honour killings
-
ప్రేమించడం కారణంగానే చనిపోతున్నారు: చీఫ్ జస్టీస్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ప్రేమించడం వల్లే ప్రతి ఏడాది వందలాది మంది యువకులు మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన అశోక్ దేశాయ్ స్మారక ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఉపన్యాసంలో న్యాయమూర్తి చంద్రచూడ్ చట్టం, నైతికత అనే అంశాలపై ప్రసంగించారు. లీగల్ న్యూస్ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ ప్రకారం..నెతికతో ముడిపడిన బ్రెస్ట్ ట్యాక్స్, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్, మంబైలో బార్ డ్యాన్స్‌పై నిషేధం, వ్యభిచారం తదితర కేసులు గురించి ప్రస్తావిస్తూ...ఆదిపత్య సముహాలు బలహీన వర్గాలను అధిగమించే ప్రవర్తన నియమావళే నైతికతను నిర్ణయిస్తుందన్నారు. బలహీనమైన అట్టడుగు వర్గాల సభ్యులకు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అదీగాక అణిచేత వేత వర్గాల చేతిలో అవమానింపబడే వేర్పాటువాదం కారణంగా సమాజంలో బలహీన వర్గాల వారు ప్రతివాద సంస్కృతిని సృష్టించలేకపోతున్నారని అన్నారు. ఒక వేళ బలహీన వర్గాలు అభివృద్ది చెందుతుంటే.. వారిని అణిచివేసేలా కొన్ని ప్రభుత్వ సముహాలు తమ అధికారాన్ని వినయోగిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి బలహీన వర్గాలు పురోగతిని సాధిస్తున్నప్పటికి వారిని సామాజిక నిర్మాణంలో దిగువన ఉంచడంతో వివక్షతను ఎదుర్కొంటూనే ఉంటున్నారని చెప్పారు. అలాగే ఒకరికి న్యాయం అనిపించింది మరోకరికి న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. 1991లో ఉత్తప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఎలా చంపారనే కథనం గురించి విరించారు. వాస్తవానికి వారు నివశిస్తున్న సమాజంలో ప్రవర్తన నియమావళిని అనుసరించి ఇది అక్కడ సమంజసం కావచ్చు. వాస్తవానికి చట్టం ప్రకారం ఇది హేతబద్ధమైన చర్య, ఘోరమైన నేరం కూడా. కొన్ని నెలల వాదనల అనంతరం అక్కడి గ్రామస్తులు ఈ నేరాన్ని అంగీకరించారని కూడా చెప్పారు. ప్రస్తుతం యువత తమ కులానికి వ్యతిరేకంగా ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం కారణంగా పరువు హత్యలకు దారితీసి చంపబడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని సుప్రీం కోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ...న్యాయాన్ని సరిదిద్దాం. రాజ్యంగ నైతికత వ్యక్తుల హక్కులపై దృష్టి పెడుతూ...సమాజంలో నైతికతను కాపడుతుందని చెప్పారు. భారత రాజ్యంగం ప్రజల కోసం రూపొందించబడింది కాదని, ఫ్రాథమిక హక్కలు ప్రకారం వారు ఎలా ఉండాలో చెబుతోంది. ఇదే మన రోజువారీ జీవితాన్ని మార్గ నిర్దేశిస్తుందని చెప్పారు. (చదవండి: ఈవెంట్‌కి వెళ్లకుండా అడ్డుకుందని..సుత్తితో కొట్టి..పది ముక్కలుగా కోసేశాడు) -
పరువు హత్య: డ్రైవర్‌ను ప్రేమించిందని కూతురిని చంపేసిన సర్పంచ్!
