Home Places
-
Photo Feature: ముంచెత్తిన వాన.. చిత్తడైన నగరం..
సాక్షి, వరంగల్: ఒక్కసారిగా ముంచెత్తిన వానకు నగరం విలవిల్లాడిపోయింది. లోతట్టు ప్రాంతాలు,శివారు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఎత్తిపోస్తూ కనిపించారు. ప్రధాన రహదారులకు తోడు కాలనీల్లోని అంతర్గత రోడ్లపైకి కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ముందుకు సాగారు. -
ఉగాదికి ఉషస్సు
ఏళ్ల తరబడి ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు.. ముగ్గురు ఇంట్లో ఉంటే నలుగురు బయట ఉండాలి. నలుగురి కడుపు నిండితే ఇద్దరు పస్తులుండాలి. గత ఐదేళ్లుగా ఇదీ నిరుపేదల జీవన చిత్రం. ఎక్కడైనా కాస్త జాగా ఇస్తే చిన్న గుడిసె వేసుకుని బతుకుతామంటూ కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధినీ వేడుకున్నారు. మీరైనా కనికరించండయ్యా అంటూ అధికారులకు చేతులెత్తి దండాలు పెట్టారు. పట్టించుకున్న దిక్కులేదు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నోరెత్తి అడగాల్సిన పని లేదు.. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి బాధలను కళ్లారా చూశారు. మనసుతో విన్నారు. అందుకే ఉగాది పర్వదినాన ప్రతి పేద వానికీ నివేశన స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే 1.35 లక్షల మంది నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించి ఉగాదినాటికి బడుగుల జీవితాల్లో ఉషస్సు నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో గ్రామీణ, నగర, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి నిరుపేద మహిళలు తరలిరావటంతో దరఖాస్తులు తీసుకొనేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వాటిని తహసీల్దార్లు పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 75 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంటి స్థలాల అర్హుల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు. అనంతరం అర్హుల తుది జాబితాలను వెల్లడించనున్నారు. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు గుంటూరు నగరం, మున్సిపాలిటీలో జరుగుతున్న వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేవో చూసుకుంటున్నారు. నగరంలో కొన్ని వార్డుల్లో వలంటీర్లు, కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు తీసుకోకపోవడంతోనే గ్రామసభలకు దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సభలు పూర్తయ్యే సరికి గుంటూరులో దాదాపు 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వీటి పరిశీలనకు నగరపాలక సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన మున్సిపాలిటీల్లో 40 వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇస్తామని, జనవరి వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పిస్తామని గురువారం ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. దీంతో జిల్లాలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇంటి స్థలాల కోసం అర్హులైన జాబితాలను సిద్ధం చేస్తున్నాం. ఇందు కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తున్నాం. ఇప్పటికే అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు భూములు సేకరిస్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. – దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ గుంటూరు -
చాయ్ అమ్మిన గడ్డపై తొలిసారి!
బాల్యంలో చాయ్ అమ్మిన గడ్డపై నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని హోదాలో అడుగుపెట్టారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దాదాపు మూడేళ్ల తరువాత సొంత పట్టణం వడ్నగర్లో పర్యటించారు. రోడ్ షోకు భారీగా హాజరైన జనసందోహాన్ని చూసి కాన్వాయ్ దిగి వారితో మమేకమయ్యారు. తాను చదువుకున్న బీఎన్ హైస్కూల్‌ను సందర్శించారు. అక్కడే భావోద్వేగంతో నేలపైనున్న మట్టిని బొటనవేలితో తీసుకుని తిలకంలా దిద్దుకున్నారు. పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రధాని ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, భోలేనాథుడి ఆశీస్సులే తననీ స్థాయికి తెచ్చాయన్నారు. వడ్నగర్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో రెండోరోజు పర్యటన సందర్భంగా మోదీ తను పుట్టిన ఊరు వడ్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలిసారిగా పుట్టిన ఊరికి వచ్చిన మోదీకి వడ్నగర్లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రోడ్‌షోలో భారీ సంఖ్యలో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ కాన్వాయ్ దిగి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత తాను చదువుకున్న పాఠశాలను సందర్శించారు. వడ్నగర్లోని రైల్వేస్టేషన్లోనే మోదీ అప్పట్లో చాయ్ అమ్మేవారనే సంగతి తెలిసిందే. ‘వడ్నగర్ ప్రజలు చూపించిన ప్రేమను చూసి గర్వపడుతున్నాను. దేశానికి మరింత ఉత్సాహంగా సేవచేసేందుకు ఈ ప్రజాభిమానం కొత్త శక్తినిచ్చింది. నాతో మాట్లాడేందుకు వచ్చిన వారందరినీ చూస్తుంటే బాల్యం గుర్తుకొచ్చింది’ అన్నారు. వడ్నగర్ ఇచ్చిన కానుకిదే! వడ్నగర్లో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీని మోదీ ప్రారంభించారు. టీకాల కార్యక్రమాన్నీ ప్రారంభించిన మోదీ పలువురు చిన్నారులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో సంభాషించారు. అనంతరం బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘నా ప్రయాణం వడ్నగర్ నుంచి మొదలైంది. నేనిప్పుడు