homemakers
-
International Women's Day 2025: హోమ్ మేకర్‌కు వేతనమేదీ?
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్‌లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్‌ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. -
సోషల్‌మీడియా ద్వారా గృహిణుల ఆదాయం తెలిస్తే...
ముంబై: సోషల్ మీడియాలో గృహిణుల దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ అభివృద్దిని ఎక్కువగా మహిళలే అందిపుచ్చుకున్నట్టు సర్వేలో తేలింది. ఇ-కామర్స్ బూమను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నభారతీయ మహిళలు భారీగా అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారట. తాజా నివేదిక ప్రకారం 20లక్షలమంది(2 మిలియన్ల) హోం మేకర్స్ సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని లెక్కల్లో తేలింది. దీనికి స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగడం కూడా కారణమని పేర్కొంది. వాట్సాప్, ఫేస్బుక్ ప్లాట్ ఫాం ల ద్వారా దాదాపు 2మిలియన్ మంది హోమ్మేకర్స్ 9 బిలియన్ డాలర్ల ( సుమారు 58వేల కోట్లు) మేర ఆదాయం సమకూర్చుకున్నారని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ ఒక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా గృహిణులు లైఫ్ స్టైల్ వస్తువులు, దుస్తులు విక్రయ, పునఃవిక్రయాలు చేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. వివాహ తదితర వివిధ కారణాల రీత్యా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయినా కూడా తమ వ్యాపారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని తెలిపింది. దీంతో ప్రాంతాలు మారినా ఈ కామర్స్ విధానం వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండటంలేదని పేర్కొంది. దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం భారీగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ లాంటి ఇ-కామర్స్ మేజర్ల లావాదేవీలు భారీగా జరుగుతున్నాయని తెలిపింది. ప్రాథమిక ఇంటర్నెట్ ఉపకరణాల ద్వారా సుమారు 8-9 బిలియన్ డాలర్ల గరిష్ట అమ్మకాలతో వీటి వ్యాపారాన్ని విస్తరణకు తోడ్పడ్డాయని పేర్కొంది. అంతేకాదు 20202 నాటికి ఇది 48-60 బిలియన్ చేరుతుందని కూడా నివేదించింది. -
వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా 9 బిలియన్ డాలర్లు
గృహిణి అంటే ఇంట్లో పనులను చక్కదిద్దుతారనేది అందరి భావన. కానీ కొందరు మహిళలు గృహిణి అనే పదానికి కొత్త అర్ధాన్ని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాలు విరివిరిగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో వాటిని 'క్యాష్' చేసుకుంటున్నారు గృహిణులు. తమకు చేతనైనా వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా అమ్ముతు భర్తలకు ధీటుగా అర్జిస్తున్నారు. భారత్‌లో ఈ తరహా బిజినెస్ రూ.580,34,25,00000 (9 బిలియన్ డాలర్లు)లకు చేరిందని ఓ రిపోర్టు వచ్చింది. ఈ అమౌంట్‌ను చూసిన పలువురు బిజినెస్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 20 లక్షల మంది భారతీయ గృహిణులు లైఫ్‌స్టైల్, దుస్తులను వాట్సాప్, ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా అమ్ముతున్నట్లు రిపోర్టును ప్రకటించిన సంస్ధ జిన్నోవ్ పేర్కొంది. 2022 కల్లా గృహిణులు సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదించే ఆదాయం 48 బిలియన్ల నుంచి 60 బిలియన్లకు చేరుతుందని తెలిపింది. ఇలా ఆన్లైన్ల అమ్మకాలు జరుపుతున్న గృహిణుల్లో ఎక్కువగా గతంలో భౌతికంగా వ్యాపారం నిర్వహించిన వాళ్లు ఉన్నట్లు వివరించింది. పలు ఈ-కామర్స్ సంస్ధల నుంచి ప్రొడక్ట్‌లను సేకరిస్తున్న గృహిణులు రీసేల్ ద్వారా 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని పొందుతున్నట్లు వెల్లడించింది.