పాట్నా: కింది స్థాయి వ్యక్తిని ప్రేమించిందనే కారణంగా సొంత కూతురినే చంపేశారు తల్లిదండ్రులు. యువకుడితో పాటు కూతురిని రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ అమానవీయ సంఘటన బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో కలకలం సృష్టించింది. యువకుడు వారి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, ఇరువురు ప్రేమించుకున్నారనే కోపంతోనే యువతి తల్లిదండ్రులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత యువకుడు లఖో పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజపుర్ దుమ్రీ ప్రాంతానికి చెందిన రామ్‌నును పాసవాన్(25), యువతి అయోధ్య బారీ గ్రామ సర్పంచ్ కూతురు రూపమ్ కుమారిగా గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై డ్రైవర్‌తో పాటు యువతి మృతదేహం లభించటంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామ సర్పంచ్ అయిన యువతి తల్లి అనితా దేవి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. డ్రైవర్‌తో కూతురు ప్రేమలో పడటం ఇష్టంలేని అనితీ దేవీ ఈ హత్యలు చేసినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. యువకుడు చాలా కాలంగా సర్పంచ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ కారణంగానే వారి ప్రేమకు అడ్డు చెప్పారని తెలిపారు. ‘ట్రాక్టర్‌లోని ఇసుకను దించేందుకు సాయం చేయాలని డ్రైవర్‌కు సర్పంచ్ అనితా దేవీ సూచించగా.. వారి ఇంటికి వెళ్లాడు రామ్‌నును. ఈ క్రమంలోనే సర్పంచ్, ఆమె అనుచరులు దాడి చేసి హత్య చేశారు.’ అని మీడియాకు వెళ్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను ముందుగా తోసిపుచ్చారు అనితా దేవీ. రామ్‌నును పాసవాన్‌తో కలిసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బుకాయించే ప్రయత్నం చేశారు.‘చాలా కాలంగా మా ఇంట్లో పని చేస్తున్న డ్రైవర్‌తో నా కూతురు ప్రేమలో పడింది. ఆ విషయం తెలిసిన క్రమంలో అతడిని పనిలోంచి తీసేశాం. దీంతో వారు ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు.’అని సర్పంచ్ అనితా దేవీ పేర్కొన్నారు. అయితే, వారి ప్రేమను ఓర్వలేకనే సర్పంచ్ అనితా దేవీ హత్య చేశారని గ్రామస్థులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Crime: అడిగినంత డబ్బిస్తేనే.. నీ న్యూడ్ వీడియో డిలీట్ చేస్తా! -
పరువు హత్యలు మానవతకు అవమానం!
దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చి 71 వసంతాలు గడిచిపోయాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానత్వం, సమ న్యాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ వివక్ష లేని సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించింది. అందులో భాగంగా ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించింది, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. దేశం కుల రహిత సమాజంగా రూపాంతరం చెంది పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించడం రాజ్యాంగ అంతిమ లక్ష్యం. ఇవే అంశాలను సుప్రీంకోర్టు 2011లో ‘కేకే భాస్కరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు’, ‘నందిని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్’ కేసుల తీర్పుల్లో స్పష్టంగా తెలియజేసింది. పురాతన ఆచార సంప్రదాయాలు మానవాళిని అభివృద్ధి పథంలో నడిపించేలా ఉండాలి. కానీ, సంప్రదాయాల చుట్టూ అవివేకంగా పరిభ్రమించేలా ఉండకూడదు. నానాటికీ పరువు హత్యల పేరుపై కులాంతర వివాహాలు చేసుకున్న వారినీ, చేసుకోవడానికి సిద్ధమైన వారినీ, వారి కుటుంబ సభ్యులనూ హత్యలు చేయడం లేదా దాడులు చేయడం ఎక్కువవుతోంది. ముఖ్యంగా నయా క్షత్రియ కులాలు, దళిత – బహుజన కులాల మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో హత్యలు/దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1936లో కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని చెప్పిన సంగతిని అందరూ గుర్తుపెట్టకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2013లో ‘లా’ కమిషన్ ఇచ్చిన 242వ నివేదిక ఆధారంగా... ప్రేమ వివాహితుల హత్యల నివారణకు చట్టాన్ని ప్రతిపాదించింది. సదరు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుండి సూచనలు, సలహాలను స్వీకరించే పనిలో ఉన్నారు. కుల అహంకార