కాశీకి చేరుకున్నా. వడ్నగర్ (శతాబ్దాల పురాతన శివాలయం ఉంది) లాగే.. కాశీ కూడా భోలేనాథుడి క్షేత్రం. శివుడి ఆశీర్వాదం నాకు ఎనలేని శక్తినిచ్చింది. ఇది వడ్నగర్ నుంచి నాకు అందిన గొప్ప కానుక. శివుడి ఆశీర్వాదంతోనే నాకు విషాన్ని జీర్ణించుకునే శక్తి వచ్చింది. ఈ ఆశీర్వాదం కారణంగానే 2001 నుంచి నాపై విషం చిమ్ముతున్న వారందరికీ సమాధానం ఇవ్వగలుగుతున్నా’ అని అన్నారు. వడ్నగర్ తనకు గరళాన్ని కంఠంలో దాచుకోవటాన్ని నేర్పిందాన్నరు. యూపీఏకు వైద్య విధానమే లేదు దేశవ్యాప్తంగా నేటి వైద్యరంగ దురవస్థకు యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణమని మోదీ దుయ్యబట్టారు. ‘యూపీఏ ప్రభుత్వ విధానాల వల్ల తక్కువ మందికే వైద్య కళాశాలల్లో సీట్లు దక్కేవి. దీని కారణంగా దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. అందుకే మేం ప్రతీ మూడు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాలను స్థాపించాలని నిర్ణయించాం’ అని మోదీ అన్నారు. ప్రభుత్వ చొరవతో స్టెంట్లు, మందుల ధరలు భారీ తగ్గాయన్నారు. భరూచ్‌లో గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్, కెమికల్స్‌లో రూ.550 కోట్లతో కెమికల్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీంట్లో ఏడాదికి 2లక్షల మిలియన్ టన్నుల డై కాల్షియం ఫాస్పేట్ ఉత్పత్తి అవుతుంది. ‘విస్తృత మిషన్ ఇంద్రధనుష్’ ప్రారంభం దేశంలో ఏ చిన్నారీ నిర్మూలన సాధ్యమైన వ్యాధుల ద్వారా బాధపడకూడదని ప్రధాని పేర్కొన్నారు. విస్తృతమైన టీకా కార్యక్రమం ‘ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్’ (ఐఎంఐ)ను వడ్నగర్లో మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రెండేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికీ, వ్యాధినిరోధక టీకాలు తీసుకోని గర్భిణులందరికీ టీకాలు అందజేయనున్నారు. ప్రధాని ప్రారంభించటంతోనే అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా 2018 జనవరి వరకు ఏడురోజుల టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 173 జిల్లాలు, 17 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020 కల్లా దేశంలో ప్రతి చిన్నారికీ టీకాలు అందాలని సంకల్పించిన ప్రభుత్వం.. 2018 డిసెంబర్‌లోపే 90 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఐఎంఐ పథకాన్ని ప్రారంభించింది. నాలుగు దశల్లో అమలుచేసిన మిషన్ ఇంద్రధనుష్ ద్వారా నేటివరకు రూ.2.53 కోట్ల మంది చిన్నారులు, 68 లక్షల మంది గర్భిణులకు వ్యాధినిరోధక టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రి నడ్డా స్పష్టం చేశారు. -
పట్టాలు సరే.. స్థలాలు ఎక్కడ?
- రెవెన్యూ అధికారులకు లబ్ధిదారుల ప్రశ్న - కలకలం రేపిన వికలాంగుడిఆత్మహత్యాయత్నం - జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా బాధితులున్నట్లు అంచనా కర్నూలు(అగ్రికల్చర్): తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకుచావండి అన్నట్టుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు. రాజకీయ నాయకుల నుండి వచ్చే సిఫార్సులు, ఇతరత్రా వచ్చే ఒత్తిళ్లకు లొంగి పేదలకు హడావుడిగా ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇస్తున్నారు.. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ పట్టాలకు సంబంధించిన స్థలాలు మాత్రం చూపడంలేదు. ఈ విషయంలో ఒక్కరు, ఇద్ద రు కాదు... వేలాదిగా లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నా అధికారుల తీరులో మార్పులేకపోవడం గమనార్హం. కల్లూరు మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన వికలాంగుడు రాముడికి పట్టా ఇచ్చినప్పటికీ స్థలం చూపడంలో కల్లూరు తహశీల్దార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గత సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందిం చిన కలెక్టర్ వెంటనే అతనికి ఇంటి స్థలం చూపించాలని కర్నూలు ఆర్డీఓ, కల్లూరు తహశీల్దార్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆగమేఘాల మీద ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రాముకు ఇంటిస్థలం చూపారు. అయితే ఈ సమస్య రాము ఒక్కడిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా 10వేల మంది ఉంటారని అంచనా. నగరంలోనే దాదాపు 5వేల మంది ఉన్నట్లు సమాచారం. 2009 వరదల కారణంగా.. 2009లో కర్నూలుకు వరదలు రావడంతో పునరావాసం కింద నగరవాసులకు కల్లూరు మండలం తడకనపల్లి, కర్నూలు మండలం రుద్రవరంలో ఇంటి స్థలాలు కేటాయించారు. సుమారు 50వేల మందికి 2011లో అప్పటి చిన్ననీటి పారుదలమంత్రి టీజీ వెంకటేష్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీదు ఈ పని చేశారు. నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లబ్ధిదారులు మాత్రం పట్టాలు చేతపట్టుకుని స్థలాలు చూపాలంటూ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా తడకనపల్లి, రుద్రవరంలో కర్నూలు, కల్లూరు వాసులకు పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపాలని ఏడాది నుంచి కోరుతున్నారు. కానీ అధికార యంత్రాంగం చెవికెక్కించుకోలేదు. - కల్లూరు మండలం తడకనల్లిలో 2011లో సర్వే నెం. 337, 338లో కర్నూలుకు చెందిన వేలాది మందికి పట్టాలు ఇచ్చారు. - కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెం దిన 1000మంది సర్వేనెంబరు 277లో, 2013లో ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇచ్చారు. - కర్నూలు మండలం రుద్రవరంలో నగరానికి చెందిన 2వేల మందికి 2012లో పట్టాలిచ్చారు.