కంటెయినర్ ఢీకొని వ్యక్తి మృతి
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కంటైనర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
మృతుడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన లారీ డ్రైవర్ నర్సింహారావు (45) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.