హత్యల కట్టడికి ప్రత్యేక చట్టం లేని కారణంగా ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 300 ప్రకారం హత్యకేసు నమోదు చేస్తుండడంతో... దోషులు బెయిల్ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాలు 2018లో ‘శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’, 2021లో ‘హరి వర్సెస్ స్టేట్ అఫ్ ఉత్తర ప్రదేశ్’ కేసుల తీర్పుల్లో కుల అహంకార హత్యల నివారణ, విచారణకు సంబంధించి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. దేశంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన హత్యలను జిల్లాల వారీగా లెక్కించడంతోపాటూ ఆయా జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాలో 24 గంటల హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. కులాంతర/ మతాంతర వివాహ జంటలను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణలను కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యంతో హత్యలు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అనేవి ఇందులో ముఖ్యమైనవి. (చదవండి: నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?) రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరాని తనం నిషేధితమయ్యింది కనుక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా 1989లో అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కులనిర్మూలన జరగాలన్నా, కుల అహంకారంతో చేస్తున్న పరువు హత్యలను కట్టడి చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ ‘17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలూ ప్రధాన అంశంగా తీసుకోవాలి. అలాగే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ముందుకువచ్చి పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. అప్పుడే ఈ అమానవీయ హత్యాకాండకు తెరపడుతుంది. - కోడెపాక కుమారస్వామి సామాజిక విశ్లేషకులు -
మరో పరువు హత్య కలకలం
బెంగళూరు: దేశంలో చోటు చేసుకుంటున్న వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. మనసిచ్చి మనువాడటమే వారి పాలిట శాపంగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్ సమీపంలో జరిగిన హేమంత్ హత్యోదంతం మరవక ముందే కర్ణాటలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భార్య తండ్రి చేతిలో ఓ యువకుడి(24) ప్రాణం బలైపోయింది. వివరాలు.. రాష్ట్రానికి చెందిన ఓ యువతి, లక్ష్మీపతి అనే యువకుడు 2017లో ఒకే ఫ్యాక్టరీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరిది వేరు వేరు కులాలు అవ్వడంతో తల్లిదండ్రులు పెళ్లికి అడ్డు చెప్పారు. తల్లిదండ్రులను ఒప్పించలేక పారిపోయి గత నెలలో వివాహం చేసుకున్నారు. (చదవండి: నన్ను చంపినా బావుండేది..!) ఇలా వీరి జీవనం కొనసాగుతుండగా.. తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని యువతి కుటుంబ సభ్యులు జీర్ణించులేకపోయారు. ప్రేమ వివాహం కారణంగా ఇరు కుటుంబాలతో ఏర్పడిన గొడవలను సర్దుమణిగించేందుకు చర్చించుకుందామని యువతి తండ్రి తన కూతురిని ఒప్పించాడు. ఇద్దరు తిరిగి ఇంటికి రావాలని, వారికి మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యువతి కుటుంబం లక్ష్మీపతితో పాటు తన అన్నయ్య నటరాజ్‌ను మగడి తాలూకా సమీపంలోని ప్రార్థన మందిరానికి తీసుకెళ్లారు. అక్కడ వారితో కొద్దిసేపు చర్చించిన అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారికి మద్యం తాగించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దుషిస్తూ, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని కలలో కూడా కోరుకోవద్దని లక్ష్మీపతిని బెదిరించారు. (చదవండి: కలకలం రేపిన పరువు హత్య) దీనికి అతను ఒప్పుకోకపోవడంతో లక్ష్మీపతిపై యువతి కుటుంబం దాడికి దిగింది. ఇంతలోనే కోపం పట్టలేని యువతి తండ్రి తన కొడుకు సాయంతో లక్ష్మీపతిని తన అన్న కళ్లేదుటే భయంకరంగా బెల్టుతో గొంతు నులిపి చంపాడు. భయాందోళనకు గురైన నటరాజ్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తన తమ్ముడి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే ఇతర కుటుంబ సభ్యులను చంపేస్తామని యువతి కుటుంబం బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రిని, సోదరుడిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. (చదవండి: హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!) -
