ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. పరువు పేరిట తన ఇద్దరు కూతుళ్లను హత్య చేశాడు. పేషావర్ లోని అచార్ కలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ ఘని అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు షమీమ్ (20), నొరీన్ (10)లను ఈ నెల 20న దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి మోసమ్ ఘారి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి రెండు హత్యలు పరువు హత్యలుగా నిర్దారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 6న పాకిస్థాన్ పార్లమెంట్ పరువు హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇద్దరు కూతుళ్లను దారుణంగా చంపాడు
Published Sat, Sep 23 2017 7:55 PM | Last Updated on Sat, Sep 23 2017 8:31 PM
Advertisement
Advertisement