hizrah
-
ఇంటి నుంచి పారిపోయి ... హిజ్రాగా మారి!
సాక్షి, వేములవాడ(పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా మంజంపల్లికి చెందిన వి.మహేశ్ అనే యువకుడు రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి... వేములవాడకు చేరుకున్నాడు. ఈ ప్రాంతంలోని హిజ్రాలతో చేరిపోయి తన రూపం మార్చుకుని వారితోనే తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం వేములవాడకు చేరుకుని మహేశ్ గురించి ఆరా తీశారు. వేములవాడ పరిసరాల్లోని అగ్రహారం, తిప్పాపూర్, చంద్రగిరి ప్రాంతాల్లో వెతికారు. పట్టణంలోని జాత్రాగ్రౌండ్ వద్ద మహేశ్ కనిపించడంతో ఇంటికి రమ్మని ప్రోద్బలం చేశారు. ఈ క్రమంలో హిజ్రాలకు మహేశ్ తల్లిదండ్రులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి మహేశ్ కాళ్లు కట్టేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మంజంపల్లిలో ఆస్తిపరులుగా ఉన్న వీరికి ఒక్కగానొక్క కొడుకు అని, ఆ కొడుకు చెప్పాపెట్టకుండా రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లొచ్చి ఇలా హిజ్రాలతో కలసిపోయాడంటూ స్థానికులకు మహేశ్ కుటుంబ సభ్యులు రోదిస్తూ పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందేలోగానే వారు మహేశ్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది. చదవండి: అనుమానంతో భార్యను హతమార్చిన భర్త -
కొడుకును అలా చూసి పేరెంట్స్ షాక్!
అన్నానగర్: రెండేళ్ల క్రితం మాయమైన యువకుడు హిజ్రాగా తిరిగి వచ్చిన సంఘటన తిరుపూర్‌లో జరిగింది. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని చిన్న కుమారుడు ముత్తుకుమార్ (20)తిరుపూరులోని బనియన్ సంస్థలో పని చేసేవాడు. 2015 మార్చి నెలలో పనికి వెళ్లిన ముత్తుకుమార్ హఠాత్తుగా మాయమయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో వెతుకుతున్న క్రమంలో ముత్తుకుమార్ చెన్నై వ్యాసర్పాడిలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడి చేరుక్నున్నారు. హిజ్రాగా మారిన అతన్ని విచారణ చేయగా మహిళగా మారాలనే ఇంటి నుంచి బయటకి వచ్చానని, పేరును కీర్తనగా మార్చుకున్నానని తెలిపాడు. చెన్నైలో ఒకరి సహాయంతో మదురైకి వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానన్నాడు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని పోలీసుల విచారణలో చెప్పాడు. ముత్తుకుమార్ దొరికాడన్న సంతోషంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు హిజ్రాగా మారిన అతన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం పోలీసులు ముత్తుకుమార్‌ను తిరుప్పూరు కోర్టులో హాజరు చేశారు. ముత్తుకుమార్ తన ఇష్ట ప్రకారం ఉండవచ్చని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో అతను చెన్నైకి చేరుకున్నాడు.