నన్ను చంపినా బావుండేది..!
(వెబ్ స్పెషల్): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి. ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్‌మహల్ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా? హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి. చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే చావేనా? తమ పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రేమే నేరమా? తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో ప్రణయ్, మంథని మధుకర్, ఇజ్రాయిల్ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. తల్లిదండ్రులే దోషులా? ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి. -
పరువు హత్య పోస్టర్ల కలకలం
విజయవాడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో కన్నకూతురిపైనే తండ్రి హత్యాయత్నం ఉదంతాలు కలకలం రేపాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీశాయి. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న నవదంపతులు, ఇప్పటికే ప్రేమలో మునిగి పెళ్లికి సిద్ధపడుతున్న ప్రేమ పక్షుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అయితే ఈ భయాలకు ఆజ్యం పోస్తూ విజయవాడలో పరువు హత్య పోస్టర్లు సంచలనం సృష్టించాయి. విజయవాడ నగరంలోని సత్యానారాయణపురంలో దర్శమిచ్చిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. స్థానిక శివాలయ వీధిలో ఈ పోస్టర్లు వెలిశాయి. ‘పరుపు హత్యకు గురి కానున్న సోని రాహు ప్రియ’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. దీంతో కలకలం మొదలైంది. మరోవైపు ఈ వివాదాస్పద పోస్టర్లపై పోలీసులు దృష్టి సారించారు. వీటిపై ఆరా తీస్తున్నారు. అసలు సోని రాహు ప్రియ ఎవరు? ఎవరిని భయపెట్టడానికి ఈ పోస్టర్లు? ఇది కేవలం ఆకతాయిల పనేనా? లేక నిజంగానే మరో అఘాయిత్యం చోటు చేసుకోబోతోందా? ఈ దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
ప్రణయ్ హత్యపై రాంగోపాల్‌వర్మ కామెంట్
సాక్షి, హైదరాబాద్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రణయ్ హత్య పై ట్విటర్లో స్పందించారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావు ముమ్మాటికీ హంతకుడేనని అన్నారు. ఏ మాత్రం ధైర్యంలేని పిరికిపంద అని పేర్కొన్నారు. పరువు కోసం ప్రణయ్‌ని చంపానని చెప్పుకుంటున్న మారుతీరావు ఏం సాధించాడని ప్రశ్నించారు. ‘ఒకవేళ పరువు కోసమే ప్రణయ్ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును చేజేతులా బజారుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చనిపోయేందుకు సిద్ధంగా ఉండాల’ని అన్నారు. నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం ఇతరుల ప్రాణాలు తీసేందుకు వెనకాడని వారిని చంపడమేనని చెప్పుకొచ్చారు. కాగా, తక్కువ కులానికి చెందిన వ్యక్తి తన కూతురుని వివాహం చేసుకున్నాడనే కారణంగా గతవారం యువతి తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా వర్మ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. Amrutha’s father Maruti Rao is just a plain cowardly dirty criminal and getting Pranay killed is nothing to do with his honour ..if it’s a honour killing he should be ready to die .. Real honour killing will be to kill all those who will kill for honour — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2018 -
కులం రగిలిస్తున్న రక్తచరిత్ర
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తమిళనాడులో కౌసల్య, తెలంగాణలో అమృత వంటి అమ్మాయిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తుతోంది. కులం రాతిపై చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. ఓ పక్క కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నా, తమిళనాట రాజకీయంగా శక్తిమంతమైన వెనుకబడిన, అగ్రకులాలు తమ పిల్లలు దళితులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని సహించడం లేదు. ఇప్పుడు అమృత జీవితం ఎటు తిరుగుతుంది? ఆమెకూడా కౌసల్య మార్గంలోనే పయనించబోతోంది. ప్రణయ్ మరణం మతిమాలిన రక్తపాతానికి పాల్పడకూడదనే సందేశం ఇవ్వాలని