Honorary remuneration
-
1న వలంటీర్లకు గౌరవ వేతనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ ఒకటో తేదీన గౌరవ వేతనం జమ చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 1,92,848 మంది గ్రామ వలంటీర్లకు గాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని.. అందులో 1,50,661 మందికి గౌరవ వేతన చెల్లింపులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందినట్టు పేర్కొన్నారు. వారికి ఒక్కొక్కరికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య కాలానికి చెల్లించాల్సిన రూ.7,500 గౌరవ వేతనం అక్టోబర్ 1న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. వివిధ సాంకేతిక కారణాలు, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వలంటీర్ల గౌరవ వేతనం సప్లిమెంటరీ బిల్ ద్వారా మిగిలిన అందరికీ అక్టోబర్ మొదటి వారంలో జమ చేస్తామని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం అందించే ఏజన్సీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. వారికి నెలనెలా ఇచ్చే రూ.1000 గౌరవ వేతనాన్ని రూ. 3000లకు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మధ్యాహ్న భోజన పథకం-అక్షయపాత్ర, పాఠశాలల మౌలికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నాతాధికారులతో సమీక్షించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ సమావేశం కావాలని స్పష్టం చేశారు. ఇకపై ఈ పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’ గా పిలుస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 లక్షలకుపైగా విద్యార్థులున్నారని, వీరంతా పాఠశాలలకు పూర్తిస్థాయిలో హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, అక్షయపాత్ర నిర్వాహకులు సత్యగౌడ చంద్రదాస్, వంశీధర దాస, నిష్కింజన దాస పాల్గొన్నారు. -
1,840 ఆలయాలకు ధూప దీప నైవేద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,840 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉన్న 1,805 దేవాలయాలతోపాటు మరో 3 వేల ఆలయాల్లో అమలు చేయాల్సి ఉందని, తొలిదశలో భాగంగా 1,840 దేవాలయాలకు వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధూప, దీప, నైవేద్య పథకం కింద చేసే ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోకపోతే ఆ గుడికి ఎప్పుడైనా సాయా న్ని నిలిపేస్తామన్నారు. ధూప దీప నైవేద్య పథకాన్ని సెప్టెంబర్ నుంచే వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే దేవాలయాలకు పునర్వైభవం వచ్చి ందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 66 బంజారా దేవాలయాల్లోని పూజారులు, బావోజీలు, సాధు సంతులకు చోటు కల్పించినట్లు వెల్లడించారు. విశ్వకర్మల, మార్కండేయ దేవాలయా ల్లోని అర్చకులకూ గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్తగా ఇచ్చిన 1,840 ఆలయాలకు ఏడాదికి రూ.14.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 3,645 ఆలయాల అర్చకులకు ఏడాదికి రూ.27.5 కోట్లను గౌరవవేతనం ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 కొత్త ఆలయాల నిర్మాణంతోపాటు జీర్ణోధరణకు సర్వ శ్రేయో నిధి నుంచి రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. -
దేశ రక్షణకు సర్పంచ్ గౌరవ వేతనం
భువనేశ్వర్ : ప్రాణాల్ని పణంగా పెట్టి కంటి మీద కునుకు లేకుండా సరిహద్దు ప్రాంతాల్లో దేశ ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రక్షణ దళంపట్ల ఓ పంచాయతీ సర్పంచ్ దృష్టి సారించారు. ఆమెకు లభిస్తున్న గౌరవ వేతనాన్ని దేశ రక్షణ వ్యవహారాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. లాంచనంగా ప్రతి నెల రూ.1 గౌరవ వేతనంగా స్వీకరించి మిగిలిన సొమ్మును దేశ రక్షణకు అంకితం చేసేందుకు నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించారు. ఈ మహత్తర నిర్ణయం తీసుకున్న సర్పంచ్ మహిళ కావడం మరో విశేషం. ఆమె పదవీకాలంలో కొనసాగినంత కాలం తనకు లభించే గౌరవ వేతనంలో రూ.1 మినహా మిగిలిన మొత్తం దేశ రక్షణ కోసం అంకితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 72వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని భద్రక్ జిల్లా తిహిడి సమితి మహారామ్పూర్ పంచాయతీ మహిళా సర్పంచ్ అలైలాప్రభ రౌల్ దేశ రక్షణ కోసం తన గౌరవ వేతనం అంకితం చేసినట్లు ప్రకటించారు. స్థానిక సమితి కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పతాకం ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. తన విరాళం మొత్తాన్ని చెక్ రూపంలో సమితి అభివృద్ధి అధికారికి అందజేశారు. ఈ విధానం తాను పదవిలో కొనసాగినంత కాలం నిరవధికంగా కొనసాగుతుందని ఆమె ప్రజల సమక్షంలో ప్రకటించారు. -
ఆలయాల్లో వెలగని ‘దీపం’
మోర్తాడ్ : భక్తుల కోరికలను మన్నించే దేవుడు ప్రభుత్వ కటాక్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధూప, దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వకపోవడంతో ఆలయాల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని అర్చకులు వాపోతున్నారు. ధూప, దీప నైవేద్యాలతో పాటు అర్చకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.2,500 చొప్పున నిధులను మంజూరు చేస్తుంది. అయితే ఆరు నెల లుగా ప్రభుత్వం నిధులను కేటాయిం చక పోవడంతో ధూప దీప నైవేద్యాలకు భక్తులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు అర్చకులు పేర్కొన్నారు. 2007లో ధూపదీప నైవేద్యాల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో జిల్లాలో 189 ఆలయాలను పథకం కింద దేవాదాయ ధర్మదాయ శాఖ ఎంపిక చేసింది. ఇటీవలే మరి కొన్ని కొత్త ఆలయాలను దేవాదాయ శాఖ చేర్చింది. ఆలయ అర్చకుని వేతనం కోసం రూ. 1500, నూనె, అగర్బత్తీలు, ప్రసాద సామాగ్రి ఇతర సరుకుల కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం ఆరంభం కాక ముందు గ్రామాభివృద్ధి కమిటీలు, ఆలయ కమిటీలు ఆలయాల నిర్వహణకు నిధులను కేటాయించేవి. పథకం ప్రారంభం అయిన నుంచి గ్రామాభివృద్ధి కమిటీలుగాని, ఆలయ కమిటీలు గాని నిధులను ఇవ్వడం లేదు. అర్చకులకు వేతనం సరిపోక పోయినా పౌరోహిత్యంపై వచ్చే ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు. ఆరు నెలల నుంచి ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం లేదు. ఆలయాల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయా ల్సి ఉంటుంది. దీపారాధనకు నూనె ఎక్కువగానే వినియోగం అవుతుంది. దేవునికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెట్టాలి. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరగడంతో ప్రసాదానికి వినియోగించే సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆలయాల నిర్వహణకు ప్రభుత్వం తక్కువగానే నిధు లు ఇస్తున్నా సకాలంలో నిధులు మం జూరు చేస్తేనే నిర్వహణ సాధ్యం అవుతుందని అర్చకులు చెబుతున్నారు. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లోనూ, దసరా ఉత్సవాల సందర్భంగా ఆల యాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్బాల్లో నిధులు ఎక్కువగా అవసరం అవుతాయి. అయితే ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖకు నిధులను కేటాయించక పోవడంతో ధూప, దీప నైవేద్యాలకు నిధుల కేటాయింపు సాధ్యపడలేదు. జిల్లాకు దాదాపు రూ. 35 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది.