అక్టోబర్ 2న హోమ్షాప్18 స్పెషల్ సేల్స్
హైదరాబాద్: అక్టోబర్ అమ్మకాలకు ఈ కామర్స్ సంస్థలన్నీ సిద్ధమవటంతో తానూ బరిలో ఉన్నట్లు హోమ్షాప్-18 సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న తమ ప్రత్యేక అమ్మకాలు మొదలవుతాయని, ఆ రోజు ఉదయం 6 గంటల నుంచీ తమ చానల్లో ప్రత్యేక వస్తువుల ప్రదర్శన ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆఫర్లన్నీ హోమ్షాప్-18 వెబ్ పోర్టల్లో కూడా లభిస్తాయని తెలిపింది.