్థులంతా పోలీసులపై ముకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు అవ్వడమే కాకుండా జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సంఘటనపై సమాచారం అందుకును పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా ఎస్ఎస్పీ హెచ్ఎన్ సింగ్ వెల్లడించారు. పోలీసులపై దాడి కేసులో ఇప్పటి వరకు 13 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.