అమృత కోరుకుంటోంది. కౌసల్య, అమృత–ఇద్దరూ దళిత యువకు లను ప్రేమించి పెళ్లాడారు. వారి తిరుగుబాటు ఫలితంగా వారి భర్తలు ప్రాణాలు కోల్పో యారు. తమిళనాడులోని ఉడుమలపేటలో జరిగిందే తెలంగాణ మిర్యా లగూడలో పునరావృతమైంది. తమకంటే ఉన్నత కులంగా భావించే దేవర్ వర్గానికి చెందిన కౌసల్యను దళిత ఇంజనీర్ శంకర్ 2016 మార్చిలో పెళ్లిచేసుకున్నాడు. తిరుపూర్ జిల్లా ఉడుమలపేట మార్కెట్ సెంటర్లో అతన్ని పొడిచి చంపారు. కౌసల్య కళ్లముందే జరిగిన ఈ హత్య సీసీటీవీలో రికార్డయింది. అల్లుడిని చంపడానికి కిరాయి హంత కులను పంపిన కౌసల్య తండ్రికి కిందటి డిసెంబర్లో తిరుపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే దళిత యువకుడిని కిరాయి హంతకుడు నరికి చంపాడు. వైశ్య కులా నికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే 23 ఏళ్ల ప్రణయ్ చేసిన పాపం. ఆస్పత్రి ముందు జరిగిన ఈ హత్య కూడా సీసీటీవీలో నమోదయింది. తండ్రి మారుతీరావే ప్రణయ్‌ను చంపించాడని అమృత ఆరోపించింది. ప్రణయ్‌ను కత్తితో తల నరికి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే ఈ హంతకుడిని వినియోగించి ప్రణయ్‌ను చంపడానికి కోటి రూపాయలు ఖర్చుచేశారని తెలుస్తోంది. ప్రణయ్, అమృత జనవరిలో వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. పెళ్లిని వ్యతిరేకించిన ఆమె తండ్రి గర్భస్రావం చేయించుకోమని ఒత్తిడి తేగా అందుకు అమృత అంగీక రించలేదు. శంకర్ హత్య జరిగిన కొద్ది రోజులకు కౌసల్యను కలిశాను. అప్పు డామె తన అత్తవారింట్లో శంకర్ నాయనమ్మ, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉంటోంది. అది ఒకే గది ఉన్న పూరిల్లు. కన్నవారింట్లో మరింత సౌఖ్యంగా కౌసల్య బతికింది. ‘‘శంకర్ లేకుండా బతకలేను. చాలా ఒంట రినయ్యా’’ అని కౌసల్య చెప్పింది. కులం సజీవంగా ఉన్న తమిళనా డులో దళితుడిని చంపి జైలుకెళ్లడాన్ని గర్వపడే చర్యగా పరిగణిస్తారు. తన భర్తను చంపిన కిరాయి హంతకుడు చేసిన గాయాల గుర్తులను దాచుకునేందుకు తన తలకు కౌసల్య గుడ్డ కట్టుకుంది. ఇలాంటి పరువు హత్యల వల్ల ప్రయోజనం లేదంటూ రక్తానికి కులం ఉంటుందా? అని ప్రశ్నించింది. ‘‘తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకుని పిల్లలను ఇష్ట ప్రకారం పెళ్లిచేసుకోనివ్వాలి. ఇలా చంపడం వల్ల ఏం సాధిస్తారు? నా సంగతే చూడండి. శంకర్‌ను చంపేశారు. నా తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు. నేనేమో ఒంటరినై ఇక్కడున్నాను’’ అని కౌసల్య బాధపడుతూ చెప్పింది. ఇప్పుడు అమృత మాటలు వింటుంటే కౌసల్య మరోసారి మాట్లాడినట్టే అనిపిస్తుంది. బిడ్డను కనాలనే పట్టుదలతో ఉన్న అమృత తన భర్త ప్రణయ్‌కు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. ‘‘కులాంతర పెళ్లిళ్లతోనే మనం కుల వ్యవ స్థను నిర్మూలించగలం. కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్టు దీన్ని సాధించాలి. అమానుష కుల వ్యవస్థను మనం సవాలుచేయాలి’’ అని అమృత చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కౌసల్య, అమృత వంటి అమ్మా యిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తుతోంది. కులం రాతిపై చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. ఓ పక్క దళితుల కోసం ప్రగతిశీల ఉద్య మాలు నడుస్తూ కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నా తమిళనాట రాజకీయంగా శక్తిమంతమైన వెనుకబడిన, అగ్రకులాలు తమ పిల్లలు దళితులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని సహించడం లేదు. తమ మాట వినని పిల్లలు దళితులను పెళ్లాడితే పెద్ద అవమానం జరిగినట్టు భావించే ఈ పెత్తందారీ కులాలు దళితులపై దాడులకు దిగుతున్నాయి. పైకి సాత్వికులుగా కనిపించే వ్యక్తులు ఇలాంటి పెళ్లిళ్ల కారణంగా హంత కులుగా మారుతున్నారు. దళితులను పెళ్లాడిన తమ కూతుళ్లు ఏదేమైనా తిరిగి తమ ఇళ్లకే తిరిగి రావాలని అమృత, కౌసల్య తండ్రులు కోరు కున్నారు. అది తాము విధించే పరిమితుల్లోనే కుమార్తెలు బతకడమే వారు ఆశించింది. తండ్రుల మాటే అక్కడ చెల్లుతుంది. కోర్టు తీర్పు వచ్చిన రోజున కూడా తండ్రి ముఖం చూడటానికి కౌసల్య నిరాకరిం చింది. అమృత తన తండ్రికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. కులభేదం కారణంగా తండ్రీకూతుళ్ల అందమైన బంధం నాశనమైంది. కులాంతర పెళ్లిళ్లకు సర్కారీ ప్రోత్సాహం! కులాంతర వివాహాల ప్రోత్సాహానికి తాను చేయాల్సిందంతా చేస్తున్నా నని భారత ప్రభుత్వం చెబుతోంది. వధూవరుల్లో ఒకరు దళితులైతే కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ రెండున్నర లక్షల రూపా యలు ఇస్తోంది. పైకి ఇంత చేస్తున్నట్టు కనిపిస్తున్నా రాజకీయ నాయ కులు తమ కార్యక్షేత్రాల్లో కులాంతర వివాహాలు ప్రోత్సహించడం లేదు. సంపన్న వన్నియార్, దేవర్, గౌండర్ కుటుంబాలకు చెందిన ఆడపిల్ల లను ఆకర్షించడానికి దళిత కుర్రాళ్లు రోమియోల్లాగా దుస్తులు ధరిస్తున్నా రని పీఎంకే నేత, వన్నియార్ల నాయకుడు డాక్టర్ ఎస్.