వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా 9 బిలియన్ డాలర్లు
గృహిణి అంటే ఇంట్లో పనులను చక్కదిద్దుతారనేది అందరి భావన. కానీ కొందరు మహిళలు గృహిణి అనే పదానికి కొత్త అర్ధాన్ని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాలు విరివిరిగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో వాటిని 'క్యాష్' చేసుకుంటున్నారు గృహిణులు. తమకు చేతనైనా వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా అమ్ముతు భర్తలకు ధీటుగా అర్జిస్తున్నారు.
భారత్‌లో ఈ తరహా బిజినెస్ రూ.580,34,25,00000 (9 బిలియన్ డాలర్లు)లకు చేరిందని ఓ రిపోర్టు వచ్చింది. ఈ అమౌంట్‌ను చూసిన పలువురు బిజినెస్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 20 లక్షల మంది భారతీయ గృహిణులు లైఫ్‌స్టైల్, దుస్తులను వాట్సాప్, ఫేస్‌బుక్ మాధ్యమాల ద్వారా అమ్ముతున్నట్లు రిపోర్టును ప్రకటించిన సంస్ధ జిన్నోవ్ పేర్కొంది.
2022 కల్లా గృహిణులు సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదించే ఆదాయం 48 బిలియన్ల నుంచి 60 బిలియన్లకు చేరుతుందని తెలిపింది. ఇలా ఆన్‌లైన్ల అమ్మకాలు జరుపుతున్న గృహిణుల్లో ఎక్కువగా గతంలో భౌతికంగా వ్యాపారం నిర్వహించిన వాళ్లు ఉన్నట్లు వివరించింది. పలు ఈ-కామర్స్ సంస్ధల నుంచి ప్రొడక్ట్‌లను సేకరిస్తున్న గృహిణులు రీసేల్ ద్వారా 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని పొందుతున్నట్లు వెల్లడించింది.