రాందాస్ కొన్నేళ్ల క్రితం ఆరోపించారు. ఈ మూడు ఓబీసీ కులాలూ తమిళనాట రాజ కీయంగా శక్తిమంతమైనవి. అనేక బీసీ కులాల నేతలు రాందాస్ అభిప్రాయంతో ఏకీభవించారు. గౌండర్ కులానికి చెందిన సీకే నాగ రాజ్ తమ వర్గం కోసం కొంగు జన నాయక పార్టీ స్థాపించి 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేశారు. రాందాస్ మాదిరిగానే కులాంతర వివాహాలను నాగరాజ్ తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ‘‘అమ్మాయి వెనకాల ఒకటి రెండు నెలలు తిరుగుతారు. ఆ పిల్ల ప్రేమలో పడినాక ఆమెను తీసుకుపోతారు. ఆ అమ్మాయి పుట్టింటి నుంచి డబ్బుతోనో బంగారంతోనో వస్తుంది. లేదా ఆ యువతిని తిరిగి తమ ఇంటికి రప్పించడానికి ఆమె తల్లిదండ్రులు ఎంత సొమ్మయినా చెల్లించడానికి సిద్ధమౌతారు’’ అంటూ దళిత యువకులు బీసీ, అగ్రకులాల యువతులను వలవేసి పట్టుకుంటారని నాగరాజ్ వివ రించారు. దళితులతో ఇలాంటి పెళ్లిళ్లు మాకు అవమానం! దళిత కుర్రాళ్లతో పైన చెప్పిన ఓబీసీ కులాల యువతుల ప్రేమ పెళ్లిళ్ల గురించి నాగరాజ్ చర్చిస్తూ ‘‘ఇలాంటి పెళ్లిళ్లు మా కుటుంబానికి పెద్ద అవమానం. ఈ వివాహం జరిగాక యువతి తల్లిదండ్రులు వీ«ధుల్లో తిరగలేరు. మరో కూతురు ఉంటే ఆ అమ్మాయిని కులంలో ఎవరూ పెళ్లా డరు’’అంటూ చెప్పుకొచ్చారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని కుటుంబాలు కూడా కులానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోయంబత్తూరులోని మారియమ్మన్ గుడిలో వాచ్‌మన్‌గా పనిచేసే ముత్తుస్వామి గౌండర్‌ను కలిశాను. కులాంతర వివాహాలను మీరు సమర్థిస్తారా? అని ఆయనను ప్రశ్నించాను. ‘‘నా కొడుకు ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను అతనికి తండ్రిని కాకుండా పోతాను. నా కొడుకు జీవితం నాశనమైతే నేనెలా సంతోషంగా ఉంటాను?’’ అని గౌండర్ అడిగాడు. కులం పరువే ముఖ్యమన్న మారుతీరావు! మిర్యాలగూడలో తన కూతురు పెళ్లాడిన దళిత యువకుడు ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు కూడా పైన చెప్పినట్టే మాట్లాడాడు. తనకు కులం పరువే ముఖ్యమని మిర్యాలగూడ పోలీసులకు ఆయన చెప్పాడని తెలుస్తోంది. మారుతీరావుకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. జిల్లా రాజకీయ నాయకులందరితో అతనికి మంచి సంబంధాలున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా తమను బెదిరించారని అమృత చెప్పింది. అయితే, ఈ ఆరోపణపై పోలీసులకు ఆధారాలు లభించలేదు. తమిళనాడులో 2013–2016 మధ్య 80 వరకూ పరువు హత్యలు జరిగినట్టు వార్తలొచ్చాయి. ప్రభుత్వం మాత్రం అన్ని జరగ లేదని చెబుతోంది. తెలంగాణలో 2014 జూన్ నుంచి 19 పరువు హత్యలు జరిగాయని దళిత ఉద్యమకారులు చెప్పారు. ఈ హత్యలు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో అంటే పెద్దపల్లి నుంచి నల్లగొండ వరకూ జరిగాయి. కుల స్పృహ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థమౌ తోంది. మీడియా, ప్రజల దృష్టి అమృత–ప్రణయ్ కేసుపై నిలిచి పోవడంతో పోలీసులు ఈ కేసులో బాగా కష్టపడి నేరస్తులను గుర్తించ డానికి ప్రయత్నించారు. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలూ సహజం గానే కుల హింసను ఖండిస్తున్నారు. ప్రణయ్ హత్యను ఐటీ మంత్రి కె.తారక రామారావు ఖండిస్తూ, ఇది క్రూరమైన నేరమనీ, న్యాయం జరిగేలా చూస్తామని ట్విట్టర్లో తెలిపారు. ఈ హత్యపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడకపోవడంపై దళిత ఉద్యమకారులు అసం తృప్తితో ఉన్నారు. ఇలాంటి హత్యలు సహించేది లేదని కేసీఆర్ బాహా టంగా ఈ విషయంపై మాట్లాడితే ప్రజలకు ఇది బలమైన సందే శమౌతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి మౌనం కారణంగా ఇలాంటి దారుణ హత్యలు చేయడానికి కొందరికి ధైర్యం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమృత జీవితం ఎటు తిరుగు తుంది? ఆమె కౌసల్య మార్గంలోనే పయనించబోతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడంతో పాటు కుల హింసపై జరిగే సమావేశాల్లో మాట్లాడే అవకాశాలు లెక్కలేనన్ని వస్తాయి. ప్రణయ్ మరణం మతి మాలిన రక్తపాతానికి పాల్పడకూడదనే సందేశం ఇవ్వాలని అమృత కోరుకుంటోంది. ఇండియాలో పెళ్లిసంబంధాలు, రాజకీయాలు సైతం కులం ప్రాతిపదికనే జరుగుతున్నందున బాగా పాతుకుపోయిన కుల భేదాలు తొలగించడం అంత తేలిక కాదు. వ్యాసకర్త : టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
కులాంతర వివాహాల రక్షణకు కొత్త చట్టం
సాక్షి, ముంబై: కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులపై జరుగుతున్న దాడులను, పరువు హత్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపకల్పన చేయాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం భావిస్తోంది. దంపతులకు రక్షణ కల్పించి, ప్రోత్సాహకాలు అందించే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోల్ తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల పిల్లలకు రిజర్వేషన్లు, ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తోందని, ఢిల్లీలోని అంబేడ్కర్ ఫౌండేషన్ 2.5 లక్షల నగదు అందిస్తోందని తెలియజేశారు. మరో రెండు నెలల్లో చట్టం ముసాయిదాను సిద్ధం చేస్తామని కమిటీ చైర్మన్ సీఎస్ తూల్ ప్రకటించారు. దేశంలో కులాంతర వివాహాం చేసుకున్న జంటలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీఎస్ తూల్ అభిప్రాయపడ్డారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం పరువు హత్యల్లో మహారాష్ట్ర, దేశంలో నాలుగో స్థానంలో ఉంది. 2016 లో జరిపిన సర్వేలో మహారాష్ట్రలో 69 కేసులు నమోదు కాగా, ఎనిమిది మందిని పరువు హత్య పేరుతో హతమార్చినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. -
ఇద్దరు కూతుళ్లను దారుణంగా చంపాడు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. పరువు పేరిట తన ఇద్దరు కూతుళ్లను హత్య చేశాడు. పేషావర్ లోని అచార్ కలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ ఘని అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు షమీమ్ (20), నొరీన్ (10)లను ఈ నెల 20న దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి మోసమ్ ఘారి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి రెండు హత్యలు పరువు హత్యలుగా నిర్దారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 6న పాకిస్థాన్ పార్లమెంట్ పరువు హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
ప్రేమ జంటలు.. పరువు హత్యలు..!
విశ్లేషణ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు యువతీయువకులు పరువుహత్యలకు గురవుతూ రాజ్యాంగపరమైన జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి. యువతీ యువకులకు వివాహం చేసుకునే స్వేచ్ఛ, వారు అపరిపక్వ నిర్ణయాలతో జీవితాంతం బాధపడ కుండా కాపాడే తల్లిదండ్రుల బాధ్యత మధ్య ఘర్షణ తప్పదు. నైతిక విలువలు అంతటా దిగజారుతున్న ఈ రోజుల్లో ఏది నిజమైన ప్రేమో తెలుసుకొనే లోగానే మోసాలకు గురైన వార్తలు వింటూనే ఉన్నాం. నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ సంతానాన్నే ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు పరువు హత్య. ఇందులో పరువు ఏమీ లేదు, హత్య మాత్రం ఉంది. తమ కులాన్ని, వంశాన్ని, ఇష్టాన్ని కాదన్నారన్న ఒకే కారణంతో తమ కూతురిని ఆమెను ప్రేమించిన వ్యక్తిని హత్య చేయడానికి ఆమె కుటుంబం వెనుకాడటం లేదు. ఖాప్ పంచాయతీలు కుల సంఘాలు ఈ హత్యలను సమర్థించడం మరీ దారుణం. ఏప్రిల్ 2011లో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు మార్కండేయ కట్జూ, జ్ఞాన్ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం పరువు పేరుతో హత్యలను వ్యవస్థీకరించిన ఖాప్ పంచాయితీ లను తీవ్రంగా నిరసించింది. ఉత్తర భారతంలో ఖాప్ పంచా యితీలు, దక్షిణాన తమిళ నాడులో కట్ట పంచాయితీలు క్రూరమైన ఆదేశాలు ఇవ్వడం చెల్లవని వారిని కఠినంగా శిక్షించాలని ధర్మాసనం పేర్కొన్నది. విశ్వలోచన్ మదన్ ప్రజా ప్రయోజన వాజ్యంలో న్యాయమూర్తులు చంద్రమౌళి కె ప్రసాద్, పిసి ఘోష్‌తో కూడిన ధర్మాసనం 2014లో ఖాప్ పంచాయితీలవలె షరియత్ కోర్టులు మఫ్తి లేదా ఖాజీ తీర్పులకు కూడా చట్టబద్ధత లేదని, ఈ ఆదేశాల ఆధారంగా జరిగే పరువు హత్యలను నివారించే బాధ్యత రెవెన్యూ పోలీసు అధికారులకు ఉందని వివరించింది. తమకు తెలిసిన తరువాత అనుమానితులను అరెస్టు చేయక పోవడం, కేసులు పెట్టకపోవడం వల్ల పరువు హత్యా సంఘటనలు జరిగితే జిల్లా మెజిస్ట్రేట్ లేదా ఎస్పీ బాధ్యత వహించాలని, వారిపైన కూడా శాఖాపరమైన ఛార్జిషీటు దాఖలుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం భావించింది. ఇటువంటి సందర్భాలలో అసలు నేరస్తులతో పాటు ప్రత్యక్షంగానో పరోక్షం గానో ఈ అధికారులు కూడా బాధ్యులైనట్టు భావించాలని సూచించింది. లా కమిషన్ 2012లో ఈ అంశాన్ని పరిశీలించింది. ఒక పత్రాన్ని ప్రజాభిప్రాయ సేకరణకు విడుదల చేసింది. తమకు ఇష్టం కాని వివాహాలను నిరోధించడానికి.. జీవన, స్వేచ్ఛా హక్కులను కూడా హరించడానికి కులసంఘాలు కుల సమా వేశాలు బహిరంగంగానే దాడి చేస్తుంటే ప్రస్తుత వ్యవస్థ చట్టాలు కోర్టులు ఆపలేక పోతున్నాయని లా కమిషన్ పేర్కొన్నది. వివాహ నిర్ణయ స్వేచ్ఛలో జోక్యం చేసుకునే చట్టవ్యతిరేక సమావేశాల నిషేధపు చట్టం తీసుకురావాలని సూచించింది. బిల్లును కూడా రూపొందించింది. చట్టం వ్యతిరేకం కాని వివాహాలను ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. చట్ట సమ్మతమైన వివాహాన్ని పరువుకు భంగకరంగా భావించి ఆపే కుట్రలుచేయడం నిషేధించాలని ఈ చట్టాన్ని ప్రతిపాదించింది. కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులపైన ఈ కుట్రలను ఆపే బాధ్యతను ఉంచాలని, ఇటువంటి కుట్రల సమావేశాల్లో పాల్గొన్న వ్యక్తుల పైన 30వేల రూపాయల జరిమానా, మూడేళ్ల దాకా జైలుశిక్ష విధించాలని, వీటిని గుర్తించదగిన, బెయిల్ ఇవ్వతగని, రాజీకీ వీల్లేని నేరాలుగా నిర్ధారించాలనీ ప్రత్యేక కోర్టులో సుమోటోగా కేసులు చేపట్టే అధికారం ఉండాలనీ సూచించింది. కానీ అందరూ ఈ బిల్లును మరిచి పోయారు. నోటీసు ప్రాణాంతకం రిజిస్టర్ వివాహపు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఇది యువతీ యువకులకు ప్రాణాంతకంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు వారి మరో ప్రధానమైన రాజ్యాంగ జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి. కావలసిన చర్యలు ప్రభుత్వమే తీసుకో వాలి. మత పరమైన వివాహ చట్టాలలో, మతా తీతమైన ప్రత్యేక వివాహ చట్టంలో కూడా యువతీ యువ కుల ప్రాణ రక్షణకు కావలసిన రక్షణలేమీ లేవు. తల్లిదండ్రులకు తమ పిల్లల వివాహ నిర్ణయ సమాచారం తెలుసుకునే హక్కు లేదా అనే ప్రశ్నతోపాటే స్వయంగా వివాహ నిర్ణయం తీసుకుంటే అది చట్ట వ్యతిరేకం కాకపోయినా, తమ ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు, నోటీసు ఇవ్వకూడదనే అంశాన్ని కూడా పరి శీలించాలి. ప్రస్తుత చట్టాల ప్రకారం నోటీసు తప్పని సరి, మొత్తం ప్రపంచానికే నోటీసు ఇవ్వాలి. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్త వచ్చు అనేది ఇవ్వాళ అమలులో ఉన్న చట్టం. కాని ఎవ్వరూ వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి అక్కడ గోడకు వేలాడే (ఉంటే) నోటీసును చదువుకోవడం జరగదు కనుక రిజిస్టర్ వివా హాలు రహస్య వివాహాలైపోతున్నాయి. చట్టప్రకారం రహస్యం కాక పోయినా ఆచరణలో రహస్యమే. వివాహాన్ని రిజిస్టర్ చేయడం కోసం పెట్టుకునే దరఖాస్తులో తమ వివాహాన్ని పెద్దలు సమ్మతిస్తున్నారో లేదో తెలుసుకునే కాలమ్ లేదు. వారు వ్యతిరేకిస్తున్నారని, బెదిరిస్తున్నారని కూడా చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పటి విధానం ప్రకారం ఇవేవీ పరిశీలించకుండానే అధికారి నోటీసు జారీచేయవచ్చు. వివాహ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో తమకున్న ముప్పును వివరించి, తల్లి దండ్రులో కులపెద్దలో బెదిరిస్తున్నారనే ఫిర్యాదును కూడా చేర్చేందుకు తగిన విధంగా దరఖాస్తు ఫారాలను రూపొం దించాలని, యువతీయువకులు ఈ విషయాన్ని తప్పనిసరిగా అధికారి దృష్టికి తీసుకువచ్చే వీలు కల్పించాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ 19 (8)(ఎ)(4) కింద కేంద్ర సమాచార కమిషన్ మార్పును సూచించింది. లా కమిషన్ సూచించిన చట్టం తేవాలని కూడా సిఫార్సు చేసింది. (CIC/SA/A/2016/0015 56, శశి వర్సెస్ ఎస్‌డిఎం కేసులో 1.8.2016లో ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com